News


కొత్త విధానంలో పన్నుభారం ఇలా పెరుగుతుంది

Sunday 2nd February 2020
news_main1580619742.png-31431

దీర్ఘకాలిక పొదుపు అలవాటుపై ప్రతికూల ప్రభావం
ఆర్థికమంత్రి చర్యలను తప్పుపడుతున్న ట్యాక్స్‌ నిపుణులు

సాక్షి, అమరావతి: కొత్త పన్నుల విధానంలో పన్ను రేట్లు తగ్గించడం వల్ల పన్ను భారం భారీగా తగ్గుతుందని, దీనివల్ల కేంద్ర ప్రభుత్వం రూ.40,000 కోట్ల ఆదాయం కోల్పోంతుందన్న మాటల్లో వాస్తవం లేదని ట్యాక్సేషన్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కీలకమైన పన్ను మినహాయింపులను ఎత్తివేయడం వల్ల ప్రజల్లో పొదుపు అలవాటుపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. పన్ను భారం తగ్గించుకోవడానికి చాలామంది బీమా, పీపీఎఫ్‌, గృహరుణాలు వంటివి తీసుకుంటున్నారని, ఇప్పుడు వీటిని తొలగించడం వల్ల ఈ పథకాలకు ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందని ట్యాక్స్‌ నిపుణులు ఎంఎన్‌ శాస్త్రి స్పష్టం చేస్తున్నారు. వృద్ధిరేటును పెంచడం కోసం పొదుపు శక్తిని తగ్గంచడం ద్వారా కొనుగోలు శక్తిని పెంచాలని ఆర్థికమంత్రి ఆలోచన కింద ఉన్నట్లు కనిపిస్తోందని, కానీ ఇది దీర్ఘకాలంలో మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందన్నారు. ఏ విధంగా చూసినా కొత్త విధానం కంటే పాత విధానమే భారం తక్కువగా ఉంటుందని ట్యా్‌క్స్‌ నిపుణురాలు కె.వి.ఎల్‌.ఎన్‌ లావణ్య స్పష్టం చేస్తున్నారు.పన్ను రేటు సగానికి సగం తగ్గినా మినహాయింపులు ఎత్తివేయడం వల్ల పాత విధానం కంటే కొత్త విధానంలో పన్ను చెల్లించాల్సి వస్తోందన్నారు. ప్రస్తుత విధానంలో రూ.7.5 లక్షల ఆదాయం ఉన్న వారి వరకు మినహాయింపులను వినియోగించుకోవడం ద్వారా ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదని, అదే కొత్త విధానంలో అయితే ఏకంగా రూ.37,500 పన్ను చెల్లించాల్సి వస్తోందన్నారు.

కేస్‌ స్టడీ1

వార్షిక ఆదాయం రూ.7.5 లక్షలు

వివరం            పాత విధానం        కొత్త విధానం
బేసిక్‌            4.0 లక్షలు        4.0 లక్షలు
హెచ్‌ఆర్‌ఏ            2.5 లక్షలు        2.5 లక్షలు
అలవెన్స్‌            1.0 లక్షలు        1.0 లక్షలు
మొత్తం జీతం        7.5 లక్షలు        7.5 లక్షలు

--------------------------------------------------------------
పన్ను ఆదాయం
బేసిక్‌             4.0 లక్షలు        4.0 లక్షలు
హెచ్‌ఆర్‌ఏ            1.5 లక్షలు        2.5 లక్షలు
అలవెన్సు            1.0 లక్షలు        1.0 లక్షలు
పన్ను ఆదాయం        6.5 లక్షలు        7.5 లక్షలు
------------------------------------------------------------------
మినహాయింపులు    
స్టాండర్డ్‌ డిడక‌్షన్‌        50 వేలు            --
సెక‌్షన్‌ 80సీ            1.0 లక్షలు        --
నికరపన్ను ఆదాయం    5 లక్షలు            7.5 లక్షలు
చెల్లించాల్సిన పన్ను        --            37,500

            
-----------------------------------------------------------------------------------------------

కేస్‌ స్టడీ2
వార్షిక ఆదాయం రూ.10 లక్షలు

వివరం            పాత విధానం        కొత్త విధానం
బేసిక్‌            5.0 లక్షలు        5.0 లక్షలు
హెచ్‌ఆర్‌ఏ            3.0 లక్షలు        3.0లక్షలు
అలవెన్స్‌            2.0 లక్షలు        2.0 లక్షలు
మొత్తం జీతం        10 లక్షలు        10 లక్షలు
--------------------------------------------------------------
పన్ను ఆదాయం
బేసిక్‌             5.0 లక్షలు        5.0 లక్షలు
హెచ్‌ఆర్‌ఏ            1.5 లక్షలు        3.0 లక్షలు
అలవెన్సు            2.0 లక్షలు        2.0 లక్షలు
పన్ను ఆదాయం        8.5 లక్షలు        10.0 లక్షలు
------------------------------------------------------------------
మినహాయింపులు    
స్టాండర్డ్‌ డిడక‌్షన్‌        50 వేలు            --
సెక‌్షన్‌ 80సీ            1.5 లక్షలు        --
నికరపన్ను ఆదాయం    6.5 లక్షలు        10 లక్షలు
చెల్లించాల్సిన పన్ను        42,500            75,000

------------------------------------------------------------------------------------
 

కేస్‌ స్టడీ 3
వార్షిక ఆదాయం రూ.15 లక్షలు

వివరం            పాత విధానం        కొత్త విధానం
బేసిక్‌            9.0 లక్షలు        9.0 లక్షలు
హెచ్‌ఆర్‌ఏ            4.0 లక్షలు        4.0లక్షలు
అలవెన్స్‌            2.0 లక్షలు        2.0 లక్షలు
మొత్తం జీతం        15 లక్షలు        15 లక్షలు
--------------------------------------------------------------
పన్ను ఆదాయం
బేసిక్‌             9.0 లక్షలు        9.0 లక్షలు
హెచ్‌ఆర్‌ఏ            2 లక్షలు            4.0 లక్షలు
అలవెన్సు            2.0 లక్షలు        2.0 లక్షలు
పన్ను ఆదాయం        13 లక్షలు        15 లక్షలు
------------------------------------------------------------------
మినహాయింపులు    
స్టాండర్డ్‌ డిడక‌్షన్‌        50 వేలు            --
సెక‌్షన్‌ 80సీ            1.5 లక్షలు        --
నికరపన్ను ఆదాయం    11 లక్షలు        15 లక్షలు
చెల్లించాల్సిన పన్ను        1,42,500        1,87,500

-కేవీఎల్‌ఎన్‌ లావణ్య, ట్యాక్సేషన్‌ నిపుణురాలు
 



You may be interested

బడ్జెట్‌కు ముందు మంత్రిగారి పూజ

Sunday 2nd February 2020

బడ్జెట్‌ సమర్పించడానికి కొన్ని గంటల ముందు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ శనివారం తన నివాస గృహంలో పూజలు చేశారు. నేలపై దుప్పటి పరుచుకుని దైవ విగ్రహం ఎదుట స్వయంగా ఆయనే పూజలో కూర్చున్నారు. ‘ప్రజలందరికీ మంచి జరిగేలా బడ్జెట్‌ను రూపొందించేందుకు ప్రభుత్వం శ్రమించింది. అందరికీ మంచి జరగాలని దైవాన్ని కూడా ప్రార్థించాను. ‘అందరితో కలిసి, అందరి అభివృద్ధికి’ అనే మోదీ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా బడ్జెట్‌

ఐఎఫ్‌ఎస్‌సీ ఎక్సేంజ్‌ల్లో బాండ్ల లిస్టింగ్‌కు బూస్ట్‌

Sunday 2nd February 2020

విత్‌హోల్డింగ్‌ పన్ను 4 శాతానికి తగ్గింపు ఐఎఫ్‌ఎస్‌సీ ఎక్సేంజ్‌లో బాండ్ల లిస్టింగ్‌ను ‍ప్రోత్సహించేందుకు.. ఈ బాండ్ల వడ్డీ చెల్లింపులపై విత్‌హోల్డింగ్స్‌ ట్యాక్స్‌(ముందస్తుగా వసూలు చేసే పన్ను)ను 5 శాతం నుంచి 4 శాతానికి తగ్గిస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. ఈ చర్య మరింత మంది అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఐఎఫ్‌ఎస్‌సీ ఎక్సేంజ్‌లోని బాండ్లలో పెట్టుబడులు పెట్టే దిశగా ప్రోత్సహించనుంది. ఈ చర్య బాండ్లను జారీ చేసే కంపెనీలకు మరింత ప్రోత్సాహాన్నిస్తుందని, మరింత మంది అంతర్జాతీయ

Most from this category