News


మిస్త్రీ కేసులో సుప్రీం కోర్టుకు టాటా సన్స్‌

Friday 3rd January 2020
news_main1578021682.png-30631

న్యూఢిల్లీ: ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తిరిగి తీసుకోవాలంటూ నేషనల్‌ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ టాటా సన్స్‌ .. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎన్‌సీఎల్‌ఏటీ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరింది.  చైర్మన్‌గా ఎన్‌ చంద్రశేఖరన్‌ నియామకం చట్టవిరుద్ధమన్న ఆదేశాలను కూడా తిరస్కరించాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు, టాటా సన్స్‌ను ప్రైవేట్ సంస్థగా మార్చడంలో తమ పాత్రను తప్పుపడుతూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించాల్సిందిగా కోరుతూ ఎన్‌సీఎల్‌ఏటీలో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌వోసీ) గురువారం పిటీషన్ దాఖలు చేసింది. జస్టిస్ ఎస్‌జే ముఖోపాధ్యాయ సారథ్యంలోని ద్విసభ్య బెంచ్ దీనిపై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కంపెనీల చట్టం ప్రకారం ప్రైవేట్, పబ్లిక్ కంపెనీల నిర్వచనాలు, పెయిడప్ క్యాపిటల్ అవసరాలు మొదలైన వివరాలను సమర్పించాల్సిందిగా సూచించింది. 2016లో అర్ధాంతరంగా టాటా సన్స్ చైర్మన్ హోదా నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీని పునర్‌నియమించాలంటూ 2019 డిసెంబర్ 18న ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధమన్న ఎన్‌సీఎల్‌ఏటీ .. టాటా సన్స్‌ను పబ్లిక్ నుంచి ప్రైవేట్ కంపెనీగా మార్చడంలో ఆర్‌వోసీ పాత్రపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వీటిపైనే ఇటు టాటా సన్స్‌.. సుప్రీం కోర్టును, అటు ఆర్‌వోసీ .. ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించాయి. 



You may be interested

వ్యవస్థలోకి ఆర్‌బీఐ మరిన్ని నిధులు!

Friday 3rd January 2020

ద్రవ్య లభ్యత పెంపునకు చర్యలు 6న ఆర్‌బీఐ ప్రత్యేక ఓఎంఓ చర్యలు ముంబై: తగిన ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ పెంపునకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తసుకుంది. ఓపెన్‌మార్కెట్‌ ఆపరేషన్స్‌ (ఓఎంఓ) ద్వారా జనవరి 6న ప్రభుత్వ బాండ్ల కొనుగోలు, అమ్మకం చర్యలను చేపట్టనుంది. రూ.10,000 కోట్ల చొప్పున బాండ్ల కొనుగోలు, అమ్మకానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌బీఐ ప్రకటన ఒకటి తెలిపింది.

అమెరికా దాడులు...ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌

Friday 3rd January 2020

 ఇరాక్‌ విమానాశ్రయంపై అమెరికా మిలటరీ దాడులు నిర్వహించి, ఇరాన్‌, ఇరాక్‌ సైనికాధికారులను కాల్చివేయడంతో హఠాత్తుగా ఆసియా స్టాక్‌ సూచీలు పడిపోయిన నేపథ్యంలో నేడు(శుక్రవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దాదాపు 40పాయింట్ల నష్టంతో 12,300 పాయింట్ల  వద్ద కదులుతోంది. క్రితం రోజు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,339 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ను

Most from this category