News


మారుతి అంచనాలను తగ్గించిన సుజుకీ మోటర్స్‌

Wednesday 6th November 2019
news_main1573024554.png-29394

దేశీయ కార్ల తయారి సం‍స్థ మారుతి సుజుకీ విక్రయాల అంచనాలను (ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను)ఈ కంపెనీ మాతృ సంస్థయిన సుజుకీ మోటర్‌ కార్పోరేషన్‌(ఎస్‌ఎంసీ) సవరించింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రధమార్ధంలో ఆటో రంగం మందగమనంలో ఉండడంతో, పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను మారుతి సుజుకీ అమ్మకాలు 20 శాతం పడిపోతాయని అంచనావేసింది. పూర్తి ఏడాదిలో 4 శాతం వృద్ధి ఉంటుందన్న అంచనాల్ని కొద్దినెలల క్రితమే కంపెనీ ప్రకటించింది.  ఈ అంచనాల్ని తాజాగా మార్చింది.  సెప్టెంబర్‌ త్రైమాసికంతో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో, మారుతి సుజుకీ క్యుములేటివ్‌ అమ్మకాలు 25 శాతం పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా సుజుకీ మోటర్స్‌ విక్రయాలు 17 శాతం పడిపోయాయి. మారుతి అమ్మకాలు అక్టోబర్‌ నెలలో రికవరి అయినప్పటికి, ఈ ఏడాది మొత్తానికి గాను సుజుకీ మోటర్స్‌ అమ్మకాలు 13.2 శాతం తగ్గుతాయని ఈ మాతృ సంస్థ  అంచనావేసింది. మొదటి త్రైమాసిక ఫలితాల తర్వాత సుజుకీ మోటర్స్‌, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ఆదాయ అంచనాలను 10.3 శాతం, ఆపరేటింగ్‌ ఆదాయ అంచాలను 39.4 శాతం, నికర ఆదాయ అంచనాలను 30 శాతం తగ్గించింది.  ఈ ఆర్థిక సంవత్సరంలో ఆటో మొబైల్స్‌ అమ్మకాలు 28.4 లక్షలుగా ఉంటాయని మారుతి సుజుకీ మాతృసంస్థ అంచనావేసింది. ఇది గతేడాదితో పోల్చుకుంటే 14.7 శాతం తక్కువ. ఆర్థిక సంవత్సరం 2020లో మోటర్‌ సైకిల్‌ అమ్మకాలు17.7 లక్షలుగా ఉంటాయని అంచనావేసింది. ఇది ముందు అంచనాల కంటే 3 శాతం తక్కువ. ఆర్థిక సంవత్సరం 2020లో 15 లక్షల వాహనాలను విక్రయమవుతాయని తాజాగా మారుతి సుజుకీ అంచనా వేయగా, ముందు ఈ అంచనా 20 లక్షల వాహనాలుగా ఉండడం గమనార్హం. ‘బీఎస్‌ 4 నుంచి బీఎస్‌ 6 నిబంధనలకు మారుతుండడం వలన వచ్చే ఐదారు నెలలు కీలకంగా ఉన్నాయి. డిమాండ్‌ పరంగా కూడా అనిశ్చితి నెలకొనివుంది’ అని అంచనాలను విడుదల చేశాక మారుతి సుజుకీ చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ ఓ ఆంగ్ల చానెల్‌తో అన్నారు. ‘ ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో మా అమ్మకాలు 25 శాతం తగ్గాయి’ అని ఆయన తెలిపారు. 



You may be interested

52వారాల గరిష్టానికి జీఎంఆర్‌

Wednesday 6th November 2019

మౌలిక రంగంలో సేవలను అందిచే జీఎంఆర్‌ షేరు మిడ్‌సెషన్‌ కల్లా ఏడాది 52వారాల గరిష్టాన్ని అందుకుంది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.20.75 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ కంపెనీ షేరు కొనుగోళ్ల మొగ్గుచూపడంతో ఒక దశలో దాదాపు 9శాతం లాభపడి రూ.22.45 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.1:45ని.లకు షేరు క్రితం ముగింపు ధర(రూ.20.65)తో పోలిస్తే 7.50శాతం లాభంతో రూ.22.15

దేవుడు కూడా ఇన్ఫోసిస్‌ నెంబర్లను మార్చలేడు!

Wednesday 6th November 2019

-నందన్‌ నిలేకని, ఇన్ఫీ చైర్మన్‌ కంపెనీ సొంత దర్యాప్తులో విజిల్‌ బ్లోయర్స్‌ ఫిర్యాదును బలపరిచే ఆధారాలు లభించలేదని ఇన్ఫోసిస్‌ చైర్మన్‌, సహవ్యవస్థాపకుడు నందన్‌నిలేకని బుధవారం వార్షిక విశ్లేషకులు సమావేశంలో అన్నారు. అంతేకాకుండా కంపెనీ సీఈఓ, సీఎఫ్‌ఓలపై గుర్తు తెలియని ఉద్యోగుల నుంచి వచ్చిన ఆరోపణలను ఇన్ఫోసిస్‌ ఖండిస్తున్నదని అన్నారు.  కంపెనీ సహ-వ్యవస్థాపకులు కంపెనీ దీర్ఘకాల వృద్ధికి కట్టుబడి వున్నారని, కంపెనీలో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ప్రమాణాలు ఉన్నతంగా ఉన్నాయని  తెలిపారు. వ్యక్తిగత ఇమేజ్‌ను

Most from this category