News


తాజ్‌జీవీకే లాభం రూ.11 కోట్లు

Thursday 30th January 2020
news_main1580358603.png-31326

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో తాజ్‌ జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ 33 శాతం వృద్ధితో రూ.11.14 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.8.37 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.91.22 కోట్లు కాగా.. 2018 క్యూ3లో రూ.86.11 కోట్లుగా ఉంది.
సంజీవ్‌ రెడ్డి రాజీనామా...
ఇన్నాళ్లూ తాజ్‌జీవీకేలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ నాన్‌–ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న జీవీ సంజీవ్‌ రెడ్డి తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు.  ఇతర వ్యాపారాల్లో డైరెక్టర్‌గా ఉండటం, ఇతరత్రా కారణాలను వివరిస్తూ ఈ నెల 13న బోర్డ్‌కు రాజీనామా లేఖను సమర్పించడం తెలిసిందే.  తాజాగా బుధవారం జరిగిన బోర్డ్‌ సమావేశంలో సభ్యులంతా రాజీనామాకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు వివరాలను బీఎస్‌ఈకి అందజేశారు. ప్రస్తుతం జీవీ సంజీవ్‌ రెడ్డి జీవీకే, జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో వైస్‌ చైర్మన్‌గా, ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్, జీవీకే బయోసైన్సెస్‌లో ఎండీగా ఉన్నారు. You may be interested

రూ. 40,700 స్థాయికి పసిడి

Thursday 30th January 2020

మళ్లీ పెరిగిన బంగారం ధర గత కొద్దిరోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధర బుధవారం ఒక్కసారిగా రూ.400 తగ్గగా, గురువారం మళ్లీ రూ.700 మేర  పెరిగింది. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో క్రితం రోజుతో పోలిస్తే ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ.680 వరకూ పెరిగి 40,680.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కరోనా భయాలతో ప్రపంచ మార్కెట్లో పుత్తడి పెరగడంతో పాటు ఇక్కడ రూపాయి విలువ భారీగా 30 పైసల వరకూ పతనంకావడంతో

ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ డివిడెండ్‌ రూ.10

Thursday 30th January 2020

34 శాతం పెరిగిన లాభం  న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ కంపెనీ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో 34 శాతం ఎగసి రూ.123 కోట్లకు చేరింది. ఆదాయం 16 శాతం వృద్ధితో రూ.1,073 కోట్లకు పెరిగిందని ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ తెలిపింది. ఆర్డర్లు వరుసగా 11వ క్వార్టర్‌లోనూ పెరిగాయని పేర్కొంది. ఒక్కో షేర్‌కు రూ.10 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని, ఈ ఆర్థిక సంవత్సరంలో తామందిస్తున్న రెండో డివిడెండ్‌

Most from this category