News


టాటా ఎలెక్సీకి అత్యధిక త్రైమాసిక ఆదాయం

Tuesday 14th January 2020
news_main1578974030.png-30908

  • 4 శాతం వృద్ధితో రూ.407 కోట్లు 
  • 14 శాతం పెరిగిన నికర లాభం 

న్యూఢిల్లీ: టాటా ఎలెక్సీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20)మూడో త్రైమాసిక కాలంలో 14 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.66 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.75  కోట్లకు పెరిగిందని టాటా ఎలెక్సీ కంపెనీ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.407 కోట్ల నుంచి 4 శాతం వృద్ధితో రూ.423 కోట్లకు పెరిగిందని టాటా ఎలెక్సీ సీఈఓ, ఎమ్‌డీ మనోజ్‌ రాఘవన్‌ వివరించారు. సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర లాభం 51 శాతం, ఆదాయం 10 శాతం చొప్పున పెరిగాయని తెలిపారు. నిర్వహణ లాభం 34 శాతం వృద్ధితో రూ.94 కోట్లకు, మార్జిన్‌ 4 శాతం ఎగసి 22.2 శాతానికి చేరాయని పేర్కొన్నారు. 

గొప్ప క్వార్టర్‌....
ఇది తమ కంపెనీకి గొప్ప క్వార్టర్‌ అని మనోజ్‌ రాఘవన్‌ పేర్కొన్నారు. కంపెనీ చరిత్రలోనే అత్యధిక ఆదాయాన్ని ఈ క్యూ3లోనే ఆర్జించామని తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, సర్వీసుల విభాగం ఆదాయం రూ.410 కోట్లు, సిస్టమ్‌ ఇంటిగ్రేషన్‌, సపోర్ట్‌ సర్వీసుల విభాగం ఆదాయం రూ.13 కోట్లు చొప్పున వచ్చాయని వివరించారు. కీలకమైన విభాగాల్లో, వివిధ మార్కెట్లలో సీక్వెన్షియల్‌గా మంచి వృద్ధిని సాధించామని సంతృప్తి వ్యక్తం చేశారు. 



You may be interested

బ్లూచిప్‌ పీఎస్‌యూల్లో ఆఫర్‌ ఫర్‌ సేల్‌ !

Tuesday 14th January 2020

కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం  న్యూఢిల్లీ: నాల్కో, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ వంటి బ్లూచిప్‌ పీఎస్‌యూల్లో ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) మార్గంలో షేర్లను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.1.05 లక్షల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ లక్ష్య సాధన కష్టతరం కానుండటంతో నాల్కో, కోల్‌ ఇండియా వంటి మంచి పనితీరు ఉన్న ప్రభుత్వ రంగ

మంగళవారం వార్తల్లోని కంపెనీలు

Tuesday 14th January 2020

నేడు(14న) దేశీ స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారం‍భమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 11 పాయింట్ల స్వల్ప లాభంతో 12,373 వద్ద ట్రేడవుతోంది. అయితే టెక్నాలజీ దిగ్గజాలు యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌సహా ఫేస్‌బుక్‌, నెట్‌ప్లిక్స్‌, అమెజాన్‌ బలపడటంతో సోమవారం యూఎస్‌ స్టాక్‌ ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. దేశీయంగానూ సెన్సెక్స్‌, నిఫ్టీ ఇంట్రాడేతోపాటు ముగింపులోనూ సరికొత్త గరిష్టాలను సాధించాయి. ఈ  నేపథ్యంలో నేడు ట్రేడర్లు కొంతమేర లాభాల స్వీకరణకు

Most from this category