News


సన్‌ ఫార్మా లాభం రూ.1,064 కోట్లు

Friday 8th November 2019
news_main1573184912.png-29429

  • గత క్యూ2లో రూ.270 కోట్ల నష్టాలు
  • రూ.8,123 కోట్లకు పెరిగిన ఆదాయం 

న్యూఢిల్లీ: సన్‌ ఫార్మాస్యూటికల్స్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ1,064 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.270 కోట్ల నికర నష్టాలు వచ్చాయని సన్‌ఫార్మా తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.6,938 కోట్ల నుంచి రూ.8,123 కోట్లకు ఎగసిందని పేర్కొంది. 

స్పెషాల్టీ వ్యాపారంలో పురోగతి...
వ్యయాల ఆదా, సామర్థ్యాల మెరుగుదలపై దృష్టి సారించడం కొనసాగిస్తున్నామని సన్‌ ఫార్మా ఎమ్‌డీ దిలిప్‌ సంఘ్వి పేర్కొన్నారు. మారుతున్న పరిశ్రమ తీరు తెన్నులకు అనుగుణంగా జనరిక్‌ వ్యాపారంలో కూడా మార్పులు, చేర్పులు చేస్తున్నామని వివరించారు. గ్లోబల్‌ స్పెషాల్టీ వ్యాపారంలో కూడా మంచి పురోగతి సాధిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాలకు సంబంధించి కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం...,

35 శాతం పెరిగిన భారత అమ్మకాలు...
భారత్‌ అమ్మకాలు 35 శాతం వృద్ధితో రూ.2,515 కోట్లకు, అమెరికా విక్రయాలు పెద్దగా పురోగతి లేదన్నారు. వృద్ధి చెందుతున్న దేశాల్లో అమ్మకాలు 3 శాతం వృద్ధితో 20 కోట్ల డాలర్లకు, మిగిలిన దేశాల్లో విక్రయాలు 49 శాతం వృద్ధితో 16 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఇక యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రెడియంట్స్‌(ఏపీఐ) విభాగం విదేశీ అమ్మకాలు 10 శాతం వృద్ధితో రూ.468 కోట్లకు పెరిగాయి. 

రూ.1,616 కోట్ల నిర్వహణ లాభం...
పరిశోధన, అభివృద్ధిపై ఈ క్యూ2లో రూ.488 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ఇది అమ్మకాల్లో 6 శాతానికి సమానం. నిర్వహణ లాభం 22 శాతం వృద్ధితో రూ.1,616 కోట్లకు పెరిగింది. నిర్వహణ మార్జిన్‌ మాత్రం 21 శాతం నుంచి 20 శాతానికి తగ్గింది. ఈ క్యూ2లో 2 అండాలు(అబ్రవియేటెడ్‌ న్యూ డ్రగ్‌ అప్లికేషన్‌) దాఖలు చేసింది, ఏడింటికి ఆమోదాలు పొందింది. 



You may be interested

 నష్టాలతో ప్రారంభం

Friday 8th November 2019

 భారత్‌ స్టాక్‌ సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 103 పాయింట్ల నష్టంతో 40,550 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 12,000 పాయింట్ల దిగువన 11,978 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. 

తగ్గిన  యూకో బ్యాంక్‌ నష్టాలు

Friday 8th November 2019

-గత క్యూ2లో రూ.1,136 కోట్ల నష్టాలు  -ఈ క్యూ2లో నష్టాలు రూ.892 కోట్లు  -ఒకింత తగ్గిన మొండి బకాయిలు  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్‌ నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్‌లో కొంచెం తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.1,136 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ2లో రూ.892 కోట్లకు తగ్గాయని యూకో బ్యాంక్‌ తెలిపింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే నష్టాలు పెరిగాయి. ఈ బ్యాంక్‌కు ఈ క్యూ1లో రూ.601

Most from this category