News


సిండికేట్‌ లాభం 4 రెట్లు అప్‌

Wednesday 12th February 2020
news_main1581477290.png-31708

  • రూ.435 కోట్లకు వృద్ధి 
  • తగ్గిన మొండి బకాయిలు 


న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సిండికేట్‌ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో నాలుగు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం(2018-19) క్యూ3లో రూ.108 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.435 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం రూ.6,078 కోట్ల నుంచి రూ.6,317 కోట్లకు పెరిగిందని సిండికేట్‌ బ్యాంక్‌ తెలిపింది. మరిన్ని వివరాలు...
పెరిగిన కేటాయింపులు...
ఈ బ్యాంక్‌ మొండి బకాయిలు తగ్గాయి. గత క్యూ3లో 12.54 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 11.33 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 6.75 శాతం నుంచి 5.94 శాతానికి తగ్గాయి. విలువ పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు రూ.26,185 కోట్ల నుంచి రూ.25,330 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.13,211 కోట్ల నుంచి రూ.12,514 కోట్లకు తగ్గాయి. మొండి బకాయిలు తగ్గినప్పటికీ, మొండి బకాయిలకు అధిక కేటాయింపులు జరిపింది. గత క్యూ3లో రూ.910 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు ఈ క్యూ3లో రూ.1,287 కోట్లకు పెరిగాయి. ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 69.28 శాతంగా ఉంది. ఈ బ్యాంక్‌ కెనరా బ్యాంక్‌లో విలీనమవుతోంది. 



You may be interested

టైటన్‌ చేతికి హగ్‌ ఇన్నోవేషన్స్‌

Wednesday 12th February 2020

కంజ్యూమర్‌ గూడ్స్‌ రంగ సంస్థ టైటన్‌ తాజాగా హైదరాబాద్‌కు చెందిన టెక్నాలజీ, వేరబుల్స్‌ కంపెనీ హగ్‌ ఇన్నోవేషన్స్‌ను కొనుగోలు చేసింది. హగ్‌ ఫౌండర్‌ రాజ్‌ నేరావటితోపాటు 23 మంది ఉద్యోగులు జనవరి 1న తమ సంస్థలో చేరారని టైటాన్‌ వాచెస్‌, వేరబుల్స్‌ విభాగం సీఈవో ఎస్‌.రవికాంత్‌ తెలిపారు. కాగా, కనెక్టెడ్‌ ఎక్స్‌ పేరుతో టైటాన్‌ ఫుల్‌ టచ్‌ స్మార్ట్‌వాచ్‌ను ప్రవేశపెట్టింది. వాచ్‌ ధర రూ.14,995. 

ఐడీబీఐ బ్యాంక్‌ నష్టాలు రూ.5,763 కోట్లు

Wednesday 12th February 2020

రూ.6,216 కోట్లకు మొత్తం ఆదాయం  రూ.25,000 కోట్లకు పెరిగిన ఆధీకృత మూలధనం  న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌ నష్టాలు మరింతగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసికంలో రూ.4,185 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) ఇదే క్వార్టర్‌లో రూ.5,763 కోట్లకు పెరిగాయి. మొత్తం ఆదాయం రూ.6,191 కోట్ల నుంచి రూ.6,216 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మరిన్ని వివరాలు... దిగ్గజ బీమా సంస్థ ఎల్‌ఐసీ ప్రమోట్‌ చేస్తున్న ఐడీబీఐ

Most from this category