News


అమెరికా టాప్‌ 20లో టీసీఎస్‌..

Saturday 22nd February 2020
news_main1582341687.png-31993

న్యూయార్క్‌: అమెరికాలో ఉద్యోగం చేసేందుకు అత్యుత్తమమైన టాప్ 20 సంస్థల జాబితాలో దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ చోటు దక్కించుకుంది. పలు అమెరికన్ మెగా కంపెనీల సరసన నిల్చిన భారతీయ కంపెనీ ఇదొక్కటే కావడం గమనార్హం. 2020 ఏడాదికి గాను ఫార్చూన్‌ రూపొందించిన బెస్ట్ బిగ్ కంపెనీస్ టు వర్క్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఫార్చున్ జాబితాలో చోటు దక్కించుకోవడంపై టీసీఎస్ ప్రెసిడెంట్ (ఉత్తర అమెరికా, యూకే, యూరప్‌) సూర్య కాంత్ హర్షం వ్యక్తం చేశారు. కస్టమర్లకు అత్యుత్తమ సేవలు అందించేందుకు తాపత్రయపడే ఉద్యోగులకు తాము ప్రాధాన్యమిస్తామని, వారు సంతోషంగా పనిచేసుకునేందుకు అనువైన పరిస్థితులు కల్పిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. 60 పైగా అంశాలపై టీసీఎస్ ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించిన మీదట టాప్ 20 లిస్టులో కంపెనీకి ఫార్చూన్ చోటు కల్పించింది. 2014 నుంచి అమెరికాలో అత్యధికంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న టాప్ రెండు సంస్థల్లో టీసీఎస్ ఒకటిగా ఉంటోంది. 



You may be interested

సీసీఐ విచారణ ఆదేశాలు కొట్టివేయండి

Saturday 22nd February 2020

కర్ణాటక హైకోర్టుకు ఫ్లిప్‌కార్ట్‌ న్యూఢిల్లీ: కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తమపై విచారణ జరపాలంటూ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ ఈ-కామర్స్ సంస్థ ఫ్లి్ప్‌కార్ట్ తాజాగా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) చేసిన ఆరోపణలే ప్రాతిపదికగా, ఎలాంటి ప్రాథమిక ఆధారాలేమీ లేకుండానే సీసీఐ తమపై దర్యాప్తుకు ఆదేశించిందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. వివరాల్లోకి వెడితే.. ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు .. భారీ డిస్కౌంట్లు, ఎక్స్‌క్లూజివ్ ఒప్పందాలతో పోటీని

ఈ ఏడాదీ ఐపీఓల జోరు !

Saturday 22nd February 2020

2020లో ఐపీఓల జోష్‌ ఐపీఓ బాటలో కనీసం 30 కంపెనీలు  రూ.50,000 కోట్లకు పైగా నిధుల సమీకరణ గత ఏడాదితో పోల్చితే నాలుగు రెట్లు  ఎల్‌ఐసీ ఐపీఓ ఈ ఏడాదే ఉంటే 1.50 లక్షల కోట్లకు ఐపీఓ నిధులు  ఈ ఏడాది కూడా ఐపీఓ మార్కెట్‌ జోరుగా ఉండనున్నది. రూ.50,000 కోట్లకు మించి ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)లు రానున్నాయి. తాజాగా ప్రకటించిన ఎల్‌ఐసీ ఐపీఓ ఈ ఏడాదే వచ్చే అవకాశాలుంటే ఇది 1.5 లక్షల కోట్ల మేర

Most from this category