News


సిండికేట్‌ బ్యాంక్‌ లాభం రూ.251 కోట్లు

Friday 1st November 2019
news_main1572580489.png-29276

  • మొండి బకాయిలు తగ్గాయ్‌ 
  • కేటాయింపులూ దిగివచ్చాయ్‌ 
  • రూ.6,153 కోట్లకు పెరిగిన ఆదాయం 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సిండికేట్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) సెప్టెంబర్‌ క్వార్టర్‌లో రూ.251 కోట్ల నికర లాభం సాధించింది. మొండి బకాయిలు తగ్గడంతో కేటాయింపులు కూడా తగ్గి నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని సిండికేట్‌ బ్యాంక్‌ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.1,545 కోట్లు, ఈ క్యూ1లో రూ.980 కోట్లు చొప్పున నికర నష్టాలు వచ్చాయని పేర్కొంది. గత క్యూ2లో రూ.5,889 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.6,153 కోట్లకు పెరిగిందని తెలిపింది. 

తగ్గిన మొండి బకాయిలు ...
గత క్యూలో రూ.27,131 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.25,382 కోట్లకు తగ్గాయని బ్యాంక్‌ వెల్లడించింది. అలాగే నికర మొండి బకాయిలు రూ.13,321 కోట్ల నుంచి రూ.12,481 కోట్లకు తగ్గాయని తెలిపింది. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 12.98 శాతం నుంచి 11.45 శాతానికి, నికర మొండి బకాయిలు 6.38 శాతం నుంచి 5.98 శాతానికి తగ్గాయని పేర్కొంది.  కేటాయింపులు రూ.2,217 కోట్ల నుంచి రూ.684 కోట్లకు తగ్గాయని పేర్కొంది. ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 68.64 శాతానికి చేరిందని పేర్కొంది. గత క్యూ2లో మైనస్‌ 2.03 శాతంగా ఉన్న రిటర్న్‌ ఆన్‌ అసెట్స్‌ (ఆర్‌ఓఏ) ఈ క్యూ2లో 0.33 శాతానికి పెరిగిందని తెలిపింది.  ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల విలీనాల్లో భాగంగా ఈ బ్యాంక్‌ కెనరా బ్యాంక్‌లో విలీనమవుతోంది. 



You may be interested

కాగ్నిజెంట్‌ లాభం 49.7 కోట్ల డాలర్లు

Friday 1st November 2019

4 శాతం వృద్ధి  4 శాతం వృద్దితో 425 కోట్ల డాలర్లకు ఆదాయం  న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం కాగ్నిజంట్‌ నికర లాభం ఈ ఏడాది సెప్టెంబర్‌ క్వార్టర్లో 4 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 47.4 కోట్ల డాలర్లుగా ఉన్న నికర లాభం ఈ సెప్టెంబర్‌ క్వార్టర్లో 49.7 కోట్ల డాలర్లకు పెరిగిందని కాగ్నిజెంట్‌ పేర్కొంది. మొత్తం ఆదాయం 407 కోట్ల డాలర్ల నుంచి 4 శాతం వృద్ధితో 425

సెప్టెంబరులో ఫార్మా ఎగుమతులు జూమ్‌

Friday 1st November 2019

సెప్టెంబరులో ఫార్మా ఎగుమతులు జూమ్‌ క్రితం ఏడాదితో పోలిస్తే 8.72 శాతం వృద్ధి రూ.12,600 కోట్లకు చేరిన ఎగుమతులు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- భారత ఫార్మా రంగం మంచి ఊపు మీద ఉంది. ఈ ఏడాది ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబరులో దేశం నుంచి ఎగుమతులు తిరిగి పుంజుకున్నాయి. 2018తో పోలిస్తే 2019 ఆగస్టులో ఎక్స్‌పోర్ట్స్‌ 0.19 శాతం తిరోగమన వృద్ధి నమోదు చేశాయి. సెప్టెంబరు నెలలో ఎగుమతులు గాడినపడ్డాయి. ఈ కాలంలో ఎక్స్‌పోర్ట్స్‌ 8.72

Most from this category