News


మిస్త్రీ కేసులో టాటాలకు మరో ఊరట

Saturday 25th January 2020
news_main1579921670.png-31182

  • ఆర్‌వోసీ పిటిషన్‌పై ఎన్‌ఎస్‌ఎల్‌ఏటీ ఉత్తర్వుకు సుప్రీం స్టే

న్యూఢిల్లీ: టాటా-మిస్త్రీ కేసులో టాటా సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టీఎస్‌పీఎస్)కు సుప్రీంకోర్టులో మరో ఊరట లభించింది. వివరాల్లోకి వెళితే... టీఎస్‌పీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా మిస్త్రీని తిరిగి నియమించాలంటూ అప్పీలెట్‌ ట్రిబ్యునల్‌ ఎన్‌సీఎల్‌ఏటీ  డిసెంబర్‌ 18న ఉత్తర్వులిచ్చింది. టాటా సన్స్‌ను పబ్లిక్‌ కంపెనీ నుంచి ప్రైవేటు కంపెనీగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌వోసీ-ముంబై)  మార్చడం ‘‘అక్రమం’’ అని తన రూలింగ్‌లో పేర్కొంది.  ‘‘ఆర్‌ఓసీ సహాయంతో’’ అనే పదాన్నీ ఇక్కడ వినియోగించింది. అయితే రూలింగ్‌లో ఈ పదాలను తొలగించాలని కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ నేతృత్వంలో బాధ్యతలు నిర్వహించే ఆర్‌వోసీ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌లో ఒక సవరణ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిని అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ జనవరి 6న తిరస్కరించింది. దీనిపై ఆర్‌వోసీ సుప్రీంను ఆశ్రయించింది. టాటా సన్స్‌ను పబ్లిక్ కంపెనీ నుంచి ప్రైవేట్ కంపెనీగా మార్చడంలో తాము చట్టవిరుద్ధంగా వ్యవహరించామంటూ ఎన్‌సీఎల్‌ఏటీ వ్యాఖ్యానించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కంపెనీల చట్టంలోని నిబంధనలకు అనుగుణంగానే తాము వ్యవహరించామని పేర్కొంది. ఇందుకు సంబంధించి అంశంపై  సుప్రీంకోర్టు తాజాగా స్టే మంజూరుచేసింది. మిస్త్రీ పునర్‌నియామకానికి సంబంధించి డిసెంబర్‌ 18 ట్రిబ్యునల్‌ ప్రధాన ఉత్తర్వుపై ఇప్పటికే సుప్రీం స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. సంబంధిత ప్రధాన అంశంతోపాటు ఆర్‌ఓసీ పిటిషన్‌నూ విచారించడం జరుగుతుందని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. 



You may be interested

పన్ను వివాదాలకు వేగవంతమైన పరిష్కారం చూపాలి

Saturday 25th January 2020

అది పన్ను చెల్లింపుదారులకు ప్రోత్సాహకరం వివాదంలో ఉన్న నిధులకు విముక్తి కలుగుతుంది భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే న్యూఢిల్లీ: పన్ను వివాదాలకు వేగంగా పరిష్కారం చూపించాలని, అలా చేస్తే అది పన్ను చెల్లింపుదారులకు ప్రోత్సాహకంగా మారుతుందని, వివాదంలో ఉన్న నిధులకు విముక్తి కలుగుతుందన్నారు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే. దేశ వనరుల సమీకరణలో పన్నుల న్యాయ వ్యవస్థ పాత్ర కీలకమైనదని పేర్కొంటూ, పెండింగ్‌ కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయపన్ను అప్పిలేట్‌

బీమాకు మరింత ధీమానివ్వాలి

Saturday 25th January 2020

టర్మ్, హెల్త్‌ పాలసీలపై ప్రత్యేక పన్ను  మినహాయింపునివ్వాలి ప్రాపర్టీ పాలసీలకు ప్రయోజనాలు కల్పించాలి జీఎస్‌టీని 12 శాతానికి తగ్గించాలి ఇన్సూరెన్స్‌ సంస్థల వినతులు... దేశ జనాభా సుమారు 133 కోట్ల స్థాయిలో ఉన్నా దేశీయంగా బీమా పాలసీలు ఇంకా అంతగా ప్రాచుర్యం పొందడం లేదు. స్థూల దేశీయోత్పత్తిలో బీమా రంగం వాటా 5 శాతం లోపే ఉంటోంది. ఈ నేపథ్యంలో బీమా విస్తృతిని మరింతగా పెంచే దిశగా బడ్జెట్‌లో పన్నుపరమైన ప్రోత్సాహకాలు మరిన్ని ఇవ్వాలని ఇన్సూరెన్స్‌ సంస్థలు

Most from this category