News


టీసీఎస్‌ మెడకు టాటాటెలి ఏజీఆర్‌ బకాయి గుదిబండ!

Wednesday 29th January 2020
news_main1580275614.png-31291

నిధుల సమీకరణ యత్నాల్లో టాటాసన్స్‌
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టాటాటెలిసర్వీసెస్‌కు చెందిన రూ. 13823 కోట్ల ఏజీఆర్‌ బకాయిలు చెల్లించేందుకు టాటాసన్స్‌ నిధులు సమకూర్చుకుంటోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకోసం తమ గ్రూప్‌నకు చెందిన దిగ్గజ కంపెనీ టీసీఎస్‌పై టాటాసన్స్‌ ఎక్కువగా ఆధారపడనుందని తెలిపింది. ఏజీఆర్‌ బకాయిలపై వేసిన రివ్యూ పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయడంతో టాటాటెలి తక్షణం ఈ బకాయిలు చెల్లించాల్సిఉంది. ఇందుకోసం టీసీఎస్‌ నుంచి నిధులు సమకూర్చుకోవాలని టాటాసన్స్‌ యోచిస్తోంది. ఈ వారంలో సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటీషన్‌ విచారణ ఉంది. ఈ విచారణ అనంతరం బకాయిల చెల్లింపునకు కోర్టు డెడ్‌లైన్‌ పొడిగిస్తే టాటాలకు తొందర ఉండదు, లేని పక్షంలో వెంటనే బకాయిలు చెల్లించాల్సిఉంటుంది. 


ఇంత మొత్తంలో బకాయిలు చెల్లించడం అనైతికమని, కానీ చట్టాలను అనుసరించి తమ గ్రూప్‌ ఎలాంటి బకాయిలైనా చెల్లించేందుకే రెడీగా ఉందని టాటా వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ విషయమై టాటాసన్స్‌ బోర్డు చర్చలు జరిపిందన్నారు. ప్రస్తుత మందగమన వాతావరణంలో ఇంత మొత్తం ఎలా చెల్లించాలన్న అంశమై తమ ఫైనాన్స్‌ టీమ్‌ పథకాలు సిద్ధం చేసుకుంటోందన్నారు. ఒకపక్క ఐటీ శాఖతో కోర్టులో పోరాటం చేస్తుండగా మరోపక్క ఈ బకాయిల భారం పడడం ఇబ్బందికరమని తెలిపారు. ఈ చెల్లింపుతో బాలెన్స్‌ షీటుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? విదేశీ ఇన్వెస్టర్లు ఎలా స్పందిస్తారు? తదితర అంశాలు ఆందోళనకలిగించేవిగా ఉన్నాయన్నారు. డొకొమోతో వ్యాపారం మూసివేసి అన్ని బకాయిలు తీర్చేశామని, ఇప్పుడీ ఏజీఆర్‌ బకాయిల్లాంటి అంశాలు వచ్చి తమ ప్రణాళికలను పాడు చేస్తుంటాయని వాపోయారు. గతేడాది అక్టోబర్‌లో టాటాలు డొకొమోకు బకాయిలు చెల్లించివేశారు. మరలా స్వల్పకాలంలోనే ఏజీఆర్‌ అంశం మెడకుచుట్టుకుంది. ఇప్పుడు టీసీఎస్‌లో కొంతమేర వాటాలు అమ్మడం లేదా, టీసీఎస్‌ లాభాలను వాడుకోవడం తప్పకపోవచ్చని టాటా వర్గాలు తెలిపాయి. తాజా వార్తల నేపథ్యంలో బుధవారం టీసీఎస్‌ షేరు దాదాపు ఒక్క శాతం నష్టంతో రూ. 2163 వద్ద ట్రేడవుతోంది. You may be interested

జేకే లక్ష్మీ సిమెంట్‌ లాభం 17 రెట్లు అప్‌

Wednesday 29th January 2020

4 శాతం పెరిగిన ఆదాయం  తగ్గిన రవాణా, ఇతర వ్యయాలు న్యూఢిల్లీ: జేకే లక్ష్మీ సిమెంట్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో 17 రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.3 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.51 కోట్లకు పెరిగిందని జేకే లక్ష్మీ సిమెంట్‌ కంపెనీ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.1,038 కోట్ల నుంచి 4 శాతం పెరిగి రూ.1,078 కోట్లకు

క్యూ3 ఎఫెక్ట్‌- టాటా కాఫీ, కమిన్స్‌ స్పీడ్‌

Wednesday 29th January 2020

5 శాతం ఎగసిన షేర్లు లాభాల్లో మార్కెట్లు యాపిల్‌ ఇంక్‌ ఫలితాల జోష్‌తో మంగళవారం అమెరికా మార్కెట్లు లాభపడగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో రెండు రోజుల వరుస నష్టాలకు చెక్‌పెడుతూ.. లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10.30 ప్రాంతం‍లో సెన్సెక్స్‌ 247 పాయింట్లు ఎగసి 41,214ను తాకగా.. నిఫ్టీ 80 పాయింట్లు బలపడి 12,136 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఓవైపు

Most from this category