News


ఐటీసీ షేరు పతనం... పన్నుపోటొక్కటే కారణమా?

Tuesday 4th February 2020
news_main1580794649.png-31492

అంతర్జాతీయంగా బలహీనంగా ఉన్న టొబాకో వ్యాపారం
ప్రభావం చూపని కొత్త సీఈఓ
బడ్జెట్లో సిగిరెట్లపై పన్ను భారం పెంచడంతో ఐటీసీ రెండ్రోజుల్లో దాదాపు 12 శాతం పతనమైంది. ఇప్పుడే కాదు చాలాసార్లు అనలిస్టులు, మదుపరుల అంచనాలను ఐటీసీ బోల్తా కొట్టిస్తూనే ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. రెండేళ్లుగా దాదాపు 85 శాతం మంది అనలిస్టులు ఈ స్టాకుపై బుల్లిష్‌గా ఉంటున్నా ఐటీసీ మాత్రం స్థిరంగా పతనమవుతూ వచ్చింది. తాజాగా దాదాపు ఐదేళ్ల కనిష్ఠాలకు దిగజారింది. షేరు పీఈ నిష్పత్తి 2004 స్థాయిలకు పడిపోయింది. పన్ను పెంపుదల మాత్రమే ఐటీసీ పతనానికి కారణం కాదని, షేరు కుంగుబాటుకు అనేక కారణాలున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిజానికి రెండేళ్లుగా సిగిరెట్లపై పన్ను కొత్తగా పెరిగింది లేదు. పైగా భారత్‌లో ఇ- సిగిరెట్లను నిషేధించారు. ఇవన్నీ ఐటీసీకి సానుకూలాంశాలే! కానీ షేరు 2017 గరిష్ఠం రూ.367 నుంచి ఇప్పటికి దాదాపు 45 శాతం పతనమైంది. మరోవైపు సిగిరెట్ల వ్యాపారమే చేసే గాడ్‌ఫ్రేఫిలిప్స్‌, వీఎస్‌టీ షేర్లు ఈ రెండేళ్లలో దాదాపు 26 శాతం దూసుకుపోయాయి. ఐటీసీ లాభాలు ఐదేళ్లలో 7 శాతం చక్రీయ వార్షిక వృద్ధి నమోదు చేశాయి. ఆర్‌ఓసీ దాదాపు 35 శాతముంది. ఇన్ని సానుకూలాంశాలున్నా షేరు మాత్రం నేల చూపులే చూసింది. ఇదంతా అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా జరిగిన నెగిటివ్‌ ప్రభావమని కొందరి నిపుణుల అంచనా. 
బలహీన గ్లోబల్‌ ట్రెండ్‌
ఎస్‌అండ్‌పీ 500తో పోలిస్తే ఎస్‌అండ్‌పీ టొబాకో ఇండెక్స్‌ 28 శాతం డిస్కౌంట్‌లో ట్రేడవుతోంది. 2018 ఆరంభం నుంచి ఈ డిస్కౌంట్‌ పెరుగుతూ వచ్చింది. యూఎస్‌లో సిగిరెట్ల కొనుగోలు కనిష్ఠవయసు పెంచడం లాంటి చర్యలు టొబాకో ఇండెక్స్‌పై ప్రభావం చూపాయి. భవిష్యత్‌లో సైతం సిగిరెట్ల వ్యాపారానికి సానుకూలత ఉండదని, నిషేధాలు, పన్నులు కొనసాగుతాయని ఇన్వెస్టర్ల సమాజం భావిస్తోంది. దీనికితోడు ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతోంది. యూరోమానిటర్‌ డేటా ప్రకారం దశాబ్దకాలంగా సిగిరెట్లు తాగే పెద్దల సంఖ్య ఏడాదికేడాది కొంతమేర తగ్గుతూ వస్తోంది. గ్లోబల్‌స్మోకింగ్‌ ప్రీవాలెన్స్‌ రేటు దశాబ్దంలో ఏటా దాదాపు ఒక శాతం తగ్గింది. 2008 వరకు 2.3 శాతం వార్షిక వృద్ధి చూపిన టొబాకో విక్రయాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. 2022 నాటికి ఈ విక్రయాల వృద్ది కేవలం ఒక్క శాతానికి పరిమితం కావచ్చన్న అంచనాలున్నాయి. మరోవైపు ఐటీసీకి సీఈఓ మారడం పాజిటివ్‌ ప్రభావం చూపలేకపోయింది. 2017లో సంజీవ్‌ పురి ఐటీసీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి షేరు ధర పడుతూ వచ్చింది.

 
నెక్ట్స్ ఏంటి?
చౌక వాల్యూషన్లు మరింత చౌకగా మారినా మార్కెట్‌ వర్గాలు బుల్లిష్‌గా మారలేదు. పన్నులు, నిబంధనలతో సిగిరెట్ల వ్యాపారంపై వృద్ధి అంచనాలు అస్పష్టంగా ఉన్నాయి. లిక్కర్‌ బిజినెస్‌తో పోలిస్తే సిగిరెట్‌ వ్యాపారం క్రమంగా ప్రభ కోల్పోతోంది. మరోవైపు ఐటీసీకి చెందిన సిగిరెట్‌ఏతర వ్యాపారం పుంజుకొని సిగిరెట్‌ వ్యాపారాన్ని అధిగమించే స్థాయికి చేరాలంటే మరింత సమయం పడుతుందని అంచనాలున్నాయి. దీంతో ఐటీసీ షేరును కోలుకునేందుకు తక్షణ ఉత్ప్రేరకాలేవీ కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో కంపెనీ తన సిగిరెట్‌ వ్యాపారాన్ని డీమెర్జ్‌ చేయడం లేదా తోటి సిగిరెట్‌ కంపెనీల్లో దేన్నైనా కొనుగోలు చేయడం లేదా అక్రమ సిగిరెట్‌ దందాపై కఠినమైన చట్టాలు రావడం లాంటి చర్యలు జరిగితే తప్ప షేరులో జోరు కనిపించకపోవచ్చని నిపుణుల అంచనా!


ITC

You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Tuesday 4th February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు నేడు బోర్డు సమావేశాలు నిర్వహించే కంపెనీలు..  ఆదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌, అవంతీ ఫీడ్స్‌, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌, బల్‌మర్‌ లారై అండ్‌ కంపెనీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, ఫస్ట్‌సోర్స్‌ సొల్యూషన్స్‌, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఆరికిల్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ సాఫ్ట్‌వేర్‌, పిరమాళ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, టాటా గ్లోబల్‌ బేవరేజస్‌, థర్‌మ్యాక్స్‌, టైటాన్‌ కంపెనీ, టీవిఎస్‌ మోటార్‌

బీమా షేర్ల టార్గెట్‌ ధరల్లో కోత?

Tuesday 4th February 2020

బడ్జెట్‌ ప్రతిపాదనలతో ప్రతికూల ప్రభావం! బ్రోకింగ్‌ సంస్థల తాజా అంచనాలు ఆదాయ పన్నుకు సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్న తాజా ప్రతిపాదనల కారణంగా బీమా రంగ కంపెనీలపై దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం పడనున్నట్లు బ్రోకింగ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీంతో బీమా రంగ షేర్ల టార్గెట్‌ ధరలను కుదిస్తున్నట్లు తెలియజేశాయి. ఇతర వివరాలు చూద్దాం.. కేంద్ర ఆర్థిక శాఖ బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్ను సవరణల నేపథ్యంలో బీమా రంగ కంపెనీలపై స్వల్ప కాలంలో పరిమిత

Most from this category