News


టెక్‌ మహీంద్రా లాభం రూ.1,124 కోట్లు

Wednesday 6th November 2019
news_main1573011893.png-29381

  • 6 శాతం వృద్ధి 
  • 5 శాతం వృద్ధితో రూ.9,070 కోట్లకు ఆదాయం 
  • రూ.671 కోట్లతో బార్న్‌ గ్రూప్‌ కొనుగోలు 

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టెక్‌ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.1,124 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో వచ్చిన నికర లాభం(రూ.1,064 కోట్లు)తో పోల్చితే 6 శాతం వృద్ధి సాధించామని టెక్‌ మహీంద్రా  ఎమ్‌డీ, సీఈఓ సీపీ గుర్నాని తెలిపారు. కార్యకలాపాల ఆదాయం రూ.8,630 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.9,070 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. కంపెనీ ఆర్థిక ఫలితాలు ఇలా ఉన్నాయ్‌...., 

ఆదాయం 128 కోట్ల డాలర్లకు...
డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 14 శాతం వృద్ధితో 16 కోట్ల డాలర్లకు, ఆదాయం 3 శాతం వృద్ధితో 128 కోట్ల డాలర్లకు పెరిగాయి. స్థిర కరెన్సీ పరంగా చూస్తే, ఆదాయం 4 శాతం పెరిగింది.  డిజిటల్‌ విభాగం ఆదాయం సీక్వెన్షియల్‌గా 12 శాతం ఎగసింది.  నిర్వహణ లాభం 7 శాతం తగ్గి రూ.1,501 కోట్లకు చేరింది. నిర్వహణ లాభ మార్జిన్‌ 2.3 శాతం తగ్గి 16.50 శాతానికి చేరింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, నిర్వహణ లాభం 14 శాతం, నిర్వహణ లాభ మార్జిన్‌ 1.3 శాతం చొప్పున పెరిగాయి.  ఏటీఅండ్‌టీ కంపెనీతో బహుళ సంవత్సరాల ఒప్పందాన్ని ఈ క్యూ2లో కుదుర్చుకుంది. 

ఈ క్యూ2లో కంపెనీ నికరంగా 5,749 ఉద్యోగాలిచ్చింది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,31,522కు పెరిగింది. ఉద్యోగుల వలస(ఆట్రీషన్‌ రేటు) ఎలాంటి మార్పు లేకుండా 21 శాతంగా ఉంది. You may be interested

పన్ను భారం తగ్గిస్తే పెట్టుబడులు వస్తాయి

Wednesday 6th November 2019

క్యాపిటల్‌ మార్కెట్లపై ఎస్‌టీటీ, సీజీటీ, స్టాంప్‌డ్యూటీ, జీఎస్‌టీల భారం దీంతో వర్ధమాన మార్కెట్లతో పోటీపడలేని పరిస్థితి ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌ లిమాయే ముంబై: బహుళ పన్నుల భారంతో మన క్యాపిటల్‌ మార్కెట్లు పోటీపడలేకపోతున్నాయని, పెట్టుబడుల రాకను పెంచేందుకు ప్రభుత్వం వీటిని తగ్గించాలని ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌ విక్రమ్‌ లిమాయే కోరారు. క్యాపిటల్‌ మార్కెట్‌ లావాదేవీలపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ), మూలధన లాభాల పన్ను (సీజీటీ), స్టాంప్‌ డ్యూటీ చార్జీలు, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అన్నవి

మందగమనంలోనూ ‘కలర్‌’ఫుల్‌!

Wednesday 6th November 2019

విస్తరణలో సైతం తగ్గని పెయింట్ల కంపెనీలు ఏటా రెండంకెల వృద్ధి; పల్లెలకూ ప్రీమియం రంగులు రూ.50,000 కోట్లకు పరిశ్రమ; భారీగా పెరిగిన షేర్లు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఇల్లయినా, కార్యాలయమైనా అద్దంలా మెరవాలని అంతా అనుకుంటారు. అందుకే కొత్త కొత్త రంగులతో భవనానికి నూతన రూపు తెస్తుంటారు. యజమానులు తమ ఇంటికైనా, ఆఫీసుకైనా గతంలో 6–8 సంవత్సరాలకు ఒకసారి పెయింట్‌ వేయించేవారు. ఇప్పుడు 4–5 ఏళ్లకే వేయిస్తున్నారట. బెడ్‌ రూమ్స్, లివింగ్‌ రూమ్స్‌ విషయంలో

Most from this category