News


టెల్కోలకు ఊరట..

Thursday 21st November 2019
news_main1574305893.png-29739

ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న టెలికం కంపెనీలకు ఊరటనిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. టెల్కోలు కట్టాల్సిన స్పెక్ట్రం చెల్లింపులకు సంబంధించి రెండేళ్ల పాటు మారటోరియం విధించింది. 2020–21, 2021–22 సంవత్సరాల్లో జరపాల్సిన చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. దీంతో భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ జియో సంస్థలకు సుమారు రూ. 42,000 కోట్ల మేర ఊరట లభించనుంది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) వివాదంలో ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో టెల్కోలు..దాదాపు 1.4 లక్షల కోట్ల మేర లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు కట్టాల్సి రానున్న సంగతి తెలిసిందే. 



You may be interested

ప్రైవేట్‌ ‘సై’రన్‌

Thursday 21st November 2019

బీపీసీఎల్, ఎస్‌సీఐ, కా¯న్‌కర్‌లో వాటాల విక్రయం మరికొన్ని పీఎస్‌యూల్లో 51 శాతం లోపునకు వాటాలు కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు  న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో మందగమనం నేపథ్యంలో ఆదాయాన్ని పెంచుకునే దిశగా కేంద్రం భారీ స్థాయిలో ప్రైవేటీకరణకు తెరతీసింది. పలు ప్రభుత్వ రంగ దిగ్గజాల్లో (పీఎస్‌యూ) డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రతిపాదనలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. చమురు దిగ్గజం బీపీసీఎల్, షిప్పింగ్‌ సంస్థ ఎస్‌సీఐ, కార్గో సేవల సంస్థ కాన్‌కర్‌లో వాటాల విక్రయానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర

వీటిల్లో గత వైభవం సాధ్యమేనా...?

Thursday 21st November 2019

పెట్టుబడులపై అధిక రాబడుల కోసం ఈక్విటీల వైపు అడుగు వేసే ఇన్వెస్టర్ల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. పది పదిహేనేళ్ల క్రితంతో పోలిస్తే నేడు స్టాక్‌ ట్రేడింగ్‌ ఎంతో సులభంగా మారింది. డేటా దిగి రావడం, టెక్నాలజీ ఆధునికత రూపును సంతరించుకోవడం వంటి ఎన్నో కారణాలున్నాయి. అయితే, భారీ రాబడుల ఆకాంక్షలతో ఈక్విటీ మార్కెట్ల వైపు చూసే వారు ముందుగా పెట్టుబడులను ఎటువంటి కంపెనీల్లో పెట్టాలన్నది పరిపూర్ణంగా అవగాహన చేసుకున్న తర్వాతే

Most from this category