News


సన్‌ ఫార్మా లాభం 26 శాతం డౌన్‌

Friday 7th February 2020
news_main1581045129.png-31582

  • పెరిగిన నికర వ్యయాల ప్రభావం
  • ఒక్కో షేర్‌కు రూ.3 మధ్యంతర డివిడెండ్‌

న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం సన్‌ ఫార్యాస్యూటికల్స్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్‌లో 26 శాతం తగ్గింది.  గత క్యూ3లో రూ.1,242 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ3లో రూ.914 కోట్లకు తగ్గిందని సన్‌ ఫార్మా తెలిపింది. వ్యయాలు రూ.6,203 కోట్ల నుంచి రూ.6,923 కోట్లకు పెరగడం వల్ల నికర లాభం తగ్గిందని సన్‌ ఫార్మా ఎమ్‌డీ దిలిప్‌ సంఘ్వి తెలిపారు. కార్యకలాపాల ఆదాయం రూ.7,657 కోట్ల నుంచి రూ.8,039 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. రూ. 1 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.3 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. 
నంబర్‌ వన్‌ కంపెనీ....! 
భారత్‌లో బ్రాండెడ్‌ వ్యాపారం బాగా ఉందని, రెండంకెల వృద్ధిని సాధించిందని సంఘ్వి తెలిపారు. ఏఐఓసీడీ అవాక్స్‌ డిసెంబర్‌, 2019 నివేదిక ప్రకారం భారత ఫార్మా మార్కెట్లో అగ్రస్థానం తమ కంపెనీదేనని, రూ1.4 లక్షల కోట్ల మార్కెట్లో 8.2 శాతం మార్కెట్‌ వాటా తమ చేతిలోనే ఉందని పేర్కొన్నారు.



You may be interested

హీరో మోటొకార్ప్‌ డివిడెండ్‌ రూ.65

Friday 7th February 2020

  హీరో మోటొకార్ప్ లాభం రూ.905 కోట్లు  17 శాతం వృద్ధి  న్యూఢిల్లీ: టూవీలర్‌ దిగ్గజం హీరో మోటొకార్ప్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో 17 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) క్యూ3లో రూ.773 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ3లో రూ.905 కోట్లకు పెరిగిందని హీరో మోటొకార్ప్‌ సీఎఫ్‌ఓ నిరంజన్‌ గుప్తా తెలిపారు. కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ.7,937 కోట్ల నుంచి రూ.7,075

ఆటోకు ఆర్థిక శాఖ తోడ్పాటు

Friday 7th February 2020

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి గ్రేటర్ నోయిడా: కొంగొత్త టెక్నాలజీలపై పరిశోధన, అభివృద్ధి కోసం ఆటోమొబైల్ పరిశ్రమకు తగు తోడ్పాటు అందించాలని ఆర్థిక శాఖను కోరినట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. విద్యుత్ వాహనాల తయారీకి, ఎగుమతులకు భారత్ గ్లోబల్ హబ్‌గా ఎదగగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆటో ఎక్స్‌పో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. "కొన్నాళ్ల

Most from this category