News


టెలికంలో చౌక చార్జీల శకం ముగిసినట్లేనా?!

Monday 30th December 2019
news_main1577702481.png-30537

కనీస రీచార్జి వాలిడిటీ ప్లాన్‌ను ఒక్కసారిగా 95 శాతం పెంచుతూ ఎయిర్‌టెల్‌ తీసుకున్న నిర్ణయం, టెలికం రంగంలో చౌక చార్జీల యుగానికి శుభం కార్డు వేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఎయిర్‌టెల్‌ వినియోగదారుడు కొత్త నెంబర్‌ తీసుకుంటే చేయించుకోవాల్సిన కనీస రీచార్జి రూ. 23 ఉండేది. ఇప్పడీ చార్జీని ఎయిర్‌టెల్‌ రూ. 45కు పెంచింది. దీంతో టారిఫ్‌లు పెంచుకొని రెవెన్యూను అభివృద్ధి చేసుకోవాలన్నదే టెల్కోల ప్రాధాన్యంగా మారినట్లు తెలుస్తోందని, గతంలోలాగా తక్కువ చార్జీలతో వినియోగదారుడిని ఆకట్టుకునే యత్నాలకు టెలికం కంపెనీలు చెల్లుచీటి ఇచ్చినట్లేనని నిపుణుల అభిప్రాయం. దాదాపు రూ.7 లక్షల కోట్ల రుణభారంతో కూనారిల్లుతున్న టెలికం రంగానికి ప్రస్తుతం నిధుల కొరత వెంటాడుతోంది. దీంతో టెల్కోలు ఆదాయాలు పెంచుకునే మార్గాలు వెతుకుతున్నాయి.

ఎయిర్‌టెల్‌ తన కనీస రీచార్జిని పెంచడంతో ఇక వొడాఫోన్‌ ఐడియా ఎలా స్పందిస్తోనని కస్టమర్లు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే జియో తన కనీస రీచార్జి ప్లాన్స్‌ను వరుసగా రూ.98, రూ. 75(మామూలు ఫోన్‌, జియో ఫోన్‌)కు పెంచింది. మినిమం రీచార్జి ప్లాన్‌ పెంచడం ద్వారా అధికాదాయం ఇవ్వని కస్టమర్లను వదిలించుకోవాలని టెల్కోలు భావిస్తున్నాయి. ఇటీవల పెంచిన టారిఫ్‌లతో కంపెనీల తమ ఏఆర్‌పీయూ మెరుగుపడతాయని ఆశిస్తున్నాయి. ఈ సమయంలో అల్ప చార్జీలకు వీలిచ్చి ఏఆర్‌పీయూలపై నెగిటివ్‌ ప్రభావం పెంచుకోవడం ఎందుకన్న ఉద్దేశంలో టెల్కోలున్నాయని నిపుణుల విశ్లేషణ. టారిఫ్‌ల పెంపుతో ఎయిర్‌టెల్‌ ఏఆర్‌పీయూ రూ. 128 నుంచి రూ. 150కి, వొడాఫోన్‌ఐడియా ఏఆర్‌పీయూ రూ. 107 నుంచి రూ. 143కి, జియో ఏఆర్‌పీయూ రూ. 140కి పెరగవచ్చని(రాబోయే రెండుమూడు త్రైమాసికాల్లో) అంచనాలున్నాయి. You may be interested

అప్రమత్తంగా ఉండి.. ఫండమెంటల్స్‌పై దృష్టి..

Tuesday 31st December 2019

నూతన సంవత్సరం 2020 వచ్చేస్తోంది. 2019 సంవత్సరం మనకు ఎన్నో పాఠాలు నేర్పింది. ఎన్నో అస్థిరతలను చూశాం. ప్రధాన సూచీలు నిఫ్టీ, సెన్సెక్స్‌ నూతన జీవితకాల గరిష్టాలను చేరాయి. సవాళ్లతో కూడిన పరిస్థితుల నడుమ అధిక రాబడుల కోసం ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలన్న సందేహం రావచ్చు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు 2020లో అనుసరించాల్సిన విధానాలను ఎంట్రస్ట్‌ ఫ్యామిలీ ఆఫీస్‌ ఎండీ రాజమోహన్‌ కృష్ణన్‌ ఓ వార్తా సంస్థకు తెలియజేశారు.    వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణం

అటూఇటుగా ముగిసిన మార్కెట్లు

Monday 30th December 2019

నిఫ్టీ లాభాల్లో- సెన్సెక్స్‌ నష్టాల్లో పీఎస్‌యూ బ్యాంక్స్‌ వెనకడుగు వరుసగా రెండో రోజు సోమవారం హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు మిడ్‌సెషన్‌కంటే ముందుగానే వెనకడుగు వేశాయి. ఆపై చివరివరకూ స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదిలాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 17 పాయింట్ల స్వల్ప నష్టంతో 41,558 వద్ద నిలవగా.. నిఫ్టీ 10 పాయింట్లు పుంజుకుని 12,256 వద్ద స్థిరపడింది. కాగా.. సెన్సెక్స్‌ తొలుత దాదాపు 150 పాయింట్లు ఎగసింది. 41,715 వద్ద

Most from this category