News


టెక్నాలజీని చెడుగా చూపించే ప్రయత్నాలు

Monday 21st October 2019
news_main1571631381.png-29022

టెక్నాలజీ వారధిలా పనిచేస్తుంది: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: టెక్నాలజీని చెడుగా చూపించే ప్రయత్నాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ హెచ్చరించారు. భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. తన అధికారిక నివాసంలో ఆదివారం ప్రధాని మోదీ ‘బ్రిడ్‌జిటల్‌ ఇండియా’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడారు. ‘‘కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) వల్ల ప్రమాదాలు లేదా రోబోలు మానవులను మించిన మేథస్సును చూపిస్తే అన్న వాటిపై చర్చ కాదు కావాల్సింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మానవుల ఉద్దేశ్యాల మధ్య వారధి ఏ విధంగా ఏర్పాటు చేయాలన్న దానిపై చర్చ ఉండాలి. ఆకాంక్షలు, సాధనల మధ్య, డిమాండ్‌, డెలివరీ మధ్య, ప్రభుత్వం, పాలన మధ్య టెక్నాలజీ వారధిని ఏర్పాటు చేస్తుంది’’అని ప్రధాని పేర్కొన్నారు. టెక్నాలజీ అన్నది అనుసంధానిస్తుంది కానీ, వేరుచేయదన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. టెక్నాలజీ వల్ల ఎదురైన సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవాలని సూచిస్తూ ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు ఏర్పాటును ఉదాహరణగా పేర్కొన్నారు. టెక్నాలజీ అన్నది మొత్తం పోస్టల్‌ వ్యవస్థనే దెబ్బతీసిందని, కానీ, అదే పోస్టల్‌ విభాగం టెక్నాలజీ ఆధారిత బ్యాంకింగ్‌ వ్యవస్థగా మారిన సందర్భాన్ని గుర్తు చేశారు. తద్వారా లక్షలాది మందికి ప్రయోజనకారిగా మారినట్టు చెప్పారు. బ్రిడ్‌జిటల్‌ పుస్తకాన్ని టాటా సన్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌, టాటా సన్స్‌ ముఖ్య ఆర్థికవేత్త రూప పురుషోత్తం రచించారు. ఈ కార్యక్రమంలో టాటా సన్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా సైతం పాల్గొన్నారు. 



You may be interested

36 శాతం పెరిగిన ఎల్‌ఐపీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లాభం

Monday 21st October 2019

రూ.4,981 కోట్లకు పెరిగిన మొత్తం ఆదాయం  నికర వడ్డీ ఆదాయం 16 శాతం వృద్ధి  న్యూఢిల్లీ: ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 36 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.563 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ2లో రూ.768 కోట్లకు పెరిగిందని ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,205 కోట్ల నుంచి రూ.4,981 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నికర వడ్డీ

రాబడుల్లో మేటి పనితీరు

Monday 21st October 2019

-యాక్సిస్‌ బ్లూచిప్‌ ఫండ్‌ -డి.జయంత్‌కుమార్‌, థర్డ్‌పార్టీ ప్రొడక్ట్స్‌ హెడ్‌, కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌    ఈక్విటీ ఇన్వెస్టర్లకు గడిచిన ఏడాది, రెండేళ్లు పరీక్ష కాలం వంటిది. ఎన్నో అనిశ్చితులు, ఆందోళనలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. సూచీల్లో పెరుగుదల ఉన్నా కానీ, రిటైల్‌ ఇన్వెస్టర్లు రాబడులు పొందింది లేదు. కొందరు నష్టాలు కూడా చవిచూశారు. మార్కెట్‌ అంతటా పెరుగుదల లేకపోవడమే దీనికి కారణం. కేవలం కొన్ని కంపెనీలే మార్కెట్‌ పెరుగుదలకు దోహదపడ్డాయి. అందుకే అనిశ్చిత పరిస్థితుల్లో

Most from this category