STOCKS

News


నిపుణుల కమిటీ ప్రకారం నిర్ణయం

Tuesday 19th November 2019
news_main1574135328.png-29692

  • ఆర్‌బీఐ మిగులు నిధుల బదిలీ 
  • లోక్‌సభకు వెల్లడించిన ఆర్థిక మంత్రి 

న్యూఢిల్లీ: భవిష్యత్తులో ఆర్‌బీఐ మిగులు నిధుల బదిలీ.... నిపుణుల కమిటీ సూచనలను బట్టి ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. అంతే కాకుండా ఆర్‌బీఐ నికర లాభం, ఇతర ఆర్థిక స్థితిగతులపై కూడా ఆర్‌బీఐ మిగులు  నిధుల బదిలీ అధారపడి ఉంటుందని వివరించారు. 1934 నాటి అర్‌బీఐ చట్టం సెక్షన్‌ 47 ప్రకారమే మిగులు నిధుల బదిలీ విధానం ఆధారపడి ఉంటుందని లోక్‌సభకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆమె పేర్కొన్నారు. జూన్‌ 30, 2019తో ముగిసిన 2018-19 సంవత్సరానికి గాను ఆర్‌బీఐ రూ.1,75,987 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసిందని వివరించారు. You may be interested

భారత్‌లో అమెజాన్‌ అద్భుతంగా పనిచేస్తోంది

Tuesday 19th November 2019

జెఫ్ బెజోస్ వ్యాఖ్య వాషింగ్టన్: ఈ-కామర్స్ కంపెనీల నిబంధనలను కఠినతరం చేస్తూ భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల అమెజాన్‌ పనితీరులో ఇబ్బంది ఏమీ లేదని ఆ సంస్థ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ జెఫ్ బెజోస్ స్పష్టంచేశారు. భారత్‌లో సంస్థ అద్భుతంగా కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. ఇక్కడి నేషనల్ పోర్ట్రెయిట్ గ్యాలరీలో మాట్లాడిన ఆయన.. ‘భారతదేశంలో మా వ్యాపారం చాలా బాగా జరుగుతోంది’ అని చెప్పారు. 

ఐదేళ్లలో 1,400 కోట్ల డాలర్ల పెట్టుబడులు

Tuesday 19th November 2019

భారత రియల్టీలోకి విదేశీ నిధులు  అనరాక్‌ సంస్థ వెల్లడి  బెంగళూరు: భారత రియల్టీ రంగంలో నాలుగేళ్లలో 1,400 కోట్ల డాలర్ల విదేశీ ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ)పెట్టుబడులు వచ్చాయి. 2015 నుంచి 2019, సెప్టెంబర్‌ కాలంలో ఈ పెట్టుబడులు వచ్చాయని రియల్‌ ఎస్టేట్‌ సర్వీసుల కంపెనీ అనరాక్‌ వెల్లడించింది. వీటిల్లో 60 శాతానికి పైగా నిధుల(880 కోట్ల డాలర్ల)ను వాణిజ్య రియల్టీ రంగం ఆకర్షించిందని పేర్కొంది. ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం...,  రెసిడెన్షియల్‌ రంగంలో

Most from this category