STOCKS

News


టెక్‌ మహీంద్రాకు భారీ డీల్‌

Saturday 7th September 2019
news_main1567830333.png-28247

  • ఏటీ అండ్‌ టీ నుంచి 
  • డీల్‌ విలువ వంద కోట్ల డాలర్లకు మించి ! 

పుణే: ఐటీ దిగ్గజం టెక్‌ మహీంద్రా భారీ డీల్‌ను సాధించింది. అమెరికాకు చెందిన టెలికం కంపెనీ ఏటీ అండ్‌ టీ, నుంచి ఈ కాంట్రాక్ట్‌ను సాధంచామని టెక్‌ మహీంద్రా తెలిపింది. ఏటీ అండ్‌ టీ కంపెనీ తన ఐటీ నెట్‌వర్క్‌ను అధునికీకరించడం కోసం ఈ డీల్‌ను కుదుర్చుకుందని టెక్‌ మహీంద్రా చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ మనోజ్‌ భట్‌ పేర్కొన్నారు. డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను ఆయన వెల్లడించలేదు. అయితే ఈ డీల్‌ విలువ వంద కోట్ల డాలర్లకు మించి ఉంటుందని అంచనా. దాదాపు ఆరేళ్ల కాలంలో తాము సాధించిన అతి పెద్ద డీల్‌ ఇదేనని  భట్‌ పేర్కొన్నారు.  ఈ డీల్‌ కాలపరిమితి ఆరున్నర సంవత్సరాలని తెలిపారు. 2013లో ఈ కంపెనీ బ్రిటిష్‌ టెలికం కంపెనీ బీటీతో వంద కోట్ల డాలర్లకు మించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. 

మరింత మెరుగైన సేవలు ...
టెక్‌ మహీంద్రాతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల మరింత మెరుగైన సేవలను అందించగలుగుతామని ఏటీ అండ్‌ టీ సీఐఓ జాన్‌ సమ్మర్స్‌ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జూన్‌కల్లా అమెరికా వ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయాలన్న తమ లక్ష్యం సులభంగానే సాకారం కాగలదని వివరించారు. 

కాగా టెక్‌ మహీంద్రా కంపెనీ వార్షిక ఆదాయం దాదాపు 500 కోట్ల డాలర్ల మేర ఉంటుంది. దీంట్లో 21 శాతం వరకూ ఏటీ అండ్‌ టీ, బీటీ వంటి అగ్రశ్రేణి కంపెనీల నుంచే వస్తోంది. ఇక కంపెనీ మొత్తం ఆదాయంలో టెలికమ్యూనికేషన్స్‌ విభాగం వాటా 40 శాతానికి మించి ఉంటుంది. You may be interested

అమెజాన్‌ ఆఫ్‌లైన్‌

Saturday 7th September 2019

ఆన్‌లైన్‌లో లభించే ఉత్పత్తులు ఆఫ్‌లైన్‌లోనూ ఇందుకోసం ఫ్యూచర్‌ గ్రూపు, షాపర్స్‌ స్టాప్‌, మోర్‌తో చర్చలు ఈ సంస్థల్లో అమెజాన్‌కు వాటాలు రిలయన్స్‌, ఫ్లిప్‌కార్ట్‌కు గట్టిపోటీనిచ్చే వ్యూహం న్యూఢిల్లీ: అమెజాన్‌ ఉత్పత్తులు మీకు సమీపంలోని మాల్‌లోనూ అమ్ముతుంటే... అప్పుడు తప్పకుండా వెళ్లి చూసి మరీ కొంటారు. ఈ అవకాశం త్వరలోనే అందుబాటులోకి రానుంది. దేశీయ ఈ కామర్స్‌లో బలమైన ప్రదర్శన చూపుతున్న అంతర్జాతీయ రిటైల్‌ సంస్థ అమెజాన్‌, భారత్‌లో ఆఫ్‌లైన్‌ దుకాణాలనూ చేరుకోవాలని ప్రణాళికలు వేసుకుంది. అంటే

ఎగుమతులకు త్వరలోనే వరాలు

Saturday 7th September 2019

జెమ్స్‌, జ్యుయలరీకి సైతం ప్రభుత్వం ప్రకటించే అవకాశం న్యూఢిల్లీ: ఎగుమతులు పెంచుకునే దిశగా ప్రభుత్వం అతి త్వరలోనే పలు ప్రోత్సాహకాలను ప్రకటించనుంది. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం నేపథ్యంలో దేశం నుంచి ఎగుమతులు స్తబ్దుగా ఉండడాన్ని చూస్తూనే ఉన్నాం. దీంతో ప్రోత్సాహక చర్యలపై కేంద్ర ఆర్థిక శాఖ, వాణిజ్య శాఖల అధికారులు ఇప్పటికే పలు సార్లు భేటీ అయి చర్చలు కూడా నిర్వహించారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌) నుంచి పనిచేస్తున్న యూనిట్లకు పన్ను

Most from this category