News


హైదరాబాద్‌లో టీసీఎస్‌ ఇన్నోవేషన్‌ హబ్‌

Thursday 21st November 2019
news_main1574307970.png-29745

ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) హైదరాబాద్‌లో ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు చేసింది. వైర్‌లెస్‌ టెక్నాలజీ దిగ్గజం క్వాల్‌కామ్‌ టెక్నాలజీస్‌ సహకారంతో దీనిని స్థాపించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉన్న సంస్థల నూతన డిజిటల్‌ అవసరాలను తీర్చేందుకు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, 5జీ టెక్నాలజీని ఆసరాగా చేసుకుని డొమెయిన్‌ ఆధారిత పరిష్కారాలను ఈ కేంద్రంలో అభివృద్ధి చేస్తారు. ఆరోగ్యం, వాహన, తయారీ, చిల్లర వర్తకం వంటి రంగాల్లో 5జీ వినియోగం ద్వారా కొత్త అవకాశాలను కనుగొంటారు. ఈ పరిష్కారాలతో కస్టమర్లు సరికొత్త వ్యాపార పద్ధతులు, విభిన్న ఉత్పత్తులు, విలువ ఆధారిత సేవలతోపాటు వినియోగదార్లకు మెరుగైన అనుభూతి కలిగించేందుకు దోహదం చేస్తుందని టీసీఎస్‌ తెలిపింది. తద్వారా కంపెనీలకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయని వివరించింది. 



You may be interested

డిఫాల్ట్‌ నిబంధనలు మరింత కఠినం

Thursday 21st November 2019

రైట్స్‌ ఇష్యూ కాలం కుదింపు  పీఎమ్‌ఎస్‌ కనీస పెట్టుబడి పెంపు  సెబీ బోర్డ్‌ నిర్ణయాలు ముంబై: రుణ చెల్లింపుల్లో విఫలానికి సంబంధించిన వెల్లడి నిబంధనలను మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ కఠినతరం చేసింది. రైట్స్‌ ఇష్యూ ప్రక్రియ కాలాన్ని 55 రోజుల నుంచి 31 రోజులకు కుదించింది. అంతే కాకుండా పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌  స్కీమ్‌(పీఎమ్‌ఎస్‌)కు సంబంధించి కనీస పెట్టుబడి మొత్తాన్ని ప్రస్తుతమున్న రూ. 25 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచింది. ఈ మేరకు

‘దివాన్‌’... దివాలా!

Thursday 21st November 2019

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ బోర్డు రద్దు అడ్మినిస్ట్రేటర్‌ నియామకం ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) బోర్డును ఆర్‌బీఐ రద్దు చేసింది. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు మాజీ ఎండీ ఆర్‌ సుబ్రమణియకుమార్‌ను పాలనాధికారిగా (అడ్మినిస్ట్రేటర్‌) నియమించింది. రూ.500 కోట్లు, అంతకుమించి ఆస్తులు కలిగిన సమస్యాత్మక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు), హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలను (హెచ్‌ఎఫ్‌సీలు) దివాలా చర్యల కోసం ప్రతిపాదించే అధికారాన్ని ఆర్‌బీఐకి కట్టుబెడుతూ కేంద్ర సర్కారు గత వారంలో

Most from this category