STOCKS

News


టెక్‌ మహీంద్రా లాభం రూ.959 కోట్లు

Wednesday 31st July 2019
news_main1564554738.png-27436

  • 7 శాతం వృద్ధి 
  • 4 శాతం తగ్గిన మార్జిన్‌
  • రూ.8,653 కోట్లకు ఆదాయం 

న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ టెక్‌ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో రూ.959 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ1లో ఆర్జించిన నికర లాభం, రూ. 898 కోట్లుతో పోల్చితే 7 శాతం వృద్ధి సాధించామని టెక్‌ మహీంద్రా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.8,388 కోట్ల నుంచి 5 శాతం పెరిగి రూ.8,653 కోట్లకు చేరిందని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ సీపీ గుర్నానీ తెలిపారు. సీక్వెన్షియల్‌గా చూస్తే, 3 శాతం క్షీణించిందని చెప్పారు. మార్చి క్వార్టర్‌(గత క్యూ4లో)లో 16.1 శాతంగా ఉన్న మార్జిన్‌ 4 శాతం తగ్గి 15.2 శాతానికి చేరిందని తెలిపారు. (ఇతర ఐటీ కంపెనీల సగటు మార్జిన్‌ 24 శాతంగా ఉంది)భవిష్యత్తులో మంచి వృద్ధిని సాధించగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. రెండు భారీ డీల్స్‌ దాదాపు ఖరారయ్యే దశలో ఉన్నాయని వివరించారు. 

రికార్డ్‌ స్థాయి డీల్స్‌..,
ఎంటర్‌ప్రైజ్‌, కమ్యూనికేషన్స్‌ విభాగాల్లో 50 కోట్ల డాలర్ల డీల్స్‌ సాధించామని గుర్నానీ తెలిపారు. ఈ క్యూ1లో రికార్డ్ స్థాయిలో 48 కోట్ల డాలర్ల డీల్స్‌ సాధించామని చెప్పారు.  డీల్స్‌ విషయంలో మంచి పురోగతి సాధిస్తున్నామని డిమాండ్‌ బాగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. డిజిటల్‌ విభాగం కూడా మంచి వృద్ధిని సాధిస్తోందని పేర్కొన్నారు. సాధారణంగా  ఈ క్యూ1లో కమ్యూనికేషన్స్‌ విభాగం బలహీనంగా ఉంటుందని కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ మన్జో్‌ భట్‌ తెలిపారు. దీంతో పాటు వేతనాల పెంపు, రూపాయి పుంజుకోవడం, అమెరికా వీసాల  ఫీజులు పెరగడం  కూడా ప్రభావం చూపడంతో మార్జిన్లు తగ్గాయని వివరించారు.  ఆటోమేషన్‌, కృత్రిమ మేధ అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ ఏడాది వేగవంతమైన వృద్ధి సాధనకు ఇది తోడ్పడుతుందని పేర్కొన్నారు. 

టెక్‌ మహీంద్రా చేతికి మ్యాడ్‌పౌ...
కాగా అమెరికాకు చెందిన స్ట్రాటజిక్‌ డిజైన్‌ కన్సల్టెన్సీ సం‍స్థ, మ్యాడ్‌పౌను టెక్‌ మహీంద్రా కొనుగోలు చేసింది. ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను టెక్‌ మహీంద్రా వెల్లడించలేదు. డిజిటల్‌ విభాగంలో మరింత వృద్ధి సాధించడానికి ఈ కంపెనీ కొనుగోలు తోడ్పడుతుందని గుర్నానీ పేర్కొన్నారు. ఈ కంపెనీ కొనుగోలుతో డిజిటల్‌ విభాగంలో అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మరింతగా విస్తరించగలమని  తెలిపారు. You may be interested

పుస్తక విలువ దిగువకు 105 స్టాకులు

Wednesday 31st July 2019

గత కొన్ని నెలల నుంచి స్టాక్‌ మార్కెట్లు దిద్దుబాట్లకు గురువుతున్నాయి. ఫలితంగా చాలా వరకు కంపెనీల స్టాక్స్‌ వాల్యుషన్‌ ​ తమ పుస్తక విలువ కంటే దిగువకు పడిపోయాయి. మిడ్ క్యాప్ కంపెనీలైన హెచ్‌ఈజీ, గేట్‌వే డిస్ట్రిపార్క్స్, హిమాటింగ్‌కా సీడ్, అపోలో టైర్స్, మహారాష్ట్ర సీమ్‌లెస్, ఎన్‌సిసి, బిర్లా కార్ప్, ఇండియా సిమెంట్స్, ట్రైడెంట్, జెకె టైర్ తదితర కంపెనీల షేర్లు ప్రస్తుతం వాటి పుస్తక విలువ కంటే తక్కువగా ట్రేడవుతన్నాయి. బీఎస్‌ఈ

కార్పోరేట్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఆసక్తి..!

Wednesday 31st July 2019

ఆకర్షితులవుతున్న ఇన్వెస్టర్లు బ్యాంక్‌లు డిపాజిట్లపై వడ్డీ రేట్ల తగ్గింపే కారణం బ్యాంక్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ రేట్ల తగ్గింపు వలన కార్పోరేట్‌ ఫిక్సిడ్‌ డిపాజిట్ల వైపు స్థిర ఆదాయం కలిగిన ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత రెండేళ్ల నుంచి స్టాక్ మార్కెట్‌లలో పెట్టుబడులకు ప్రతికూల రాబడులే వస్తున్నాయని, అందుకే   చాలా మంది పెట్టుబడిదారులు స్థిర-రాబడి ఉత్పత్తులకు ఆకర్షితులవుతున్నారని మనీ హనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సిఈఓ అనుప్ భయ్యా అన్నారు.  ‘మొదటిసారి

Most from this category