News


బీఎస్‌ఎన్‌ఎల్ నష్టాలు @ రూ. 90వేల కోట్లు

Saturday 16th March 2019
news_main1552721792.png-24641

- నిధులు సమకూర్చడం లేదా మూసేయడం రెండే మార్గాలు
- కోటక్‌ ఈక్విటీస్ నివేదిక

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్ఎల్ నష్టాలు డిసెంబర్ ఆఖరు నాటికి ఏకంగా రూ. 90,000 కోట్లు దాటిపోయాయని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ (కేఐఈ) పేర్కొంది. ఈ నేపథ్యంలో మరింత పెట్టుబడులు పెట్టి కంపెనీని నిలబెట్టడమా లేదా వ్యయాలు తగ్గించుకునేందుకు సంస్థను మూసేసి వన్‌ టైమ్ భారాన్ని భరించడమా అన్న దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఒక నివేదికలో తెలిపింది. "బీఎస్‌ఎన్‌ఎల్‌ సమస్యలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరిలో 1.76 లక్షల మంది ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేదు. బీఎస్‌ఎన్‌ఎల్‌కు తక్కువకో లేదా ఉచితంగానో స్పెక్ట్రం కేటాయించడం వల్ల ఉపయోగం ఉండదు. బీఎస్‌ఎన్‌ఎల్ యాజమాన్యం తమకు 4జీ స్పెక్ట్రం బదులుగా ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన ఈక్విటీ సమకూర్చమని కోరుతోంది. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టొచ్చు" అని కేఐఈ పేర్కొంది. చివరిసారిగా 2008 ఆర్థిక సంవత్సరంలో బీఎస్‌ఎన్‌ఎల్ లాభాలు నమోదు చేసిందని, అప్పట్నుంచి 2009-18 మధ్య కాలంలో మొత్తం రూ. 82,000 కోట్ల మేర నష్టాలు పేరుకుపోయాయని తెలిపింది. 2018 డిసెంబర్ నాటికి ఇది రూ. 90,000 కోట్లు దాటేసి ఉంటుందని కేఐఈ పేర్కొంది. 
మరిన్ని సవాళ్లు...
2006 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ ఆదాయాల్లో ఉద్యోగాల వ్యయాలు (రిటైర్మెంట్ ప్రయోజనాలు కలిపి) 21 శాతంగా ఉంటే.. 2008 ఆర్థిక సంవత్సరం నాటికి 27 శాతానికి చేరాయి. 2018 ఆర్థిక సంవత్సరానికి ఇవి ఏకంగా 66 శాతానికి ఎగిశాయి. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్ నష్టాలు ఏటా రూ. 7,100 కోట్ల మేర ఉంటున్నాయని అంచనా. ఇలాంటి సవాళ్ల కారణంగా నెట్‌వర్క్ కవరేజీ, సేవల నాణ్యత, సామర్థ్యం విషయాల్లో ప్రైవేట్ ఆపరేటర్ల కన్నా (భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా, ఆర్‌జియో) బీఎస్‌ఎన్‌ఎల్ వెనకబడిపోతోందని కేఐఈ నివేదికలో వివరించింది. ఇక ఎఫ్‌టీటీహెచ్‌ విభాగంలో ఆర్‌జియో ప్రవేశిస్తున్న నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ వైర్‌లైన్ వ్యాపారంపై కూడా ప్రతికూల ప్రభావం పడనుంది. బీఎస్‌ఎన్‌ఎల్ వ్యాపార విభాగాల్లో గత కొన్నాళ్లుగా ఇదొక్కటే కాస్తంత వృద్ధి నమోదు చేస్తోంది" అని పేర్కొంది. టెలికం రంగంలో గత కొన్నాళ్లుగా ఒత్తిడి పెరుగుతూనే ఉండగా టారిఫ్‌ల పరంగానైనా నెట్‌వర్క్‌ పరంగానైనా వీటిని ఎదుర్కొనగలిగే సత్తా బీఎస్‌ఎన్‌ఎల్‌కు చాలా పరిమితంగానే ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్ మూతబడటానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చని తెలిపింది. 
ఒత్తిడిలో టెలికం పరిశ్రమ..
ఇప్పటికే తక్కువ టారిఫ్‌లతో కుదేలవుతున్న టెలికం పరిశ్రమ పరిస్థితి టారిఫ్‌లు పెరగకపోతే మరింత దుర్భరంగా మారుతుందని పేర్కొంది. "టెలికం రంగం నుంచి ఖజానాకు భారీ ఆదాయాలు వచ్చే రోజులు పోయాయి. తీవ్రమైన పోటీ కారణంగా వేలంలో స్పెక్ట్రంను దక్కించుకునేందుకు గతంలో టెలికం కంపెనీలు భారీగా చెల్లించేవి. కానీ, రాబోయే రోజుల్లో ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. ఒకవేళ టారిఫ్‌లు గానీ పెరగకపోతే.. టెలికం రంగంపై నెలకొన్న ఒత్తిడి... కొంత మేర ప్రభుత్వంపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది" అని కేఐఈ వివరించింది. You may be interested

లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 16th March 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ శుక్రవారం రాత్రి 11,500 పాయింట్లపై 11,506 వద్ద ముగిసింది. ఇది ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు 11470 పాయింట్లతో పోలిస్తే 36పాయింట్ల లాభంతో ఉంది. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు పాలసీ సమావేశాలు వచ్చేవారం మంగళ(19న), బుధ(20న) వారాల్లో జరగనున్నాయి. అమెరికాతో పాటు, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమనం నేపథ్యంలో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లపై ఈసారి యధాతథ పాలసీని అవలంభించవచ్చని ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు.

​‍బ్రూక్‌ఫీల్డ్‌ ఇన్విట్‌ చేతికి ముకేశ్‌ అంబానీ ఈస్ట్‌ వెస్ట్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌

Saturday 16th March 2019

డీల్‌ విలువ రూ.13,000 కోట్లు  న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీకి చెందిన నష్టాల్లో నడుస్తున్న ఈస్ట్‌-వెస్ట్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌  చేతులు మారుతోంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్యాస్‌ను వినియోగదారులకు సరఫరా చేసే ‘పైప్‌లైన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ కంపెనీని బ్రూక్‌ఫీల్డ్‌ నేతృత్వంలోని ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌  ట్రస్ట్‌(ఇన్విట్‌) కొనుగోలు చేయనున్నది. ఈ కంపెనీలో వంద శాతం వాటాను రూ.13,000 కోట్లకు బ్రూక్‌ఫీల్డ్‌ ఇన్విట్‌ కొనుగోలు చేయనున్నదని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి గుజరాత్‌లోనిన

Most from this category