News


సన్‌ఫార్మా లాభం రూ. 1065 కోట్లు

Thursday 7th November 2019
news_main1573122767.png-29421

హెల్త్‌కేర్‌ దిగ్గజం సన్‌ఫార్మా సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ. 1065 కోట్ల లాభం ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 270 కోట్ల నష్టం ప్రకటించింది. ఆసమయంలో కంపెనీ వన్‌టైమ్‌ నష్టం రూ. 1214 కోట్లను భరించాల్సివచ్చింది. తాజా సమీక్షా కాలంలో కంఎపనీ రెవెన్యూ 17.1 శాతం పెరిగి రూ. 8123 కోట్లను చేరింది. దేశీయ, అంతర్జాతీయ విక్రయాలు పెరగడం కంపెనీ రెవెన్యూ పెరుగుదలకు దోహదం చేసింది. క్యు2తో దేశీయ విక్రయాలు 35 శాతం పెరిగి రూ. 2515 కోట్లను తాకగా, ఇతర మార్కెట్లలో విక్రయాలు 49 శాతం పెరిగి 16.1 కోట్ల డాలర్లను చేరాయి. ఇతర మార్కెట్లలో ముఖ్యంగా వర్ధమాన మార్కెట్లలో విక్రయాలు మంచి మెరుగుదల చూపాయి, ఇదే సమయంలో యూఎస్‌ విక్రయాలు మాత్రం యథాతధంగా కొనసాగాయి. క్యు2లో కంపెనీ ఎబిటా 17 శాతం దూసుకుపోయి రూ. 1790 కోట్లను చేరింది, కానీ మార్జిన్‌ మాత్రం ఫ్లాట్‌గా 22 శాతం వద్దే నమోదయింది. సమీక్షా కాలంలో కంపెనీ ఇతర ఆదాయాలు దాదాపు 43 శాతం పడిపోయి 201 కోట్లను చేరాయి. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 8023 కోట్ల రెవెన్యూ, 1690.5 కోట్ల ఎబిటా, 21.1 శాతం మార్జిన్‌ సాధిస్తుందని అనలిస్టులు అంచనా వేశారు. గురువారం ముగింపులో షేరు దాదాపు మూడున్నర శాతం లాభపడి442.50 రూపాయల వద్ద ముగిసింది. 



You may be interested

30% పెరిగిన హెచ్‌పీసీఎల్‌ నికర లాభం

Thursday 7th November 2019

ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పోరేషన్‌(హెచ్‌పీసీఎల్‌) నికరలాభం, సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలలో త్రైమాసిక ప్రాతిపదికన 29.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. కానీ ఇది విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయింది. జూన్‌క్వార్టర్‌లో రూ. 811 కోట్లుగా నమోదైన కంపెనీ లాభం, సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ. 1,052.3 కోట్లకు పెరిగింది.  కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 14.3 శాతం పడిపోయి రూ. 60,862 కోట్లుగా నమోదైంది. స్థూల రిఫైనింగ్‌

బలహీన ఆర్థిక వ్యవస్థలో సెన్సెక్స్‌ ఎందుకు గరిష్ఠాలను తాకింది?

Thursday 7th November 2019

దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికి కూడా మందగమనం నుంచి బయటపడలేదు. ఉత్పదాక రంగానికి సంబంధించి అక్టోబర్‌ నెల పీఎంఐ(పర్చేజ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌) డేటా రెండేళ్ల కనిష్టానికి పడిపోయింది. అదేవిధంగా సర్వీస్‌ సెక్టార్‌ సెప్టెంబర్‌ నెల పీఎంఐ డేటా 19 నెలల కనిష్ఠానికి చేరుకుంది. డిమాండ్‌ పుంజుకోవడంతో గత నెలలో ఆటో స్టాకులు పుంజుకున్నప్పటకి, ఇవి వాటి వేగాన్ని కోల్పోయాయి. స్థూల ఆర్థిక అంశాలు ప్రతికూలంగా ఉన్నప్పటికి దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీ

Most from this category