News


15-18 శాతం వృద్ధి:‍థామస్‌ కుక్‌

Friday 25th October 2019
news_main1571974567.png-29125

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- టూర్స్‌, ట్రావెల్‌ ఏజెన్సీ థామస్‌ కుక్‌ ఇండియా 2019లో పర్యాటకుల సంఖ్య పరంగా 15-18 శాతం వృద్ధి ఆశిస్తోంది. గతేడాది 20 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ట్రావెలర్ల సంఖ్య ఈ ఏడాది 25-30 శాతం అధికం అయ్యే అవకాశం ఉందని థామస్‌ కుక్‌ హాలిడేస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రోమిల్‌ పంత్‌ తెలిపారు. 2020 టూర్‌ ప్యాకేజీలను ప్రకటించిన సందర్భంగా గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘థామస్‌ కుక్‌ ద్వారా భారత్‌ నుంచి 2018లో 1,25,000 మంది పలు దేశాలు పర్యటించారు. 75,000 పైచిలుకు మంది దేశీయంగా ఉన్న దర్శనీయ స్థలాలు, పర్యాటక ప్రదేశాలు చుట్టివచ్చారు. భారత్‌ నుంచి విదేశాలకు వెళ్లేవారిలో దక్షిణాది రాష్ట్రాల వాటా 40 శాతముంది. తెలుగు రాష్ట్రాలు 10 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. లభించే ఆహార పదార్థాలను బట్టే హైదరాబాదీయులు పర్యాటక ప్రదేశాన్ని ఎంచుకుంటారు’ అని వివరించారు.



You may be interested

రిలయన్స్‌ ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌’ ఆఫర్‌

Friday 25th October 2019

పండుగల సీజన్‌ సందర్భంగా రిలయన్స్‌ డిజిటల్‌ ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌’ పేరిట ఆఫర్‌ను ప్రకటించింది. అక్టోబర్‌ 25 నుంచి 31వరకు కొనసాగనున్న తాజా ఆఫర్‌లో టీవీలు, గృహోపరకణాలు, మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌ వంటి ఎలక్ట్రానిక్స్‌పై 15 శాతం క్యాష్‌బ్యాక్‌ ఉండగా.. విడిభాగాలపైమరో 10 శాతం డిస్కౌంట్‌ ఉన్నట్లు వెల్లడించింది. లక్కీ కస్టమర్లకు కిలో బంగారం, లగ్జరీ కార్లు, మోటార్‌ సైకిళ్లు, ఎల్‌ఈడీ టీవీలు, ఐ-ఫోన్లను బహుమతులుగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆఫర్‌

ఎన్‌ఎస్‌ఈలో కొత్త సూచీ

Friday 25th October 2019

న్యూఢిల్లీ: మిడ్‌క్యాప్ కంపెనీలకు సంబంధించి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్‌ఎస్‌ఈ) తాజాగా నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 క్వాలిటీ 50 ఇండెక్స్‌ను ప్రారంభించింది. గడిచిన అయిదేళ్లలో ఆయా సంస్థల లాభదాయకత, రుణభారం, ఆదాయా వృద్ధి అవకాశాలు తదితర అంశాల ప్రాతిపదికన నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 సూచీలోని టాప్ 50 కంపెనీలను ఈ స్మార్ట్‌ బీటా ఇండెక్స్‌లో చేర్చుతామని ఎన్‌ఎస్ఈ ఇండిసెస్‌ సంస్థ వెల్లడించింది. ఈ సూచీకి 2005 ఏప్రిల్ 1 బేస్‌

Most from this category