News


‘నానో’కు.. టాటా గుడ్‌బై

Tuesday 7th January 2020
Markets_main1578367717.png-30715

  • 2019లో ఒక్కటీ ఉత్పత్తి చేయలేదన్న కంపెనీ

న్యూఢిల్లీ: లక్ష రూపాయలకే అంటూ మార్కెట్లోకి వచ్చిన రతన్‌ టాటా కలల కారు... ప్రజల కారు.. ‘నానో’ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. గతేడాది ఒక్క నానో కూడా ఉత్పత్తి చేయలేదని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ‘2019లో జీరో ప్రొడక్షన్‌’ అంటూ.. నానో ఉత్పత్తిపై ఎక్సే‍్ఛంజీలకు కంపెనీ సోమవారం సమాచారమిచ్చింది. కాకపోతే అంతకు ముందటేడాది ఉత్పత్తి చేసిన ఒక కారును 2019 ఫిబ్రవరిలో విక్రయించామని మాత్రం వెల్లడించింది. అయితే, భవిష్యత్తులో కంపెనీ మళ్లీ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశాలున్నాయంటూ ప్రజల్లో ఉన్న ఆసక్తిని సంస్థ యాజమాన్యం కొనసాగిస్తూనే ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా బీఎస్‌-6 ఉద్గార నిబంధనలు అమలుకానున్న నేపథ్యంలో చౌక కారు ఉత్పత్తి దాదాపుగా ఆసాధ్యమేనని ఆటో పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 



You may be interested

ఎకానమీ ప్రగతికి ఏం చేద్దాం..?

Tuesday 7th January 2020

కార్పొరేట్ దిగ్గజాలతో ప్రధాని మోదీ భేటీ ఉపాధి కల్పన తదితర అంశాలపై చర్చ న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో వ్యాపార దిగ్గజాలతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సమావేశమయ్యారు. ఎకానమీ ఎదుర్కొంటున్న సవాళ్లు, వృద్ధి.. ఉపాధి కల్పనకు ఊతమివ్వడానికి తీసుకోతగిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా, భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్‌, అదానీ గ్రూప్

అమెజాన్ ఇండియాతో ఫ్యూచర్‌ గ్రూప్ ఒప్పందాలు

Tuesday 7th January 2020

ఆన్‌లైన్‌లో భారీగా కార్యకలాపాల విస్తరణ     న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాతో ఫ్యూచర్ గ్రూప్ సంస్థలు దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అమెజాన్ షాపింగ్‌ పోర్టల్ ద్వారా తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ఫ్యూచర్ గ్రూప్ సంస్థలకు ఇవి ఉపయోగపడనున్నాయి. ఈ ఒప్పందాల ప్రకారం ఫ్యూచర్ రిటైల్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) స్టోర్స్‌కు అమెజాన్ అధీకృత ఆన్‌లైన్ సేల్స్ చానల్‌గా ఉండనుంది. ఆన్‌లైన్‌లో వచ్చే ఆర్డర్ల.. ప్యాకింగ్, పికప్‌ కోసం ఎఫ్‌ఆర్‌ఎల్ తమ రిటైల్

Most from this category