News


టీసీఎస్‌ ఫలితాలు.. బ్రోకరేజ్‌ల అంచనాలు...

Wednesday 9th October 2019
news_main1570595285.png-28778

గురువారం దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో వివిధ బ్రోకరేజ్‌లు ఫలితాలపై ఎలాంటి అంచనాలతో ఉన్నాయో చూద్దాం..
నిర్మల్‌ బాంగ్‌ సెక్యూరిటీస్‌: యూఎస్‌ డాలర్‌ లెక్కల్లో వృద్ది 2.12 శాతం ఉంటుంది. రూపీ లెక్కల్లో నికర విక్రయాలు గతేడాదితో పోలిస్తే 6.9 శాతం మెరుగుదల చూపుతాయి. ఎబిటా గతేడాది క్యు2 కన్నా తక్కువగా 9,678 కోట్ల రూపాయలకు పరిమితం కావచ్చు. ఎబిటా మార్జిన్‌సైతం 24.6 శాతానికి తగ్గవచ్చు. నికర లాభం గతేడాదితో పోలిస్తే 6.7 శాతం తక్కువగా 8431 కోట్ల రూపాయలుండవచ్చు. 
ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌: స్థిర కరెన్సీ లెక్కల్లో రెవెన్యూ వృద్ధి 3.5 శాతం ఉండవచ్చు. రూపీ బలహీనత మార్జిన్లలో 90 బీపీఎస్‌ పెరుగుదలకు కారకమవుతుంది. యూరప్‌లో వ్యాపారం మందగించినా, ఉత్తర అమెరికాలో బలమైన వృద్ది కనిపిస్తుంది. వివిధ విభాగాల వృద్ది పై వ్యాఖ్యానం కీలకంగా పరిశీలించాలి.
ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌: యూఎస్‌ డాలర్‌ లెక్కల్లో రెవెన్యూ 7 శాతం పెరుగుతుంది. రూపీ లెక్కల్లో విక్రయాల్లో 6.4 శాతం పెరుగుదల ఉంటుంది. ఎబిటా 1.8 శాతం వృద్ధితో రూ.9950.2 కోట్లకు, నికరలాభం 4.6 శాతం పెరుగుదలతో 8267 కోట్ల రూపాయలకు చేరుతుంది. ఎబిటా మార్జిన్‌ 115 బీపీఎస్‌ క్షీణించి 25.4 శాతానిఇ పరిమితం కావచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎబిటా మార్జిన్లు ఆశించిన 26- 28 శాతం రేంజ్‌ని చేరకపోవచ్చు.
సెంట్రమ్‌ బ్రోకింగ్‌: స్థిర కరెన్సీ లెక్కలో 2.6 శాతం రెవెన్యూ వృద్ది,  రూపీ లెక్కలో 6.6 శాతం మేర విక్రయాల్లో వృద్ధి ఉండొచ్చు. ఎబిటా 7.8 శాతం పెరిగి 9935 కోట్ల రూపాయలను చేరవచ్చు.ఎబిటా మార్జిన్లు 121 బీపీఎస్‌ మేర క్షీణించి 25.3 శాతానికి చేరుతుందని అంచనా. నికర లాభంలో 4.5 శాతం వృద్ధి ఉంటుంది. 



You may be interested

16 పైసలు బలహీనపడిన రూపీ

Wednesday 9th October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో బుధవారం 16 పైసలు బలహీనపడి 71.18 వద్ద ప్రారంభమైంది. కాగా దేశీయ ఈక్విటీ మార్కెట్లో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతోపాటు, విదేశీ నిధల ఔట్‌ఫ్లో కొనసాగడంతో అక్టోబర్‌ 7 సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 14 పైసలు క్షీణించి 71.02 వద్ద ముగిసింది. అక్టోబర్‌ 8న దసరా సందర్భంగా ఫారెక్స్‌ మార్కెట్‌కు సెలవు కావడంతో మార్కెట్‌లు ఓపెన్‌ కాలేదు.    ఆర్‌బీఐ రేట్‌ కట్‌ ప్రభావం

లాభాల్లో బంగారం​

Wednesday 9th October 2019

   చైనా సాంకేతిక కంపెనీలను యుఎస్‌ ట్రంప్‌ ప్రభుత్వం బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టడంతోపాటు, కొంత మంది చైనా అధికారులకు యుఎస్‌ వీసా నిరాకరించడంతో యుఎస్‌-చైనా మధ్య ఉద్రిక్త వాతవరణం ముదిరింది. యుఎస్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను చైనా తీవ్రంగా ఖండిస్తోంది. కాగా గురువారం ఇరు దేశాల మధ్య జరగనున్న వాణిజ్య చర్చలకు ముందు ఈ అనిశ్చితి చోటు చేసుకోవడంతో బంగారం ధరలు తిరిగి లాభాల బాట పట్టాయి. దీంతోపాటు

Most from this category