News


పీఎన్‌బీ మొండిబాకీ లెక్కల్లో వ్యత్యాసాలు

Monday 16th December 2019
news_main1576467257.png-30239

- రూ. 2,617 కోట్ల మేర డైవర్జెన్స్‌
- ఆర్‌బీఐ ఆడిట్‌లో వెల్లడి

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) దాదాపు రూ. 2,617 కోట్ల మేర మొండిబాకీలు తక్కువగా చూపినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆడిట్‌లో వెల్లడైంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్‌బీఐ లెక్కల ప్రకారం పీఎన్‌బీ స్థూల మొండిబాకీలు (ఎన్‌పీఏ) రూ. 81,089.70 కోట్లుగా ఉన్నాయి. కానీ పీఎన్‌బీ రూ. 78,472 కోట్లు మాత్రమే ఎన్‌పీఏలుగా చూపించింది. దీంతో ఆర్‌బీఐ, పీఎన్‌బీ లెక్కల మధ్య రూ. 2,617 కోట్ల వ్యత్యాసం (డైవర్జెన్స్‌) వచ్చింది.  ఇక నికర ఎన్‌పీఏలు రూ. 30,038 కోట్లుగా ఉన్నట్లు పీఎన్‌బీ చూపగా, ఆర్‌బీఐ ఆడిట్ ప్రకారం రూ. 32,655 కోట్లుగా ఉన్నాయి. దీంతో నికర ఎన్‌పీఏలకు సంబంధించి కూడా డైవర్జెన్స్ రూ. 2,617 కోట్లుగా ఉన్నట్లు పీఎన్‌బీ వెల్లడించింది. మరోవైపు మొండిబాకీలకు కేటాయింపుల విషయంలో కూడా రూ. 2,091 కోట్ల మేర వ్యత్యాసం నమోదైంది. రూ. 50,242 కోట్ల మేర ప్రొవిజనింగ్ చేయాల్సి ఉండగా.. రూ. 48,151 కోట్లు మాత్రమే పీఎన్‌బీ కేటాయించింది. 2018-19 ఆర్థిక ఫలితాల్లో పీఎన్‌బీ రూ. 9,975 కోట్ల నష్టాన్ని ప్రకటించగా.. ఆర్‌బీఐ లెక్కించిన విధంగా ప్రొవిజనింగ్ చేసి ఉంటే నష్టాలు రూ. 11,336 కోట్లుగా ఉండేవి. దాదాపు రూ. 14,000 కోట్ల నీరవ్ మోదీ స్కామ్ నుంచి బైటపడేందుకు నానా తంటాలు పడుతున్న పీఎన్‌బీకి ఇతరత్రా మొండిబాకీలు భారంగా మారుతున్నాయి. 



You may be interested

2019 గృహ విభాగానికి నిరాశే

Monday 16th December 2019

గతేడాదితో పోలిస్తే కేవలం 4 శాతం వృద్ధి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఈ ఏడాది దేశీయ రియల్టీ రంగం ఆశించినంత వృద్ధిని సాధించలేదు. వినియోగ వ్యయం తగ్గడం, పెట్టుబడులు క్షీణించడం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం వంటి రకరకాల కారణాలతో దేశీయ రియల్టీ రంగంలో వృద్ధి అవకాశాలను నీరుగార్చాయని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌ తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గతేడాది నాలుగు త్రైమాసికాలు కలిపి 2,48,300 గృహాలు అమ్ముడుపోగా.. 2019లో కేవలం

ఫండ్స్‌ విలీనమైనప్పుడు పన్ను పోటు ఉంటుందా ?

Monday 16th December 2019

(ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వాల్యూ రీసెర్చ్‌) ప్ర: నా ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌) ఖాతా త్వరలోనే మెచ్యూర్‌ కానున్నది. అయితే నాకు ఈ మెచ్యురిటీ మొత్తం మరో పదేళ్ల తర్వాతనే అవసరం. నా కూతురి పైచదువుల కోసం ఈ డబ్బును వినియోగించుకోవాలనేది నా ఆలోచన. మరో ఐదేళ్లు ఈ ఖాతాను పొడగించడమంటారా ? లేక ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటారా? శ్రీకాంత్‌, విజయవాడ  జ: దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయడానికి పీపీఎఫ్‌

Most from this category