News


టాటా స్టీల్‌ నష్టాలు రూ.1,228 కోట్లు

Saturday 8th February 2020
news_main1581132266.png-31609

  • రూ.34,774 కోట్లకు అమ్మకాలు 
  • 7 శాతం తగ్గిన నిర్వహణ లాభ మార్జిన్‌ 

న్యూఢిల్లీ: టాటా స్టీల్‌ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో క్వార్టర్‌లో రూ.1,228 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.1,753 కోట్ల నికర లాభం ఆర్జించామని టాటా స్టీల్ తెలిపింది. సీక్వెన్షియల్‌గా చూస్తే (ఈ క్యూ2లో)రూ.3,302 కోట్ల నికర లాభం వచ్చిందని పేర్కొంది. అమ్మకాలు తక్కువగా ఉండటం, యూరప్‌ కార్యకలాపాలకు సంబంధించిన ఇంపెయిర్‌మెంట్‌ కేటాయంపుల కారణంగా ఈ క్యూ3లో భారీగా నికర నష్టాలు వచ్చాయని వివరించింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండటం, ప్రభుత్వం మౌలిక రంగ ప్రాజెక్ట్‌లపై వ్యయాలు పెంచుతుండటం తదితర కారణాల వల్ల ఉక్కుకు డిమాండ్‌ మెరుగుపడగలదన్న ఆశాభావాన్ని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ టి.వి. నరేంద్రన్‌ వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు....

రూ.3,659 కోట్లకు తగ్గిన నిర్వహణ లాభం 
గత క్యూ3లో  రూ.38,086 కోట్లుగా ఉన్న స్థూల అమ్మకాలు ఈ క్యూ3లో రూ.34,774 కోట్లకు తగ్గాయి. మొత్తం వ్యయాలు రూ.35,930 కోట్ల నుంచి రూ.35,849 కోట్లకు చేరాయి.  నిర్వహణ లాభం రూ.6,726 కోట్ల నుంచి రూ.3,659 కోట్లకు తగ్గింది. నిర్వహణ లాభ మార్జిన్‌ 17.3 శాతం నుంచి 10.2 శాతానికి తగ్గింది. ఒక్కో టన్నుకు నిర్వహణ లాభం రూ.10,404 కోట్ల నుంచి రూ.5,003 కోట్లకు తగ్గింది. భారత కార్యకలాపాలకు సంబంధించి నికర లాభం రూ.2,253 కోట్ల నుంచి 43 శాతం తగ్గి రూ.1,194 కోట్లకు చేరింది. ఆదాయం 5 శాతం తగ్గి రూ.21,299 కోట్లకు పడిపోయింది. 
 



You may be interested

మారుతీ కొత్త ‘ఇగ్నిస్‌’ ఆవిష్కరణ

Saturday 8th February 2020

గ్రేటర్‌ నోయిడా: మారుతీ సుజుకీ ఇండియా... ఇగ్నిస్‌ మోడల్‌లో కొత్త వెర్షన్‌ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ఈ తాజా కాంపాక్ట్‌ ఎస్‌యూవీలో 1.2 లీటర్ల బీఎస్‌-6 పెట్రోల్‌ ఇంజిన్‌ అమర్చింది. కొత్త వెర్షన్‌ 17.78 సెం.మీ స్మార్ట్ ప్లే స్టూడియోతో పాటు లైవ్‌ ట్రాఫిక్‌, డ్రైవర్ భద్రతా హెచ్చరికలు, వెహికిల్‌ సమాచారం వంటి ఫీచర్లు కలిగిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌, సేల్స్‌) శశాంక్‌ శ్రీవాస్తవ వివరించారు.

రైల్వే స్టేషన్ల అభివృద్ధికి దిగ్గజాల క్యూ

Friday 7th February 2020

ప్రయివేటు రైళ్లను ఇప్పటికే ప్రయోగాత్మకంగా పట్టాలపైకి ఎక్కించిన రైల్వే శాఖ.. ఇక రైల్వే స్టేషన్ల అభివృద్ధిలోనూ ప్రయివేటు సంస్థల సాయం తీసుకోనుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 50 రైల్వే స్టేష్లను దేశవ్యాప్తంగా ప్రయివేటు విమానాశ్రయాల మాదిరిగా అభివృద్ధి కోసం ప్రైవేటు సంస్థలకు అప్పగించనున్నారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అదానీ గ్రూపు, షాపూర్‌జీ పల్లోంజీ, టాటా రియాలిటీ, ఎన్‌ఐఐఎఫ్‌, జీఎంఆర్‌, జేకేబీ ఇన్‌ఫ్రా, గ్లోబల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌, ఎస్సెల్‌ గ్రూపు, యాంకరేజ్‌

Most from this category