News


కార్పొరేట్‌ బాండ్లలో పెట్టుబడులపై పన్ను రాయితీలు

Friday 14th June 2019
news_main1560495486.png-26291

  • టర్మ్‌ బీమా ప్రీమియంపైనా అదనపు పన్ను రాయితీ
  • కేంద్రానికి ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ సూచనలు

న్యూఢిల్లీ: రిటైల్‌ ఇన్వెస్టర్లకు పన్ను రాయితీలను మరింత విస్తరించాలని ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ కేంద్ర ఆర్థిక శాఖకు సూచించాయి. కార్పొరేట్‌ బాండ్లలో ఇన్వెస్ట్‌మెంట్‌పై పన్ను రాయితీలు ఇవ్వాలని, అలాగే, టర్మ్‌ బీమా ప్లాన్ల ప్రీమియంపైనా అదనపు పన్ను రాయితీలు కల్పించాలని కోరాయి. జూలై 5న కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను లోక్‌సభకు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ ముందస్తుగా వివిధ వర్గాలు, సంస్థలు, నిపుణుల అభిప్రాయాలను ఆర్థిక మంత్రిత్వ శాఖాధికారులు తెలుసుకునే ప్రక్రియను చేపట్టారు. ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలకు ప్రత్యేకంగా నిధులు అందించేందుకు ఓ విండోను ఏర్పాటు చేయాలని, ఈ రంగంలో ఫైనాన్షియల్‌ సెక్టార్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (ఎఫ్‌ఎస్‌డీసీ) పాత్రను పెంచాలని ఫైనాన్షియల్‌ అండ్‌ క్యాపిటల్‌ మార్కెట్‌ సంస్థలు సూచించాయి. అలాగే, ప్రాంతీయ బ్యాంకుల్లోకి నిధుల లభ్యతను తీసుకురావాలని కోరాయి.
ఇరువురికీ ప్రయోజనం
‘‘కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్‌ను ఏ విధంగా వృద్ధి చేయాలన్న దానిపై చర్చ జరిగింది. ప్రస్తుతం రిటైల్‌ ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. నేరుగా ఇన్వెస్ట్‌ చేసే రిటైల్‌ ఇన్వెస్టర్ల కూడా పన్ను రాయితీలను విస్తరింపజేస్తే వారితోపాటు కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్‌ కూడా లాభపడుతుంది’’ అని ఐడీబీఐ బ్యాంకు ఎండీ, సీఈవో రాకేశ్‌శర్మ తెలిపారు. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు గాను ఎన్‌పీఎస్‌ పథకం మాదిరే టర్మ్‌ ప్లాన్లకు అదనపు పన్ను రాయితీలను కల్పించాలని సూచించినట్టు బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) చైర్మన్‌ సుభాష్‌ చంద్ర కుంతియా పేర్కొన్నారు. ప్రభుత్వ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సమీక్షించాలని, బ్యాంకింగ్‌ రంగంలో ఎన్‌పీఏలకు కేటాయింపులను ఓ కమిటీ ఏర్పాటు ద్వారా సమీక్షించాలని, డెట్‌ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌‌ను ఏర్పాటు చేయాలని, సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) తరహా పలు పన్నుల హేతుబద్ధీకరణ, ప్రత్యేక బాండ్‌ ఎక్సేంజ్‌ను ఏర్పాటు చేయాలని, ఇన్విట్‌లలో ఇన్వెస్ట్‌ చేసేందుకు బ్యాంకులను అనుమతించాలన్న సూచనలు కూడా ఈ సమావేశంలో భాగంగా ఆర్థిక శాఖ మందుకు వచ్చాయి.
పన్ను రాయితీలపై చర్చ
‘‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రుణాలకు సంబంధించి, ఆర్థిక రంగ పునరుత్తేజం, ఎంఎస్‌ఎంఈ, ఎగుమతుల విభాగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఏ విధమైన పన్ను రాయితీలు ఇవ్వొచ్చన్న దానిపై ఎన్నో సూచనలు వచ్చాయి’’ అని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ తెలిపారు. ప్రస్తుతానికి లిక్విడిటీ అన్నది పెద్ద సవాలు కాదన్నారు పీఎన్‌బీ ఎండీ, సీఈవో సునీల్‌ మెహతా. క్యాపిటల్‌ మార్కెట్లు, ఫైనాన్షియల్‌ సెక్టార్‌, ఎన్‌బీఎఫ్‌సీ, ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ తదితర అంశాలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు, ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎన్‌ఎస్‌ విశ్వనాథన్‌, సెబీ పూర్తి కాలపు సభ్యడు జి.మహాలింగం, కోటక్‌ బ్యాంకు అధినేత ఉదయ్‌కోటక్‌, పలు బ్యాంకుల చీఫ్‌లు ఆర్థిక శాఖతో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు.  You may be interested

అపోలో హాస్పిటల్స్‌, అబాట్‌ భాగస్వామ్యం

Friday 14th June 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: హృదయ సంబంధ ముప్పులను ముందే గుర్తించేందుకు అపోలో హాస్పిటల్స్‌, అబాట్‌ డయాగ్నస్టిక్స్‌ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా పేషెంట్లకు అబాట్‌ అభివృద్ధి చేసిన ట్రోపోనిన్‌-1 బ్లడ్‌ టెస్ట్‌ చేసి ఆ సమాచారాన్ని భద్రపరుస్తారు. హృదయ సంబంధ చికిత్సల విషయంలో ఇలా సమాచారాన్ని భద్రపర్చడం దేశంలో ఇదే తొలిసారి అని ఇరు సంస్థలు ప్రకటించాయి. 

యస్‌ బ్యాంక్‌లో మళ్లీ చేరే ప్రశ్నే లేదు

Friday 14th June 2019

యస్‌ బ్యాంక్‌లో మళ్లీ పాగా వేయనున్నారన్న వార్తలను యస్‌ బ్యాంక్‌ మాజీ సీఈఓ రాణా కపూర్‌ తోసిపుచ్చారు. ప్రస్తుత సీఈఓ రవ్‌నీత్‌ గిల్‌, ప్రస్తుత డైరెక్టర్ల బోర్డ్‌పై పూర్తి విశ్వాసం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత సంధి కాలం నుంచి యస్‌బ్యాంక్‌ విజయవంతంగా బయటపడగలదని పేర్కొన్నారు. రాణా కపూర్‌ వారసుడిగా రవ్‌నీత్‌ గిల్‌ ఈ ఏడాది మార్చిలో  సీఈఓగా పగ్గాలు చేపట్టారు. భారీ ప్రక్షాళన చేపట్టిన ఫలితంగా

Most from this category