News


టాప్ బ్రాండ్‌గా టాటా..

Wednesday 17th July 2019
news_main1563342915.png-27118

- తర్వాత స్థానాల్లో ఎల్‌ఐసీ, ఇన్ఫీ
- బ్రాండ్‌ ఫైనాన్స్ నివేదిక

ముంబై: దేశీయంగా టాప్ బ్రాండ్స్‌ జాబితాలో టాటా గ్రూప్ వరుసగా రెండో ఏడాది అగ్రస్థానం దక్కించుకుంది. బ్రిటన్‌కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్‌ ఫైనాన్స్ విడుదల చేసిన టాప్‌ 100 సంస్థల లిస్టులో ప్రభుత్వ రంగ ఎల్‌ఐసీ, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిల్చాయి. "భారత్‌లో టాటా గ్రూప్‌ అత్యంత విలువైన బ్రాండ్ కావడంతో పాటు మిగతా టాప్‌ 25 బ్రాండ్స్‌తో పోలిస్తే అత్యధిక వృద్ధి (37 శాతం) కూడా సాధించింది. ఆటోమొబైల్‌, ఐటీ సర్వీసులు, ఉక్కు, కెమికల్స్ తదితర రంగాల్లో విస్తరించిన టాటా గ్రూప్ మరింత పటిష్టంగా ఎదుగుతోంది" అని బ్రాండ్‌ ఫైనాన్స్ తెలిపింది. 2018లో 14.23 బిలియన్ డాలర్లుగా ఉన్న టాటా గ్రూప్ బ్రాండ్ విలువ ఈ ఏడాది 19.6 బిలియన్ ఽడాలర్ల స్థాయికి చేరిందని లెక్కగట్టింది. ఎస్‌బీఐ నాలుగో స్థానంలో నిలవగా.. మహీంద్రా గ్రూప్ (5), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (6), ఎయిర్‌టెల్‌ (7), హెచ్‌సీఎల్‌ (8), రిలయన్స్ (9), విప్రో 10వ స్థానంలో నిల్చాయి. అనిల్ ధీరుభాయ్‌ అంబానీ గ్రూప్‌ బ్రాండ్ విలువ ఏకంగా 65 శాతం పతనం కావడంతో.. 28వ స్థానం నుంచి 56వ స్థానానికి పడిపోయింది. 



You may be interested

ఎయిరిండియా విక్రయానికి రోడ్‌షోలు

Wednesday 17th July 2019

వచ్చే నెలాఖరులోగా నిర్వహణ న్యూఢిల్లీ: నష్టాలు, రుణభారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ ఎయిరిండియాలో వాటాల విక్రయానికి సంబంధించి ఇన్వెస్టర్లను ఆకర్షించే దిశగా వచ్చే నెలాఖరులోగా రోడ్‌షోలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. రోడ్‌షోల సందర్భంగా ఆసక్తిగల కొనుగోలుదారులతో అధికారులు సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియలో భాగంగా కొన్ని అంశాలు మినహా ఎయిరిండియా ఖాతాలను బిడ్డర్లు పరిశీలించుకోవచ్చని, షేర్ల కొనుగోలు ఒప్పందాన్ని కూడా చూసుకోవచ్చని వివరించాయి. ఆసక్తి వ్యక్తీకరణ

డీసీబీ బ్యాంక్‌ ఆదాయం రూ.392 కోట్లు

Wednesday 17th July 2019

10 శాతం వృద్ధి న్యూఢిల్లీ: డీసీబీ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో 17 శాతం ఎగసింది. గత క్యూ1లో రూ.70 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.81 కోట్లకు పెరిగిందని డీసీబీ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం  ఆదాయం రూ.356 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.392 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ మురళి ఎమ్‌ నటరాజన్‌ తెలిపారు.  నికర వడ్డీ

Most from this category