STOCKS

News


టాటా మోటార్స్‌ లాభం రూ.1,756 కోట్లు

Friday 31st January 2020
news_main1580440134.png-31347

  • రూ.71,677 కోట్లకు తగ్గిన ఆదాయం 
  • కొనసాగుతున్న జేఎల్‌ఆర్‌ టర్న్‌అరౌండ్‌ 

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక కాలంలో రూ.1,756 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.26,961 కోట్ల నికర నష్టాలు వచ్చాయని టాటా మోటార్స్‌ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ.76,916 కోట్ల నుంచి రూ.71,677 కోట్లకు తగ్గిందని పేర్కొంది. లగ్జరీ కార్ల విభాగం, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ టర్న్‌ అరౌండ్‌ కొనసాగుతోందని, దేశీయ మార్కెట్లో మందగమన పరిస్థితులు ప్రభావం చూపాయని వివరించింది. సమీప భవిష్యత్తులో వాహన రంగం వృద్ధి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, వివిధ మోడళ్లలో బీఎస్‌-సిక్స్‌  వేరియంట్లను అందుబాటులోకి తెస్తున్నామని, అమ్మకాలు పుంజుకోగలవని ఆశిస్తున్నామని పేర్కొంది. మరిన్ని వివరాలు..., 

రూ.7,394 కోట్ల నిర్వహణ లాభం...
ఈ క్యూ3లో రూ.7,394 కోట్ల నిర్వహణ లాభం సాధించింది. నిర్వహణ లాభ మార్జిన్‌ 3.5 శాతం మెరుగుపడి 10.8 శాతానికి పెరిగింది. స్టాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, గత క్యూ3లో రూ.618 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ3లో రూ.1,040 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. మొత్తం ఆదాయం రూ.16,208 కోట్ల నుంచి రూ.10,843 కోట్లకు తగ్గింది. స్టాండ్‌అలోన్‌ టోకు విక్రయాలు ఎగుమతులతో సహా 25 శాతం తగ్గి 1,29,185కు చేరాయి. 

జేఎల్‌ఆర్‌ జోరు....
లగ్జరీ కార్ల విభాగం, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ ఆదాయం 3 శాతం పెరిగి 640 కోట్ల పౌండ్లకు పెరిగింది. రిటైల్‌ విక్రయాలు 2 శాతం తగ్గాయి. వరుసగా రెండో క్వార్టర్‌లోనూ జేఎల్‌ఆర్‌ పనితీరు మెరుగుపడింది.చైనా మార్కెట్లో జేఎల్‌ఆర్‌ అమ్మకాలు పుంజుకున్నాయి. దేశీయ వ్యాపారంపై మందగమనం తీవ్రంగానే ప్రభావం చూపించింది. కొన్ని సెగ్మెంట్లలో కంపెనీ మార్కెట్‌ వాటా పెరిగినప్పటికీ, మధ్య, భారీ తరహా వాణిజ్య వాహన విక్రయాలు తగ్గాయి. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, భారత వ్యాపారం మెరుగుపడింది. 



You may be interested

మూడు రెట్లు ఎగసిన ఐఓసీ లాభం

Friday 31st January 2020

2,339  కోట్లకు నికర లాభం  కలసివచ్చిన ఇన్వెంటరీ లాభాలు  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఇండియన్‌ ఆయిల్ కార్పొ(ఐఓసీ) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో మూడు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.717 కోట్లుగా ఉన్న నికర లాభం (స్టాండ్‌అలోన్‌) ఈ క్యూ3లో రూ.2,339 కోట్లకు పెరిగిందని ఐఓసీ తెలిపింది. రిఫైనరీ మార్జిన్‌లు తక్కువగా ఉన్నా, కరెన్సీ పరమైన నష్టాలు ఉన్నా, ఇన్వెంటరీ

నష్టాల మార్కెట్లో క్యూ కట్టిన ఫార్మా కంపెనీలు

Thursday 30th January 2020

గురువారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. అధికంగా ఫార్మా ఇండెక్స్‌ 2.15 శాతం తగ్గి 8,231.60 వద్ద ముగిసింది. ఈ ఇండెక్స్‌లో భాగమైన దివీస్‌ల్యాబ్‌ 0.3 శాతం పెరిగి 1,967.90 వద్ద, డాక్టర్‌ రెడ్డీస్‌ 0.18 శాతం పెరిగి 3,154.00 వద్ద, బయోకాన్‌ 0.99 శాతం తగ్గి 294.50 వద్ద, సన్‌ఫార్మా 1.81 శాత తగ్గి 441.95 వద్ద,  కెడిలా హెల్త్‌కేర్‌ 2.19 శాతం తగ్గి 267.50 వద్ద, లుపిన్‌

Most from this category