టాటా మోటార్స్ నష్టాలు రూ.188 కోట్లు
By Sakshi

న్యూఢిల్లీ: దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.188 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. దేశీయ మార్కెట్లో నెలకొన్న మందగమనం ఈ కంపెనీపై బాగానే ప్రభావం చూపించినప్పటికీ, గత క్యూ2లో వచ్చిన నష్టాలు(రూ.1,009 కోట్లు)తో పోల్చితే నష్టాలు బాగానే తగ్గాయి. గత క్యూ2లో రూ.71,981 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.65,432 కోట్లకు తగ్గిందని టాటా మోటార్స్ తెలిపింది. అయితే స్డాండ్‌అలోన్ పరంగా చూస్తే, గత క్యూ2లో రూ.109 కోట్ల నికర లాభం రాగా ఈ క్యూ2లో మాత్రం రూ.1,282 కోట్ల నికర నష్టాలు వచ్చాయని టాటా మోటార్స్ సీఈఓ గుంటర్ బశ్చెక్ చెప్పారు. దేశీయంగా హోల్‌సేల్స్ వాహన విక్రయాలు 44 శాతం తగ్గి 1,06,349కు తగ్గాయని తెలిపారు. సుదీర్ఘ మందగమనం కారణంగా వాహన విక్రయాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటం, కొత్త యాక్సిల్ లోడ్ నిబంధనలు, నిధుల కొరత, వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగా ఉండటం... ఇవన్నీ ప్రభావం చూపుతున్నాయని వివరించారు. ఫలించిన ‘ప్రాజెక్ట్ ఛార్జ్’...
లగ్జరీ కార్ల విభాగం, జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) హోల్‌సేల్స్ అమ్మకాలు 3 శాతం పెరిగి 1,34,489 కు పెరిగాయని జేఎల్ఆర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాల్ఫ్ స్మెత్ చెప్పారు. ఈ క్యూ2లో జేఎల్ఆర్ మళ్లీ లాభాల బాట పట్టిందని, ఆదాయ వృద్ధి సాధించామని తమ వ్యాపారం పటిష్టమైన పునాదులకు నిదర్శనమని వివరించారు. ‘ప్రాజెక్ట్ ఛార్జ్’ ప్రోగ్రామ్ కారణంగా 16 కోట్ల పౌండ్ల వ్యయాలు, 28 కోట్ల పౌండ్ల పెట్టుబడులు ఆదా అయ్యాయని వివరించారు. మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తెస్తామని చెప్పారు.
రూ.10,000 కోట్ల సమీకరణ:-
రూ.10,000 కోట్ల నిధుల సమీకరణకు డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని టాటా మోటార్స్ వెల్లడించింది. మాతృ కంపెనీ టాటా సన్స్‌కు ఒక్కో షేర్‌ను రూ.150 ధరకు ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన షేర్లు, వారంట్ల జారీ ద్వారా రూ.6,494 కోట్లు సమీకరిస్తామని, అలాగే విదేశీ వాణిజ్య రుణాల ద్వారా రూ.3,024 కోట్లు చొప్పున ఈ నిధులను సమీకరిస్తామని తెలిపింది. టాటా సన్స్ ద్వారా సమీకరించిన నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగిస్తామని టాటా మోటార్స్ గ్రూప్ సీఎఫ్ఓ పి. బి. బాలాజీ తెలిపారు. టాటా మోటార్స్ గ్రూప్ రుణభారం రూ.50,000 కోట్ల మేర ఉండగా, దీంట్లో ఒక్క టాటా మోటార్స్ వాటాయే రూ.20,000 కోట్లుగా ఉంటుంది.
You may be interested
అత్యంత సంపన్నుడి స్థానాన్ని కోల్పోయిన జెఫ్ బెజోస్
Saturday 26th October 2019అమెజాన్ ఫౌండర్, సీఈఓ జెఫ్ బెజోస్ సంపాదనలో వెనకపడ్డారు. చిన్న వయస్సులోనే ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా పేరు గడించిన బెజోస్.. ప్రస్తుతం రెండవ స్థానానికి పడిపోయారు. గురువారం అమెజాన్ కంపెనీ షేరు 7 శాతం పడిపోయిన నేపథ్యంలో తొలి స్థానాన్ని కోల్పోయారు. ఈయన సంపద 103.9 బిలియన్ అమెరికా డాలర్లకు పడిపోయింది. ఇక తొలి స్థానంలోకి బిల్‌గేట్స్ మళ్లీ మొదటి స్థానానికి చేరుకున్నారు. గేట్స్ సంపద 105.7 బిలియన్ డాలర్లకు
కేంద్రం వద్దకు వొడాఫోన్-ఐడియా
Saturday 26th October 2019న్యూఢిల్లీ: లైసెన్సు ఫీజుల బకాయిలకు సంబంధించి సుప్రీం కోర్టు ప్రతికూల తీర్పునిచ్చిన నేపథ్యంలో కేంద్రాన్ని ఆశ్రయించాలని టెలికం సంస్థ వొడాఫోన్-ఐడియా నిర్ణయించుకుంది. వడ్డీలు, పెనాల్టీలు మొదలైనవి తొలగించడం సహా ఊరట చర్యలు తీసుకోవాలని టెలికం శాఖను (డాట్) కోరాలని భావిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. డాట్ నిర్దేశించిన ఫార్ములా ప్రకారమే టెల్కోలు లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం ఫీజులు కట్టాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం వొడాఫోన్ ఐడియా