News


'స్మార్ట్' వాహనాలపై మహీంద్రా దృష్టి

Wednesday 17th July 2019
news_main1563343562.png-27120

  • కేయూవీ, ఎక్స్‌యూవీల్లో ఎలక్ట్రిక్ వెర్షన్ల తయారీ

న్యూఢిల్లీ: వాహనాల వ్యాపార విభాగంలో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇకపై కనెక్టెడ్ వాహనాలు, పెట్రోల్ ఇంజిన్లు, ఎలక్ట్రిక్ వాహనాలపై (ఈవీ) మరింతగా దృష్టి పెట్టాలని మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) నిర్ణయించింది. మహారాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఈవీ విధానం కింద తమ ఎలక్ట్రిక్ వాహనాల ప్రాజెక్టుపై రూ.500 కోట్లు వెచ్చించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఎస్‌యూవీలైన కేయూవీ 100, ఎక్స్‌యూవీ300 వాహనాల్లో ఎలక్ట్రిక్ వెర్షన్లు కూడా రూపొందిస్తున్నట్లు 2018-19 వార్షిక నివేదికలో ఎంఅండ్‌ఎం వివరించింది. గతంలో మాదిరి సరైన ధరతో సరైన ఉత్పత్తిని ప్రవేశపెడితే సరిపోదని.. మార్కెట్లో నెగ్గుకురావాలంటే మరింతగా కృషి చేయాల్సి ఉంటుందని తెలిపింది.
 "పర్యావరణ కాలుష్యం, రహదారులపై భద్రత వంటి అంశాలపై జాగ్రత్తలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంధనాల వినియోగం, వాహనాల కొనుగోలు తీరు తెన్నులు మారుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆటోమోటివ్ పరిశ్రమపై ఇవి చాలా పెద్ద ప్రభావమే చూపిస్తాయి" అని ఎంఅండ్‌ఎం పేర్కొంది. అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్‌తో కలిసి కనెక్టెడ్‌ వాహనాలను రూపొందించనున్నట్లు వివరించింది. ఇంటర్నెట్‌, బ్లూటూత్ తదితర టెక్నాలజీల ద్వారా నియంత్రించగలిగే వాహనాలు ఈ కోవకు చెందుతాయి. నిలకడగా వృద్ధి సాధించే లక్ష్యంతో ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను పటిష్టపర్చుకోవడం, ప్రస్తుత ఉత్పత్తుల్లో కొత్త వేరియంట్లు ప్రవేశపెట్టడం, పరిశోధన.. అభివృద్ధి సామర్ధ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించింది. 2018-19లో మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ (ఎంఈఎంఎల్‌) మొత్తం 10,276 ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం 4,026 యూనిట్లు మాత్రమే విక్రయించింది.You may be interested

మొండి బాకీలు రూ.లక్ష కోట్లు తగ్గాయి

Wednesday 17th July 2019

2019 మార్చి నాటికి రూ.9.34 లక్షల కోట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడి న్యూఢిల్లీ: బ్యాంకుల్లో వసూలు కాని మొండి బకాయిలు (ఎన్‌పీఏలు) గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2018-19) రూ.లక్ష కోట్లు తగ్గి, రూ.9.34 లక్షల కోట్లుగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలియజేశారు. ఎన్‌పీఏల గుర్తింపులో పారదర్శకత, పరిష్కారం, వసూలు తదితర చర్యలతో కూడిన సమగ్ర కార్యాచరణణు అనుసరిస్తున్నామని చెప్పారు. అలాగే, ప్రభుత్వరంగ బ్యాంకులకు మూలధన నిధుల

ఎయిరిండియా విక్రయానికి రోడ్‌షోలు

Wednesday 17th July 2019

వచ్చే నెలాఖరులోగా నిర్వహణ న్యూఢిల్లీ: నష్టాలు, రుణభారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ ఎయిరిండియాలో వాటాల విక్రయానికి సంబంధించి ఇన్వెస్టర్లను ఆకర్షించే దిశగా వచ్చే నెలాఖరులోగా రోడ్‌షోలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. రోడ్‌షోల సందర్భంగా ఆసక్తిగల కొనుగోలుదారులతో అధికారులు సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియలో భాగంగా కొన్ని అంశాలు మినహా ఎయిరిండియా ఖాతాలను బిడ్డర్లు పరిశీలించుకోవచ్చని, షేర్ల కొనుగోలు ఒప్పందాన్ని కూడా చూసుకోవచ్చని వివరించాయి. ఆసక్తి వ్యక్తీకరణ

Most from this category