News


వర్ధమాన మార్కెట్లపై టెంపుల్టన్‌, బ్లాక్‌రాక్‌ కన్ను...

Wednesday 18th July 2018
news_main1531893686.png-18428

వర్ధమాన మార్కెట్లపై టెంపుల్టన్‌, బ్లాక్‌రాక్‌ కన్ను...
ప్రపంచపు అతిపెద్ద మనీ మేనేజర్లు ప్రస్తుతం వర్ధమాన మార్కెట్లపై ప్రధానం దృష్టి కేంద్రీకరించారు. వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయడానికి రెడీ అవుతున్నారు. ఎమర్జింగ్‌ మార్కెట్లు స్టాక్స్‌లో 7 ట్రిలియన్‌ డాలర్లమైన నష్టపోయాయని, ఇప్పుడు ర్యాలీ చేస్తాయని విశ్వాసంతో ఉన్నారు. గోల్డ్‌మన్‌ శాక్స్‌ గ్రూప్‌, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, బ్లాక్‌రాక్‌ వంటి సంస్థలకు చెందిన ఇన్వెస్టర్లు, వ్యూహాకర్తలు.. చౌక ధరలు, కార్పొరేట్‌ లాభాలు పెరుగుతుండటం, బలమైన ఫండమెంటల్స్‌ వంటి అంశాలు వాణిజ్య యుద్ధ భయాలను, పెరుగుతున్న వడ్డీ రేట్లను అధిగమిస్తాయని పేర్కొన్నారు. 
తాము ఎమర్జింగ్‌ మార్కెట్‌ అసెట్స్‌, మరీ ప్రత్యేకించి ఎమర్జింగ్‌ మార్కెట్‌ ఈక్విటీస్‌లపై బుల్లిష్‌గా ఉన్నామని బ్లాక్‌రాక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ చీఫ్‌ మల్టీ అసెట్‌ స్ట్రాటజిస్ట్‌ ఇసబెల్లె మాటోస్‌ వై లాగో తెలిపారు. ప్రపంచ వృద్ధి నేపథ్యం, ఎమర్జింగ్‌ మార్కెట్‌ కార్పొరేట్‌ లాభాలు, వాల్యుయేషన్‌ అంచనాలు దీనికి కారణంగా పేర్కొన్నారు. బ్లూమ్‌బర్గ్‌ సర్వే ప్రకారం.. ఇంకా బుల్స్‌ మైనారిటీలో ఉన్నాయి. మార్కెట్‌లో పాల్గొనే వారిలో సగానికిపైగా మంది అభివృద్ధి చెందుతున్న దేశాల స్టాక్స్‌, కరెన్సీల అమ్మకం కొనసాగించాలని భావిస్తున్నారు. వాణిజ్య ఉద్రిక్తతలు, బలమైన డాలర్‌ వంటి అంశాల ప్రభావం స్టాక్స్‌పై ఎక్కువ కాలం ఉండకపోవచ్చని ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన అంచనా వేసింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ రిస్క్-లవ్ ఇండికేటర్ ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్‌ స్టాక్స్ పట్ల నిరాశవాదం 23 ఏళ్లలో అత్యధిక స్థాయికి దగ్గరగా ఉంది. 
ఎమర్జింగ్‌ మార్కెట్‌ బుల్‌కి మద్దతునిచ్చే అంశాలు..
♦ ఎమర్జింగ్‌ మార్కెట్‌ స్టాక్స్‌ అమెరికా మార్కెట్‌ స్టాక్స్‌తో పోలిస్తే అండర్‌పర్ఫార్మ్‌ చేస్తున్నాయి. అమెరికా లార్జ్‌ క్యాప్స్‌తో ఎమర్జింగ్‌ మార్కెట్‌ ఈక్విటీస్‌ పనితీరును 17 శాతం క్షీణించింది.  
♦ సన్‌ట్రస్ట్‌ ప్రైవేట్‌ వెల్త్‌ గణాంకాల ప్రకారం.. అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్‌ స్టాక్స్‌ కనిష్ట స్థాయి నుంచి రెండంకెల వృద్ధిని నమోదుచేస్తున్నాయి. గత 12 నెలల్లో 32 శాతంమేర ర్యాలీ చేశాయి. 
♦ ఈపీఎఫ్‌ఆర్‌ గ్లోబల్‌ డేటా గమనిస్తే అమెరికా ఎన్నికల వారం నుంచి చూస్తే ఎమర్జింగ్‌ మార్కెట్‌ డెట్‌ ఫండ్స్‌ నుంచి వారంతపు ఔట్‌ఫ్లోస్‌ కనిష్ట స్థాయిలో ఉన్నాయి. 
♦ అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీ కాంపిటీటివ్‌నెస్‌ 2016 జనవరి 20 నాటి స్థాయికి దగ్గరగా వచ్చింది. అంటే అతిపెద్ద ఎమర్జింగ్‌ మార్కెట్‌ ర్యాలీకి ఇది ప్రారంభం.
♦ గత దశాబ్ద కాలాన్ని పరిశీలిస్తే.. ఎమర్జింగ్‌ మార్కెట్‌ అసెట్స్‌కు డాలర్‌ పటిష్టత అంతపెద్ద సమస్యగా లేదు. 
♦ చరిత్రను గమనిస్తే ఎమర్జింగ్‌ మార్కెట్లు చాలా త్వరగా బౌన్స్‌బ్యాక్‌ అవుతాయి. 2008 తర్వాత కూడా మనం ఇదే గమనించొచ్చు. You may be interested

ఏడాది కనిష్టానికి పసిడి

Wednesday 18th July 2018

ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు అంచనాతో డాలర్‌ పరుగులు... ముంబై:- ఫెడ్‌ రిజర్వ్‌ కీలకవడ్డీ రేట్ల పెంపుపై స్పష్టత రావడంతో ప్రపంచవ్యాప్తంగా బుధవారం పసిడి ధర ఏడాది కనిష్టానికి పతనమైంది. భారత కాలమానం గం.11:10 ని.లకు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 1.40 డాలర్ల తగ్గి 1,224.80 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతరాత్రి అమెరికా కాంగ్రెస్‌ టెస్టిమోని సందర్భంగా ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ మాట్లాడుతూ ‘ రానున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత

ఈ స్టాకులపై ఎఫ్‌పీఐల మక్కువ

Wednesday 18th July 2018

జూన్‌త్రైమాసికంలో విదేశీ ఇన్వెస్టర్లు వాటాలు పెంచుకున్న షేర్లు దేశీయ ఈక్విటీల్లో గత త్రైమాసికం విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడిదారులు((ఎఫ్‌పీఐలు) దాదాపు 20700 కోట్ల రూపాయలను ఉపసంహరించుకున్నాయి. అయితే ఇదే సమయంలో కొన్ని ఎంపిక చేసిన స్టాకుల్లో పెట్టుబడులను పెంచుకోవడం గమనార్హం. ఇలా జూన్‌ త్రైమాసికంలో ఎఫ్‌పీఐలు వాటాలు పెంచుకున్న షేర్లు, వాటి వివరాలు... 1. ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌: జూన్‌ క్వార్టర్‌లో ఎఫ్‌పీఐలు ఈ కంపెనీలో వాటాను 6.79 శాతం మేర పెంచుకున్నాయి. యాజమాన్యం చేతులు

Most from this category