News


టాటా మోటార్స్‌కు భాగస్వామి కావాలి

Saturday 29th June 2019
news_main1561782573.png-26681

  • టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ: భవిష్యత్‌ వృద్ధి కోసం టాటా మోటార్స్‌కు నూతన భాగస్వామి అవసరం ఉందని టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ వ్యాఖ్యానించారు. 2018-19 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికలో... ఆయన వాటాదారులకు పలు వ్యూహాలను తెలియజేశారు. ‘‘జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) గడిచిన ఏడాదికాలం నుంచి సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే, వ్యయాలను తగ్గించడానికి కంపెనీకి చెందిన బ్రిటిష్ శాఖ తగిన చర్యలు తీసుకుంటోంది. ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో సమర్థవంతమైన భవిష్యత్ పెట్టుబడి కోసం భాగస్వామిని చూస్తోంది. టాటా మోటార్స్‌కు రాబోయే కొన్నేళ్లు నిర్ణయాత్మకమైనవి. ప్రపంచస్థాయి పోటీని తట్టుకుని భవిష్యత్ తరం ఆటోమొబైల్‌ సంస్థగా నిలదొక్కుకోవడం కోసం తనను తాను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. భాగస్వామి కావాల్సింది దీనికే. బలమైన కార్యాచరణపై దృష్టి సారించడం ద్వారా ఇబ్బందులు లేనటువంటి సరైన పెట్టుబడి మార్గాన్ని అన్వేషిస్తున్నాం. దేశీ కార్యకలాపాల పరంగా.. 2017 జూలైలో టర్నరౌండ్ కార్యక్రమం మొదలైంది. ఇందులో భాగంగా సంస్థ వ్యాపారంలోని వివిధ అంశాలను పరిష్కరించడానికి సమగ్రమైన చర్యలను చేపట్టాం. ఈ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నా. భౌగోళిక-రాజకీయ వాణిజ్య పరిస్థితి, బ్రెగ్జిట్ అనిశ్చితి, చైనాలో మందగమనంతో పాటు దేశీయంగా బీఎస్‌-సిక్స్‌ అమలు, వినియోగదారుల వ్యయం తగ్గడం వంటి స్వల్పకాలిక సవాళ్లు ఆటోపరిశ్రమలో ఉన్నాయి’’ అని చంద్రశేఖరన్‌ వివరించారు.
ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రణాళిక బలంగా ఉండాలి...
ప్రభుత్వం, ఆటో పరిశ్రమ కలిసి ఒక బలమైన ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రణాళికను రూపొందించాలని చంద్ర చెప్పారు. పర్యావరణ అభివృద్ధి, సుస్థిర లక్ష్య సాధన, డిమాండ్‌ పెరిగేలా ఈ ప్రణాళిక ఉండాలన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి టాటా మోటార్స్‌ సిద్ధంగా ఉందని వెల్లడించారు.



You may be interested

బడ్జెట్‌ ముందు ఈ స్టాక్‌లను పరిశీలించవచ్చు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీష్‌

Saturday 29th June 2019

ఆకర్షిస్తున్నా స్మాల్‌ అండ్‌ మిడ్‌ క్యాప్‌ బ్యాంకింగ్‌ సెక్టార్‌లో విజిబులిటీ ఉంది సమీప భవిష్యత్తులో బ్యాంకింగ్‌ సెక్టార్‌లో విజిబులిటీ ఉందని, మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ల వాల్యుషన్లు ఆకర్షిస్తున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ పీసీజీ అండ్‌ క్యాపిటల్‌ మార్కెట్‌ స్ట్రాటజీ హెడ్‌ వీకే శర్మ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే... వాస్తవిక అంచనాలు.. మోదీ రెండవసారి అధికారంలోకి వచ్చాక తీసుకొస్తున్నా మొదటి బడ్జెట్‌ కావడంతో దీనిపై అందరూ దృష్ఠి

కొచర్‌ దంపతులు, దూత్‌ను ప్రశ్నించిన ఈడీ

Saturday 29th June 2019

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో అయిన చందాకొచర్‌, ఆమె భర్త దీపక్‌ కొచర్‌, వీడియోకాన్‌ గ్రూపు ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శుక్రవారం ప్రశ్నించింది. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద వారిని ప్రశ్నించి సమాధానాలను అధికారులు నమోదు చేసుకున్నారు. బ్యాంకు చీఫ్‌గా ఉన్న చందాకొచర్‌ ఉన్న సమయంలో వీడియోకాన్‌ గ్రూపునకు రుణం జారీ అనంతరం ఆమె కుటుంబానికి లబ్ది కలిగినట్టు అరోపణలు ఎదుర్కొంటున్న విషయం

Most from this category