News


మార్కెట్లోకి టాటా నెక్సాన్‌ ఈవీ

Tuesday 28th January 2020
news_main1580208855.png-31277

మార్కెట్లోకి టాటా నెక్సాన్‌ ఈవీ
ప్రారంభ ధర రూ.13.99 లక్షలు

ముంబై: పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు కరెంటుతో నడిచే వాహనాలు అందుబాటులోకి తెచ్చేందుకు అనేక కంపెనీలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్‌ ఎలక్ట్రిక్‌  కార్‌ ‘నెక్సాన్‌ ఈవీ’ని మంగళవారం మార్కెట్‌లో విడుదల చేసింది. జిపట్రాన్‌ టెక్నాలజీ కలిగిన ఈ కారు ఒక్కసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే 312 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంతేగాక ఇందులో 35 కనెక్టెడ్‌ ఫీచర్లు ఉన్నాయి. విడుదల  సందర్భంగా టాటా సన్స్‌ గ్రూపు చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ మాట్లాడుతూ.. 9 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే నెక్సాన్‌ ఈవీ ప్రారంభ ధరను రూ.13.99 లక్షలుగా నిర్ణయించినట్లు తెలిపారు. 22 నగరాల్లో 60 ఆథరైజ్డ్‌ డీలర్స్‌ వద్ద నెక్సాన్‌ ఈవీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. భవిష్యత్‌లో మరో నాలుగు ఎలక్ట్రికల్‌ వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు టాటా మోటార్‌ ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. వచ్చే రెండేళ్లలో  రెండు ఎస్‌యూవీలు, ఒక హ్యాచ్‌ బ్యాక్‌ మోడల్‌, ఒక సెడాన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు ఆయన వివరించారు.
 



You may be interested

ఎనానమీపై ‘కరోనా’ ఎటాక్‌!

Wednesday 29th January 2020

ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా వైరస్‌ ఆర్థిక వ్యవస్థలకు మరింత ముప్పు వృద్ధి భయాలతో కుప్పకూలుతున్న స్టాక్‌ మార్కెట్లు సురక్షిత పెట్టుబడి సాధనాలవైపు ఇన్వెస్టర్ల చూపు ఎగబాకుతున్న పుత్తడి... చల్లారుతున్న చమురు తక్షణం వ్యాక్సిన్‌ కనుగొనకపోతే తంటాలేనంటున్న ఆర్థికవేత్తలు మన ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం (సాక్షి, బిజినెస్‌ విభాగం): అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచమంతటికీ తుమ్ములొస్తాయన్నది నానుడి!! అయితే, ఇప్పుడు చైనాకు వచ్చిన ‘కరోనా’ జలుబుకు ప్రపంచదేశాలన్నీ గజగజ వణుకుతున్నాయి. చైనా ‘వూహాన్‌’ నగరంలో మొదలైన కరోనా వైరస్‌ ముసలం..

మార్కెట్లోకి బజాజ్‌ బీఎస్‌-6 వాహనాలు

Tuesday 28th January 2020

100, 110 సీసీల్లో సీటీ, ప్లాటినా మోడళ్లు న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ బజాజ్‌ మంగళవారం జీఎస్‌-6 వాహనాలను మార్కెట్‌లోకి విడుదల చేసింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర సూచించిన బీఎస్‌-6 నిబంధనలకు అనుగుణంగా బజాజ్‌ సీటీ, ప్లాటినా మోడల్‌ బైక్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఎలక్ట్రిక్‌ ఇంజెక్షన్‌(ఈఐ) వ్యవస్థను ఆమర్చిన ఈ బైక్‌ల  ప్రారంభ ధరను రూ.40,794గా నిర్ణయించారు. ఈఐ వ్యవస్థ వల్ల ఇంజిన్‌ స్మూత్‌గా నడవడమేగాక , మైలేజీని బాగా

Most from this category