News


జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ చైర్మన్‌గా సుభాష్ చంద్ర రాజీనామా

Tuesday 26th November 2019
news_main1574737998.png-29846

- బోర్డు పునర్‌వ్యవస్థీకరణ
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ (జీఈఈఎల్‌) చైర్మన్ పదవికి సుభాష్ చంద్ర రాజీనామా చేశారు. ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సంస్థ తెలిపింది. కంపెనీ ఎండీ, సీఈవోలతో చైర్‌పర్సన్‌కు బంధుత్వం వంటివి ఉండకూడదన్న సెబీ నిబంధనలకు లోబడి చంద్ర రాజీనామా చేసినట్లు జీఈఈఎల్‌ వివరించింది. ఆయన నాన్‌-ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా కొనసాగుతారు. అలాగే బోర్డును పునర్‌వ్యవస్థీకరించినట్లు, కొత్తగా ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు (ఆర్‌ గోపాలన్‌, సురేంద్ర సింగ్, అపరాజిత జైన్‌) నియమితులైనట్లు పేర్కొంది. కొత్త బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లు ఆరుగురు, ఎస్సెల్ గ్రూప్ (జీఈఈఎల్ మాతృసంస్థ) తరఫున ఇద్దరు ఉంటారు. రుణాల భారాన్ని తగ్గించుకునే దిశగా ప్రమోటర్ల వాటాలను మరింతగా విక్రయించేందుకు ఎస్సెల్ గ్రూప్ మార్గాలు అన్వేషిస్తున్న తరుణంలో చంద్ర రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. జూన్ 30న కంపెనీలో 35.79 శాతంగా ఉన్న ప్రమోటర్ల వాటా సెప్టెంబర్ 30 నాటికి 22.37 శాతానికి తగ్గింది. రుణాల రీపేమెంట్ కోసం జీఈఈఎల్‌లో 16.5 శాతం వాటాలు విక్రయించనున్నట్లు నవంబర్ 20న ఎస్సెల్ గ్రూప్ ప్రకటించింది. 



You may be interested

క్యాబ్ చార్జీ ఇక మీ చేతుల్లో

Tuesday 26th November 2019

హైదరాబాద్‌లో ఇన్‌డ్రైవర్‌ సేవలు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: క్యాబ్‌ చార్జీల విషయంలో ఇప్పటి వరకు అగ్రిగేటర్లదే తుది నిర్ణయం. రైడింగ్‌, పీక్‌టైం, సర్జ్‌ వంటి పేర్లతో కస్టమర్లపై అదనపు భారం మోపుతున్నాయి. ఇలాంటిది లేకుండా చార్జీని వినియోగదార్లే నిర్ణయించుకునేలా అమెరికాకు చెందిన ప్రముఖ క్యాబ్‌ అగ్రిగేటర్‌ ‘ఇన్‌డ్రైవర్‌’ తన సేవల్ని ప్రారంభించింది. ఈ సంస్థ డ్రైవర్‌ నుంచి ఎలాంటి కమిషన్‌ తీసుకోదు. కస్టమర్‌ నగదు రూపంలో చార్జీని డ్రైవర్‌కే చెల్లించాలి.

ఫండ్స్‌లో వేటిల్లోకి అధిక పెట్టుబడులు?

Tuesday 26th November 2019

పనితీరే గీటురాయి.. మ్యూచువల్‌ ఫండ్స్‌కు కూడా ఇదే వర్తిస్తుంది. పథకాల రాబడుల పనితీరును ఇన్వెస్టర్లు పరిశీలించి, సంతృప్తి చెందిన తర్వాతే ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. గతంలో అయితే ఏజెంట్లు, బ్రోకర్లు చెప్పిన వాటిల్లో ఇన్వెస్ట్‌ చేసే వారు. యాక్టివ్‌ నిర్వహణతో కూడిన ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకాల్లోకి వస్తున్న పెట్టుబడుల ప్రవాహాన్ని పరిశీలించినట్టయితే.. నిలకడైన రాబడుల చరిత్ర ఉన్న వాటిల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు.    39 అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు

Most from this category