News


మేం కట్టాల్సింది చాలా తక్కువ..టెల్కోల కొత్త లెక్క

Monday 17th February 2020
news_main1581919703.png-31851

ఏజీఆర్‌పై వాదన
టెలికం శాఖ డిమాండ్‌ చేస్తున్న దానికన్నా ఏజీఆర్‌ బకాయిలు తక్కువేనని తమ మదింపులో తేలిందని వొడాఫోన్‌ ఇండియా, ఎయిర్‌టెల్‌ తెలిపాయి. దీంతో ఏజీఆర్‌ బకాయిలపై మరో వివాదానికి తెరలేచినట్లవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డీఓటి లెక్క చెబుతున్నట్లు రూ. 35500 కోట్ల ఏజీఆర్‌ బకాయి ఉండదని, తమ గణనలో రూ. 15- 18 వేట కోట్లు మాత్రమే ఉంటందని ఎయిర్‌టెల్‌ పేర్కొనగా, వొడాఐడియా సైతం రూ. 53వేల బకాయి ఉండమని, కేవలం రూ. 18-23వేల కోట్లే బాకీ ఉంటుందని తెలిపింది. ఈ మొత్తంలో కొంత మొత్తాన్ని త్వరలో చెల్లిస్తామని వీఐఎల్‌ ప్రకటించింది. టాటా టెలి సైతం తమ బకాయి మొత్తం డీఓటీ పేర్కొన్నట్లు రూ. 14వేల కోట్లుండదని, చాలా తక్కువ ఉంటుందని తెలిపింది.  ఏజీఆర్‌ బకాయి మొత్తాల్లో ప్రభుత్వం, కంపెనీలు చెబుతున్నమొత్తాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఇందుకు డీఓటీ గణనలో లోపాలు, పునరుక్తులే కారణమయి ఉండొచ్చని కొందరు నిపుణులు చెప్పారు. ఇలాంటి లోపాలు, వాటిపై లెక్కించిన వడ్డీలు, పెనాల్టీలు తీసివేసి చూస్తే బకాయి మొత్తాలు గణనీయంగా తగ్గుతాయన్నారు. మరోవైపు కంపెనీలు చెల్లించాల్సిన అసలు మొత్తాన్ని డీఓటీ తగ్గించవచ్చని, ఇదే జరిగితే బకాయిలోని వడ్డీలు, పెనాల్టీలు కూడా దిగివస్తాయని భావిస్తున్నారు. 


అయితే కంపెనీల స్వీయ గణన అంత తొందరగా తేలే వ్యవహారం కాదని, ఇందుకు గత16ఏళ్ల పద్దులను సర్కిళ్లవారీగా సరిచూసుకోవాల్సిఉంటుందని టెలికం అధికారులు చెబుతున్నారు. డీఓటీ చెప్పే మొత్తం కన్నా టెల్కోల అంచనాలు తక్కువగా ఉండి, ఆ మేరకే టెల్కోలు చెల్లింపులు చేస్తే డీఓటీ మరలా నోటీసులు జారీ చేయడం లేదా టెల్కోలపై చర్యలు తీసుకోవడం చేస్తుందని తెలిపారు. ఇవీన్న సోమవారానికి ఒక కొలిక్కిరావచ్చని అంచనా. టెల్కోలు ప్రభుత్వం చెప్పే మొత్తాలు చెల్లించకపోతే డీఓటీ బ్యాంకు గ్యారెంటీలను నగదీకరించుకుంటుందని, మరీ కఠినంగా వ్యవహరించాల్సివస్తే లైసెన్స్‌ ఫీజులను రద్దు చేయవచ్చని తెలిపారు. ప్రస్తుతం వీఐఎల్‌ రైట్స్‌ ఇష్యూ కింద సమీకరించిన మొత్తంలో రూ. 2826 కోట్లను ఈ బకాయిల చెల్లింపునకు వాడవచ్చని, మరో రూ. 8వేల కోట్ల కోసం మాతృసంస్థను సంప్రదించవచ్చని అంచనా. కంపెనీ వద్ద రూ. 23114 కోట్ల నగదు నిల్వలున్నాయి. మరో రూ. 4500 కోట్లు టవర్‌ వా‍్యపార వాటా విక్రయంతో సమకూరతాయి. ఆప్టిక్‌ఫైబర్‌, డేటా సెంటర్ల విక్రయం ద్వారా మరిన్ని నిధులు రావచ్చు. కానీ వీటన్నింటికీ సమయం పడుతుంది. కోర్టు మాత్రం ఈ దఫా టెల్కోలకు సమయం ఇవ్వలేదు. మరోవైపు ఎయిర్‌టెల్‌ మాత్రం ఈ నెల 20లోపు రూ. 10వేల కోట్లు చెల్లించి మిగిలిన మొత్తం(తమ మదింపు ప్రకారం) మార్చి 16లోపు చెల్లిస్తామని తెలిపింది. ఇంకా వీఐఎల్‌ నుంచి చెల్లింపుల ప్రణాళిక బయటకు రాలేదు. ఈ విషయమై చర్చించేందుకు కంపెనీ చైర్మన్‌ కుమారమంగళం బిర్లా టెలికం మంత్రితో సమావేశం అయ్యారు. తమ కంపెనీ దివాలా తీస్తే ఎకానమీపై పడే ప్రభావాన్ని ఆయన వివరిస్తున్నారు. 



You may be interested

అమ్మకాల ఒత్తిడిలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు

Monday 17th February 2020

లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న మార్కెట్లో సోమవారం ఉదయం ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు నష్టాలను ఎదుర్కోంటున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌లో 2.20శాతం నష్టాన్ని చవిచూశాయి. నేడు ఈ ఇండెక్స్‌ 2,207.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన మొండిబకాయిలు మరింత పెరగవచ్చని భయాలతో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్‌ రంగ షేర్లను విక్రస్తున్నారు. టెలికాం కంపెనీలకు ప్రభుత్వరంగ

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ నుంచి నిధుల తరలింపు ఆరోపణలు

Monday 17th February 2020

సుధాకర్‌ షెట్టిని మధ్యవర్తిగా ఉంచి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సంబంధించిన రూ.12,000 కోట్ల నుంచి అక్రమంగా రూ.3000 కోట్లను ప్రమోటర్‌​‍్స కపిల్‌, ధీరజ్‌ వద్వాన్‌లు తరలించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సోమవారం ఉదయం 10:20 గంటల ప్రాంతంలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేరు 4.48 శాతం తగ్గి 9.60 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  

Most from this category