STOCKS

News


టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్ గా టాటా గ్లోబల్‌ బేవరేజెస్‌ పేరు మార్పు

Tuesday 11th February 2020
news_main1581399153.png-31685



113 బిలియన్‌ డాలర్ల టాటా గ్రూపు కంపెనీ అయిన టాటా గ్లోబల్‌ బేవరేజెస్‌(టీజీబీఎల్‌) పేరును ఇక టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌గా మార్చారు. ఇదే గ్రూప్‌నకు చెందిన టాటా కెమికల్స్‌ లిమిటెడ్‌(టీసీఎల్‌) కన్జూమర్‌ ఉత్పత్తులను టాటా గ్లోబల్‌ బేవరేజెస్‌ లిమిటెడ్‌(టీజీబీఎల్‌)కు బదిలీ చేసిన నేపథ్యంలో టీజీబీఎల్‌ పేరును టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్ లిమిటెడ్‌(టీసీపీఎల్‌) గా మార్చినట్లు అధికారికంగా టాటా గ్రూప్‌ వెల్లడించింది. టీసీపీఎల్‌ ద్వారా భారత ఎఫ్‌ఎంసీజీ మార్కెట్లో తన వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది. టాటా టీ, టాటా సాల్ట్‌తో పాటు మరెన్నో ప్రఖ్యాత బ్రాండ్ల ఉత్పత్తులతో 200 మిలియన్ల మందికి గృహవసరాలను ఈ గ్రూపు తీరుస్తోంది.

     
    

 

 



You may be interested

ఆరు ఎంఎన్‌సీ షేర్ల రికమండేషన్లు

Tuesday 11th February 2020

బడ్జెట్లో డిడిటీ(డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ టాక్స్‌) ఎత్తివేయడం మల్టీనేషనల్‌ కంపెనీలకు మేలు చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతేడాది కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపు, ఈ ఏడాది డీడీటీ తొలగింపుతో ఎంఎన్‌సీ కంపెనీలకు అత్యంత ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఈ వార్తల నేపథ్యంలో బడ్జెట్‌ అనంతరం ఎంఎన్‌సీ కంపెనీల షేర్లు మంచి ర్యాలీ జరిపాయి. బడ్జెట్‌ అనంతర వారంలో నిఫ్టీ ఎంఎన్‌సీ సూచీ దాదాపు 4 శాతం లాభపడింది. ఇకపై కూడా వీటి జోరు కొనసాగుతుందని,

నేటివార్తల్లోని షేర్లు

Tuesday 11th February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం స్టాక్‌మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌(ఎల్‌వీబీ):  అమెరికాకు చెందిన టిల్డన్‌ పార్క్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ లక్ష్మీవిలాస్‌ బ్యాంక్‌లో కొంత మేర వాటాను కొనుగోలు చేయనున్నట్లు ఆర్బీఐకి తెలిపింది. కాగా ఎల్‌వీబీ పెట్టుబడులు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. భారత్‌ వైర్‌ రోప్స్‌:  మోతీలాల్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ వ్యవస్థాపకులు రామ్‌దేవ్‌ అగర్వాల్‌, మోతీలాల్‌ ఆస్వాల్‌లు  9.42 లక్షల విలువైన  షేర్లను కొనుగోలు చేయడంతో భారతీ వైర్‌ రోప్స్‌ షేర్లు 26

Most from this category