News


‘బేర్‌’మన్న టాటామోటర్స్‌

Tuesday 21st May 2019
news_main1558432163.png-25865

మంగళవారం ఇంట్రాడేలో టాటామోటర్స్‌ షేరు దాదాపు 8 శాతం నష్టపోయింది. కంపెనీ మార్చి త్రైమాసిక ఫలితాలు మిశ్రమంగా ఉండడంతో షేరు కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. కంపెనీ నికరలాభం మార్చి త్రైమాసికంలో 49 శాతం క్షీణించి రూ. 1108 కోట్లకు చేరింది. జేఎల్‌ఆర్‌ మార్జిన్‌ గైడెన్స్‌లో కోత విధించింది. ముడిపదార్ధాల ధరల పెరుగుదల, చైనాలో జేఎల్‌ఆర్‌ ఇన్వెంటరీ ఇంకా తగ్గకపోవడం క్యు4 ఫలితాలపై ప్రభావం చూపాయి.

ఈ నేపథ్యంలో కంపెనీ షేరుపై సీఎల్‌ఎస్‌ఏ ‘అమ్మొచ్చు’ రేటింగ్‌ కొనసాగిస్తున్నట్లు తెలిపింది. టార్గెట్‌ ధర రూ. 150గా పేర్కొంది. టాటామోటర్స్‌కు కీలకమైన జేఎల్‌పీ అవుట్‌లుక్‌ బలహీనంగా ఉందని, దేశీయ వ్యాపార మార్జిన్లు కూడా క్షీణించాయని తెలిపింది. దేశీయ ట్రక్‌పరిశ్రమ డౌన్‌ట్రెండ్‌లోకి ప్రవేశిస్తోందని అందువల్ల కంపెనీ ఈపీఎస్‌ అంచనాలను 18-22 శాతం తగ్గిస్తున్నామని ప్రకటించింది.

మరో బ్రోకింగ్‌ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ మాత్రం టాటామోటర్స్‌ షేరుకు ఈక్వల్‌ వెయిట్‌ రేటింగ్‌ను రూ. 184 టార్గెట్‌ను ఇచ్చింది. జేఎల్‌ఆర్‌ రికవరీ అనుకున్నదానికన్నా నెమ్మదిగా ఉందని, కొత్త ఆర్థిక సంవత్సరం జేఎల్‌ఆర్‌ ఎబిటా మార్జిన్లు 3-4 శాతం మధ్యలో ఉంటాయని మోర్గాన్‌స్టాన్లీ అభిప్రాయపడింది.

టాటామోటర్స్‌కు ‘కొనొచ్చు’రేటింగ్‌ను రూ. 220 టార్గెట్‌ ధరను ఇచ్చినట్లు సిటి గ్రూప్‌ తెలిపింది. కంపెనీ స్వల్పకాలిక అవుట్‌లుక్‌ స్తబ్దుగా ఉండొచ్చని అంచనా వేసింది. టార్గెట్‌ ధరను రూ.230 నుంచి 220 తగ్గించామని పేర్కొంది. 



You may be interested

2014 స్థాయి లాభాలు రిపీట్‌ కావు

Tuesday 21st May 2019

ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా ఎగ్జిట్‌ పోల్స్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వం మరలా వస్తుందన్న అంచనాలు మార్కెట్లో జోష్‌ నింపాయి. దీంతో సోమవారం సూచీలు దాదాపు 4 శాతం లాభపడ్డాయి. కానీ ఒక్కరోజుకే ఈ ఉత్సాహం ఆవిరైంది. మంగళవారం సూచీలు దాదాపు ఒక్క శాతం నష్టపోయాయి. చాలా మంది ఇన్వెస్టర్లు అప్రమత్తతతో ప్రాఫిట్‌బుకింగ్‌కు దిగారు. ఈ నేపథ్యంలో గురువారం నిజ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌లో చెప్పినట్లు ఎన్‌డీఏ ప్రభుత్వం

బ్యాంక్‌ నిఫ్టీ 1.50శాతం డౌన్‌

Tuesday 21st May 2019

క్రితం ట్రేడింగ్‌లో జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన బ్యాంక్‌ నిఫ్టీ మంగళవారం నష్టాల బాట పట్టింది. ప్రైవేట్‌ రంగ షేర్లలో అ‍మ్మకాలు ఎక్కువగా జరగడంతో ఈ సూచీ నేటి ట్రేడింగ్‌లో 1.50శాతం నష్టపోయింది. మార్కెట్‌ భారీ ర్యాలీలో భాగంగా నిన్నటి ట్రేడింగ్‌లో 1330 పాయింట్లు(4.50శాతం) పెరిగి 30779.90 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. నేడు 30,862.10ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  ఇంట్రాడేలో ఇండస్‌ ఇండ్‌

Most from this category