STOCKS

News


సైబర్‌ మోసాలపై టెకీల పోరు

Thursday 3rd October 2019
news_main1570075613.png-28688

  • ఎంఎంటీ, స్విగీ, జొమాటో, పేటీఎం జట్టు
  • ఆర్‌బీఐతో భేటీ
  • మోసాల నివారణ చర్యలపై సమీక్ష
  • టెల్కోలు, గూగుల్‌తో కూడా చర్చలు

బెంగళూరు: సైబర్‌ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు టెక్నాలజీ సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. ట్రావెల్‌ సేవల సంస్థలు మేక్‌మైట్రిప్‌ గ్రూప్, ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌.. మొబైల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎం, ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ స్విగీ, జొమాటోలతో పాటు ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్‌ మొదలైనవి ఇందుకోసం జట్టు కట్టాయి. సైబర్‌ మోసాల తీరుతెన్నులు, నివారణ తీసుకోతగిన చర్యలపై చర్చించేందుకు ఈ సంస్థలు గత వారం రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కూడా సమావేశమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మోసపూరిత టోల్‌ ఫ్రీ నంబర్లు మొదలైన మార్గాల్లో మోసాలు జరుగుతున్న తీరును అవి వివరించినట్లు పేర్కొన్నాయి. అమాయక కస్టమర్లను మోసగించేందుకు ఉపయోగిస్తున్న 4,000 పైచిలుకు సిమ్‌ కార్డు నంబర్లు, 350–400 దాకా బ్యాంకు ఖాతాల వివరాలను రిజర్వ్‌ బ్యాంక్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)తో పాటు టెలికం కంపెనీలకు కూడా అందించినట్లు వివరించాయి. అటు నకిలీ టోల్‌ ఫ్రీ నంబర్లు పేజీలో ప్రముఖంగా పైన కనిపించే విధంగా నేరగాళ్లు ఏ విధంగా సెర్చి ఇంజిన్‌ను దుర్వినియోగం చేస్తున్నదీ టెక్‌ దిగ్గజం గూగుల్‌కు కూడా ఆయా టెక్‌ దిగ్గజాలు తెలియజేశాయి. సాధారణంగా ఇలా సెర్చి ఇంజిన్‌ పేజీలో పైన ప్రముఖంగా కనిపించే నకిలీ టోల్‌ ఫ్రీ నంబర్లను వినియోగదారులు అసలైనవిగా భావించి.. మోసాల బారిన పడుతున్న ఉదంతాలు అనేకం నమోదవుతున్నాయి.

ఎస్‌బీఐకు లేఖ....
గత కొద్ది వారాలుగా ఈ ఇంటర్నెట్‌ కంపెనీలు.. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)తో పాటు టెలికం రంగానికి చెందిన ఎయిర్‌టెల్‌ తదితర సంస్థలతో కూడా సమావేశాలు జరుపుతున్నాయి. ప్రభుత్వ రంగంలోనే అతి పెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కి కూడా ఆన్‌లైన్‌ కంపెనీలు లేఖ రాశాయి. ఎస్‌బీఐ ఖాతాలను ఉపయోగించి భారీ స్థాయిలో జరుగుతున్న సైబర్‌ మోసాల గురించి తెలియజేశాయి. అమాయక ఖాతాదారులను మోసగించేందుకు.. కీలకమైన వారి అకౌంట్ల వివరాలను తెలుసుకునే నేరగాళ్లు చాలా మటుకు ఎస్‌బీఐ ఖాతాలను ఉపయోగిస్తున్నట్లు వివరించాయి. ఎస్‌బీఐ భారీ బ్యాంకు కావడంతో ఇలాంటి వారిని పట్టుకోవడం కష్టతరం కావొచ్చని టెక్‌ సంస్థలు అభిప్రాయపడ్డాయి.  రాబోయే రోజుల్లో మరిన్ని టెక్‌ కంపెనీలు ఈ సంస్థలతో జట్టు కట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

మోసాలు ఇలా...
ఎక్కువగా పట్టణేతర ప్రాంతాల వారు, సీనియర్‌ సిటిజన్లు ఇలాంటి సైబర్‌ నేరాల బారిన పడుతున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అసలు ఖాతాగా భ్రమింపచేసే అకౌంటు నుంచి ఎస్‌ఎంఎస్‌లు పంపించడం ద్వారా నేరగాళ్లు ఈ మోసాలకు తెరతీస్తున్నారు. సిసలైన కంపెనీగా కనిపించినప్పటికీ .. ఇలాంటి పోర్టల్‌ పేర్లలో ఎక్కడో ఒకటో అరా తేడాలుంటున్నాయి. ఉదాహరణకు.. మేక్‌మై ట్రిప్‌ పోర్టల్‌ వంటి పోర్టల్స్‌ పేర్లలో నకిలీ సైట్లు అదనంగా మరో అక్షరం చేరుస్తున్నాయి. ఆకర్షణీయ బహుమతుల ఆఫర్లతో వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. అయితే ఇలాంటి మెసేజీలను  వినియోగదారులు పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో ఆయా లింక్‌లపై క్లిక్‌ చేయడం ద్వారా మోసాల బారిన పడుతున్నారు. You may be interested

కార్పొరేట్‌ పన్ను కోత సంస్కరణల దిశగా సంకేతం

Thursday 3rd October 2019

హైదరాబాద్‌: కార్పొరేట్‌ పన్ను తగ్గింపు అన్నది నిర్మాణాత్మక సంస్కరణల దిశగా ప్రభుత్వం ఇచ్చిన సంకేతమని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ అన్నారు. రెవెన్యూలోటును పూడ్చుకునేందుకు పన్నేతర ఆదాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ వృద్ధి రేటు తగ్గినందున జీఎస్‌టీ వసూళ్లు కూడా తగ్గుతాయని అంచనా వేసిందేనన్నారు. సెప్టెంబర్‌ నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ.91వేల కోట్లకు తగ్గిపోయిన విషయం గమనార్హం. హైదరాబాద్‌లో బుధవారం

చైనాలో తయారీకి శాంసంగ్ గుడ్‌బై

Thursday 3rd October 2019

భారత్‌, వియత్నాంలో మొబైల్స్ ప్లాంట్ల విస్తరణ చైనాలో తీవ్రమైన పోటీ, వ్యయాలే కారణం సియోల్‌: పెరుగుతున్న వ్యయాలు, ఆర్థిక మందగమనం, తీవ్రమైన పోటీ తదితర అంశాల కారణంగా చైనా నుంచి దిగ్గజ కంపెనీలు ఒక్కొక్కటిగా వైదొలుగుతున్నాయి. తాజాగా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్‌ కూడా చైనాలో తమ మొబైల్ ఫోన్స్ తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దేశీయంగా పోటీ తీవ్రంగా పెరిగిపోతుండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. గతేడాదే ఒక ఫ్యాక్టరీలో కార్యకలాపాలు నిలిపివేసిన శాంసంగ్‌ ఇటీవల జూన్‌లో

Most from this category