News


హైదరాబాద్‌లో టెక్‌ మహీంద్రా గూగుల్‌ క్లౌడ్‌ సెంటర్‌

Wednesday 29th January 2020
news_main1580275889.png-31293

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రముఖ ఐటీ రంగ కంపెనీ టెక్‌ మహీంద్రా హైదరాబాద్‌లో గూగుల్‌ క్లౌడ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను (సీఓఈ) ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీల డిజిటల్‌ ట్రాన్స్ఫ్‌ర్మేషన్‌ను వేగవంతం చేయడానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సెంటర్‌ ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), డేటా అనలిటిక్స్‌ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి కూడా ఉపకరిస్తుందని  టెక్‌ మహీంద్రా క్లౌడ్‌ సర్వీసెస్‌ గ్లోబల్‌ హెడ్‌ వివేక్‌ గుప్తా తెలిపారు. గూగుల్‌ క్లౌడ్‌లో పని భారాన్ని ఆప్టిమైజ్‌ చేయాలనుకునే కంపెనీలకు కన్సల్టింగ్, అసెస్‌మెంట్, మైగ్రేషన్, ఆప్టిమైజేషన్‌ వంటి ఎండ్‌ టు ఎండ్‌ సేవలను అందిస్తామని ఆయన పేర్కొన్నారు. 



You may be interested

మార్కెట్లోకి ‘అథర్‌ 450ఎక్స్‌’ ఈ-స్కూటర్‌

Wednesday 29th January 2020

ధరల శ్రేణి రూ. 99,000 – 1,59,000  3.3 సెకన్లలో 40 కి.మీ వేగానికి న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్‌కు చెందిన ‘అథర్‌ ఎనర్జీ’.. మరో సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను మంగళవారం భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘అథర్‌ 450ఎక్స్‌’ పేరిట విడుదలైన ఈ-స్కూటర్‌.. 6 కిలోవాట్ మోటార్‌, కొత్త 2.9 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. కంపెనీకి చెందిన మునుపటి మోడల్‌ 450కి అప్‌డేటెడ్‌

జేకే లక్ష్మీ సిమెంట్‌ లాభం 17 రెట్లు అప్‌

Wednesday 29th January 2020

4 శాతం పెరిగిన ఆదాయం  తగ్గిన రవాణా, ఇతర వ్యయాలు న్యూఢిల్లీ: జేకే లక్ష్మీ సిమెంట్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో 17 రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.3 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.51 కోట్లకు పెరిగిందని జేకే లక్ష్మీ సిమెంట్‌ కంపెనీ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.1,038 కోట్ల నుంచి 4 శాతం పెరిగి రూ.1,078 కోట్లకు

Most from this category