News


టెలికాం కన్సాలిడేషన్‌తో..ఎయిర్‌టెల్‌కు లబ్ది !

Monday 18th November 2019
news_main1574057383.png-29670

ప్రభుత్వ సాయం అందకపోతే మిగిలేవి రెండే..
కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ అంచనా
ఏజీఆర్‌ బకాయిలు, ఫ్లోర్‌ ధర, నియంత్రణా జరిమానాలు, స్పెక్ట్రంకు సంబంధించి ప్రభుత్వం నుంచి సరైన రూపంలో సాయం అందకపోతే దేశీయ టెలికం పరిశ్రమ మరింత కన్సాలిడేషన్‌కు లోనవుతుందని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ అభిప్రాయపడింది. ప్రభుత్వం ‘నో రిలీఫ్‌’ అంటే టెలికం పరిశ్రమ నిర్మితే మారుతుందని తెలిపింది. ఏజీఆర్‌ జరిమానాపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎయిర్‌టెల్‌కు గట్టి దెబ్బని కానీ పరిశ్రమలో కన్సాలిడేషన్‌ వచ్చి రెండు ప్రైవేట్‌ కంపెనీలకే పరిమితమయితే అంతిమంగా అది ఎయిర్‌టెల్‌కు లబ్దిచేకూర్చగలదని వివరించింది. ఏజీఆర్‌పై టెలికాం కంపెనీలకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే..ఎలాగూ ఎయిర్‌టెల్‌కు ఊరట లభిస్తుందని కోటక్‌ ఈక్విటీస్‌ సూచనాప్రాయంగా పేర్కొంది. ప్రభుత్వ సాయం అందకుంటే వొడాఫోన్‌ ఐడియా క్రమంగా దివాలా దిశగా పయనించవచ్చు. దీంతో చివరకు రంగస్థలంపై జియో, ఎయిర్‌టెల్‌ మాత్రమే మిగిలే ఛాన్సులుంటాయి. అప్పుడు వొడాఫోన్‌ఐడియా కస్టమర్లు తప్పక ఈ రెండిటిలో ఒకదాన్ని ఎంచుకోవాల్సిఉంటుంది. దీంతో ఎయిర్‌టెల్‌కు కస్టమర్లు పెరగడంతో పాటు క్రమంగా వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ఇదంతా దీర్ఘకాలిక ప్రక్రియ. ప్రస్తుతానికి మాత్రం ఏజీఆర్‌ బకాయిల గుదిబండ ఎయిర్‌టెల్‌కు ఇబ్బందికరమేనని నిపుణుల భావన.

ప్రస్తుతం దేశీయ లిస్టెడ్‌ టెలికం సంస్థల నికర నష్టాలు రూ.లక్ష కోట్లను దాటాయి. గతవారం వీఐఎల్‌, ఎయిర్‌టెల్‌ సం‍స్థలు అతిపెద్ద క్యు2 నష్టాలు ప్రకటించాయి. సుప్రీంకోర్టు ఆర్డరుతో ఈ రెండిటితో పాటు ఇతర టెలికం ఆపరేటర్లంతా కలిసి దాదాపు రూ. 1.4 లక్షల కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిఉంటుంది. ఇందులో మెజార్టీ వాటా రూ. 62178 కోట్లు ఎయిర్‌టెల్‌ది కాగా, రూ. 54184 కోట్లు వొడాఫోన్‌ది. మిగిలిన మొత్తం బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌, మరికొన్ని మూతపడ్డ సంస్థలు కలిపి చెల్లించాల్సిఉంది. ఈ బకాయిలు కోర్టు చెప్పిన గడువులోపు చెల్లించాలని డీఓటీ ఆయా సంస్థలకు లేఖలు రాసింది. మరోవైపు టెలికం సమస్యల అధ్యయనానికి ప్రభుత్వం కార్యదర్శులతో ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ నివేదికపై టెల్కోల భవితవ్యం ఆధారపడుతుందని కోటక్‌ ఈక్విటీస్‌ పేర్కొంది. You may be interested

బ్రోకరేజిలు టార్గెట్‌ ధరను సవరించిన షేర్లివే

Monday 18th November 2019

సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు అంచనాల కంటే బాగుండడంతోపాటు, ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడడంతో కొన్ని స్టాకుల టార్గెట్‌ ధరలను బ్రోకరేజ్‌లు పెం‍చాయి. అదే సమయంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్న కంపెనీల టార్గెట్‌ ధరలను తగ్గించాయి. సెప్టెంబర్‌ ఫలితాలు వెలువడిన తర్వాత, బ్రోకరేజిలు అధికంగా ఆస్తి నిర్వహణ కంపెనీలు, ఇన్సురెన్స్‌, హెల్త్‌కేర్‌ కంపెనీల టార్గెట్‌ ధరలు పెంచాయి. కానీ బ్యాంకింగ్‌, టెలికాం, హౌసింగ్‌ సెక్టార్లకు సంబంధించిన కంపెనీల టార్గెట్‌ ధరలను తగ్గించాయి. విశ్లేషకులు టార్గెట్‌ ధరలను అధికంగా

రాణిస్తున్న మెటల్‌ షేర్లు

Monday 18th November 2019

పరిమితి శ్రేణిలో ట్రేడింగ్‌ జరుగుతున్న మార్కెట్లో మెటల్‌ షేర్లు రాణిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో దాదాపు 1.50శాతానికి పైగా లాభపడింది.  అమెరికా చైనాల మధ్య పాక్షికంగా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందనే వార్తలు మెటల్‌ షేర్లకు డిమాండ్‌ను పెంచాయి. గత రెండేళ్లుగా అగ్రరాజ్యాలైన అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం సమిసిపోతే వృద్ధి మందగమనం

Most from this category