News


టాటా మోటార్స్‌ కార్ల ధరలు పెంపు..!

Thursday 5th December 2019
news_main1575516596.png-30059

  • జనవరి 1 నుంచి అమలు

జైసల్మేర్‌/రాజస్తాన్: దేశీయ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్‌ తన ప్యాసింజర్‌ వాహన ధరలను పెంచనున్నట్లు బుధవారం ప్రకటించింది. వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని తెలియజేసింది. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా వాహనాలను విడుదల చేయాల్సి వస్తుండడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుందని, సాధారణంగా మోడల్‌ ప్రాతిపదికన రూ.10,000-15,000 వరకు పెంపు ఉండనుండగా.. ఈసారి ఎంత మేర పెంచాలన్న అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదని సంస్థ ప్రెసిడెంట్‌​(ప్యాసింజర్‌ వాహన విభాగం) మయాంక్‌ పరీక్‌ అన్నారు. హ్యాచ్‌బ్యాక్‌ కారు టియాగో నుంచి స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్‌ (ఎస్‌యూవీ) హ్యారియర్‌ వరకు పలు మోడళ్లను ఈ సంస్థ భారత మార్కెట్లో విక్రయిస్తోంది. వీటి ధర రూ.4.39 లక్షలు నుంచి రూ.16.85 లక్షల వరకు ఉంది. 



You may be interested

కార్వీ కేసులో బ్యాంకులకు చుక్కెదురు

Thursday 5th December 2019

తనఖా షేర్లపై సెబీనే ఆశ్రయించాలని శాట్ సూచన న్యూఢిల్లీ: క్లయింట్ల షేర్లు సొంతానికి వాడుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్‌) వ్యవహారంలో సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్‌లో (శాట్‌) బ్యాంకులకు చుక్కెదురైంది. తనఖా పెట్టిన షేర్లను క్లయింట్ల ఖాతాల్లోకి మళ్లించకుండా తక్షణం ఆదేశాలివ్వాలన్న బ్యాంకుల అభ్యర్థనను శాట్ తోసిపుచ్చింది. దీనిపై డిసెంబర్ 6లోగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీనే ఆశ్రయించాలని ఆదేశించింది. అలాగే ఆయా బ్యాంకుల వాదనలు విని, డిసెంబర్

గత ఐదేళ్లలో లాభాలు తినిపించిన ఫండ్స్‌

Thursday 5th December 2019

అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల (మ్యూచువల్‌ ఫండ్స్‌/ఏఎంసీలు) నిర్వహణలో ప్రస్తుతం మొత్తం రూ.25.60 లక్షల కోట్ల ఆస్తులున్నాయి. ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులు ఇచ్చేందుకు ప్రతీ ఏఎంసీ ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. కానీ, అందరూ రాణించలేరు. కొన్ని ఫండ్స్‌ మాత్రమే మార్కెట్‌కు ఎదురీది లాభాలు తినిపిస్తాయి. చార్ట్‌ల్లో కానీ, ఆయా విభాగాల్లో కానీ టాప్‌ పథకాలుగా నిలస్తుంటాయి. కనుక మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్‌ చేసే ఈక్విటీ

Most from this category