News


టెక్నో పెయింట్స్‌ మరో తయారీ కేంద్రం

Wednesday 5th June 2019
news_main1559728771.png-26107

  • రూ.2.5 కోట్లతో ఆర్‌అండ్‌డీ సెంటర్‌ కూడా..
  • హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో; 10న ఆరంభం
  • త్వరలో మార్కెట్లోకి గ్రానైట్, మార్బుల్‌ పెయింట్స్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పెయింట్స్‌ రంగంలోని హైదరాబాదీ కంపెనీ ఫార్చూన్‌ పెయింట్స్‌ (టెక్నో పెయింట్స్‌) మరో తయారీ కేంద్రాన్ని ప్రారంభించనుంది. రూ.2.5 కోట్ల పెట్టుబడితో ప్లాంట్, ఆర్‌ అండ్‌ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఫార్చూన్‌ గ్రూప్‌ ఎండీ ఆకూరి శ్రీనివాస రెడ్డి చెప్పారు. కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఈ నెల 10న ప్రారంభిస్తామని, ఇందులో 50 మంది ఉద్యోగులుంటారని తెలియజేశారు. ఏపీఎస్‌ రీసెర్చ్‌ అండ్‌ మీడియా ఇంటర్నేషనల్‌ సంస్థ 2019వ సంవత్సరానికి ఫార్చూన్‌ పెయింట్స్‌కు ప్రొడక్ట్‌ అండ్‌ సర్వీసెస్‌ విభాగంలో క్వాలిటీ మ్యానుఫాక్చరింగ్‌ అవార్డు ఇచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
20 వేల మెట్రిక్‌ టన్నులు...
ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో రెండు, గుంటూరులోని నడికుడిలో మరో తయారీ కేంద్రం ఉన్నాయి. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 20 వేల మెట్రిక్‌ టన్నులు. ‘‘ఇప్పటివరకు రూ.25 కోట్ల పెట్టుబడులు పెట్టాం. ఆస్ట్రేలియా, యూరప్‌ వంటి దేశాల నుంచి ముడి సరకులను దిగుమతి చేసుకొని, పెయింట్స్, సొల్యూషన్స్‌ను తయారు చేస్తున్నాం. ప్రస్తుతం గ్రానైట్‌ టెక్స్చర్‌, మార్బుల్‌ ఫినిష్‌ పెయింటింగ్‌ల మీద పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరలోనే వీటిని మార్కెట్లోకి ప్రవేశపెడతాం’’ అని శ్రీనివాసరెడ్డి చెప్పారు.
రూ.100 కోట్ల టర్నోవర్‌...
ఫార్చూన్‌ గ్రూప్‌నకు ఫార్చూన్‌ పెయింట్స్‌, ఫినెట్రీ యూపీవీసీ, ఏఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్, టెక్నో ట్రేడర్స్‌ కంపెనీలున్నాయి. తమ గ్రూప్‌ గత ఆర్ధిక సంవత్సరంలో రూ.100 కోట్ల టర్నోవర్‌ నమోదు చేసిందని, దీన్లో పెయింట్ల విభాగానిది రూ.70 కోట్లని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ‘‘మా ఆదాయంలో 40 శాతం వాటా దక్షిణాది రాష్ట్రాల నుంచే ఉంటుంది. గత ఐదేళ్ల నుంచి 50 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాం. ఇప్పటివరకు 600కు పైగా ప్రాజెక్ట్‌లకు పెయింటింగ్‌ను పూర్తి చేశాం. మై హోమ్, అపర్ణా, శోభ, పూర్వాంకర వంటి ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలన్నీ మా క్లయింట్లే. ఇటీవలే అమరావతిలో కార్యాలయాన్ని ప్రారంభించాం’’ అని తెలియజేశారు. 



You may be interested

ఆడిటర్లపై చర్యలు తీసుకోవాలి

Wednesday 5th June 2019

ఆర్‌బీఐతో అంతర్గత విచారణ జరపాలి ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కుంభకోణంపై ఎస్‌ఎఫ్‌ఐవో సూచన నష్టాల రికవరీకి చర్యలపై ప్రణాళిక న్యూఢిల్లీ: దాదాపు రూ. 90,000 కోట్ల రుణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ కేసులో తీవ్ర నేరాల విచారణ సంస్థ (ఎస్‌ఎఫ్‌ఐవో) దర్యాప్తు వేగవంతం చేసింది. మోసాల్లో పాలుపంచుకున్న ఆడిటర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలాగే, లోపాలను గుర్తించడంలో జాప్యానికి గల కారణాలను గుర్తించేందుకు రిజర్వ్ బ్యాంక్ అంతర్గతంగా విచారణ జరపాలని సూచించింది. ఉన్నతాధికారులు కుమ్మక్కై

లాభాలొచ్చినా... వడ్డీకి సరి!

Wednesday 5th June 2019

తగ్గిన డిమాండ్‌; పేరుకుంటున్న నిల్వలు  వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం కొత్త రుణాలు  ఇప్పటికే పాత రుణాలతో కుదేలు  పాత, కొత్త రుణాలపై వడ్డీలు తడిసి మోపెడు  అమ్మకాలు పుంజుకున్నా, తగ్గిన నిర్వహణ లాభం కొత్త ప్రభుత్వ సంస్కరణలపై కార్పొరేట్ల ఆశలు గంప లాభం చిల్లి తీసిందని సామెత. దాదాపు మూడేళ్లపాటు అంతంతమాత్రంగా ఉన్న కంపెనీల ఆర్థిక ఫలితాలు ఇప్పుడిప్పుడే ఒక దారికి వస్తున్నాయి. అయితే అలాంటి కంపెనీల లాభాలను వడ్డీ చెల్లింపులు హరించేస్తున్నాయి. ఈ ఏడాది మార్చితో ముగిసిన

Most from this category