News


టెలికం రంగానికి సత్వర సాయం కావాలి

Saturday 21st March 2020
news_main1584763998.png-32606

పరిష్కారం  చూపించాలని కోరిన సీవోఐఏ
 ‘‘తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న టెలికం రంగానికి తగిన పరిష్కారం చూపించేందుకు అందుబాటులో ఉన్న సాధనాలను వినియోగించుకోవాలని సెల్యులర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీవోఏఐ/ టెలికం కంపెనీల అసోసియేషన్‌) కోరింది. ఎటువంటి ఉపశమన ప్యాకేజీ కల్పించకపోతే ఎదురయ్యే పరిణామాల గురించి ప్రభుత్వానికి బాగానే తెలుసని పేర్కొంది. ‘‘టెలికం పరిశ్రమకు అత్యవసరంగా సాయం అవసరం ఉంది. అందుకే ప్రభుత్వం తగిన పరిష్కారాలతో వెంటనే ముందుకు రావాలని కోరుతున్నాం’’ అని సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌ మాథ్యూస్‌ పేర్కొన్నారు. సర్దుబాటు చేసిన ఆదాయం విషయంలో టెలికం కంపెనీలు స్వీయ మదింపు చేయడానికి వీల్లేదని, అసలు, వడ్డీ, పెనాల్టీలను తీర్పులో చెప్పిన విధంగా చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు గత బుధవారం స్పష్టం చేసిన విషయం గమనార్హం. దీంతో టెలికం కంపెనీలు మరో విడత ప్రభుత్వ సాయం కోసం ఒత్తిళ్లు తీసుకురావడం మొదలు పెట్టాయి. టెలికం శాఖ (డీవోటీ) అంచనాల ప్రకారం భారతీఎయిర్‌టెల్‌, టెలినార్‌ (ఎయిర్‌టెల్‌లో విలీనమవడంతో)తో కలసి రూ.43,980 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.58,254 కోట్లు, టాటా టెలికం కంపెనీలు రూ.16,798 కోట్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉంది. అయితే భారతీ ఎయిర్‌టెల్‌ రూ.13,004 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.21,533 కోట్లు, టాటా టెలికం కంపెనీలు రూ.2,197 కోట్లు చెల్లించాలని టెలికం కంపెనీలు తమ స్వీయ మదింపులో తేల్చాయి.



You may be interested

వీలైనంత త్వరలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తాం

Saturday 21st March 2020

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న రంగాలకు ఆర్థిక ప్యాకేజీని వీలైనంత త్వరలో ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం భరోసానిచ్చారు. అయితే, ఇందుకు ఎన్ని రోజులు పడుతుందన్న వివరాలను ఆమె వెల్లడించలేదు. పౌర విమానయానం, పర్యాటకం, ఎంఎస్‌ఎంఈ, పశుసంవర్ధక శాఖల మంత్రులు, అధికారులతో మంత్రి సీతారామన్‌ ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆయా శాఖల నుంచి

ఏప్రిల్‌ 2 వరకూ రాణా కపూర్‌ కస్టడీ పొడిగింపు

Saturday 21st March 2020

 యస్‌బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ జ్యుడీషియల్‌ కస్టడీని  ఏప్రిల్‌ 2 వరకూ కోర్టు పొడిగించింది. వివరాల్లోకి వెళితే, అక్రమ ధనార్జనా నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద అరెస్టయిన 62 సంవత్సరాల కపూర్‌ జ్యుడీషియల్‌ కస్టడీ శుక్రవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయనను ఇక్కడి కోర్టు ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) హాజరుపరిచింది. రిమాండ్‌ను పొడిగించాలని ఈడీ కోరలేదు. అయితే మరో కేసులో కపూర్‌పై ఉన్న వారెంట్‌ను సీబీఐ కోర్టుకు సమర్పించింది.

Most from this category