News


కరోనా ఎఫెక్ట్‌: ఏ కంపెనీలకు ప్లస్‌...వేటికి మైనస్‌

Wednesday 19th February 2020
news_main1582110035.png-31939

కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి కారణంగా అతలాకుతలమైన చైనా ఫ్యాక్టరీ యాక్టివిటీ క్రమంగా కోలుకుంటుంది. ఇండియా కంపెనీలు ఈ అంటువ్యాధి గురించి ఆందోళన చెందనప్పటికీ.., ఆలస్యంగా త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన కొన్ని కంపెనీలు ఈ కరోనా పేరును ప్రస్తావించాయి. 

చైనా నుండి దిగుమతి అవుతున్న విడిభాగాల కొరత కారణంగా టెలివిజన్లు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఈ నెలలో ధరలను పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు నివేదికలు వెలువడ్డాయి. ఆయా కంపెనీలు డిస్కౌంట్లతో  ప్రమోషనల్ ఆఫర్లను తగ్గించుకోనున్న నేపథ్యంలో ధరలు 3-5 శాతం పెరిగే అవకాశం ఉందని కొందరు ఇండస్ట్రీ సీనియర్‌ పరిశ్రమ అధికారులు తెలిపారు.

టెలివిజన్‌ వంటి కొన్ని విద్యుత్‌ ఉత్పత్తుల ధరలు 7శాతం 10శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా కొరత కారణంగా టీవీ కాంపోనెంట్‌ ధరలు ఇప్పటికే 15నుంచి 20శాతం పెరిగాయి. చైనా నుంచి కీలకమైన ముడి పదార్థాల దిగుమతి ఆలస్యం కావడం కొన్ని వ్యాపారాలకు ప్రతికూలంగానూ, 
మరికొన్ని వ్యాపారాలకు అనుకూలంగానూ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

‘‘చైనాలోని వైరస్‌ కారణంగా ఫ్యాక్టరీలు, కొన్ని పారిశ్రామిక కేంద్రాలు మార్చి వరకు మూసివేసే అవకాశం ఉంది. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకు విదుల్లోకి చేరవద్దని చైనా అధికారులు కార్మికులను కోరే అవకాశం ఉంది. ఇది విస్తృతమైన ఉత్పత్తి నష్టాలకు దారితీస్తుంది’’ అని ఐసీఐసీ డైరెక్ట్‌ పేర్కొంది. 

ఆటో ఉపకరణల సంస్థ మదర్సన్ సుమి రాబోయే 8-10 రోజుల్లో చైనా వ్యాపారంపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆశిస్తోంది. తన అనుబంధ సంస్థ ఎస్‌ఎంఆర్‌పీబీవి 8శాతం ఆదాయం చైనా నుంచే వస్తుంది. ఈ కంపెనీకి చెందిన యూరోపియన్‌ యూనియన్‌లోని ఓఈఎం క్లయింట్లు కూడా చైనాకు ఎగుమతి చేస్తారు. భారత్ ఫోర్జ్ కరోనా వైరస్ నుండి ఎటువంటి భౌతిక ప్రభావాన్ని చూడలేదు. కానీ సంస్థ గ్లోబల్‌ సప్లై చైన్‌లో 30 శాతం చైనా నుండి వస్తుంది. అందువల్ల, అక్కడి యూనిట్లు మూసివేత మరికొంత కాలం కొనసాగితే కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతోంది. 

లోహ కంపెనీ హిందాల్కో గత నెలలో అల్యూమినియం సరఫరాలో ఎంతమేరకు అంతరాయం కలిగిందో ఇప్పుడే చెప్పలేమని తెలిపింది. అయితే చైనా నుంచి ముడిపదార్థం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో డిమాండ్-సరఫరా మధ్య సమతుల్యతను కాపాడేందుకు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్నామని పేర్కోంది. వేదాంత, నాల్కో, ఎన్‌ఎండీసీ లాంటి లోహ కంపెనీలకు వైరస్‌ వ్యాధి ప్రభావం ఉంటుందని ఫిలిప్‌క్యాపిటల్‌ రీసెర్చ్‌ సంస్థ తెలిపింది.

 ఫార్మా రంగం విషయానికొస్తే... చైనా మార్కెట్‌ నుంచి దివీస్‌ ల్యాబ్స్‌, ఇప్కా లాబ్స్‌, బయోకాన్‌ కంపెనీలు ఎక్కువగా లబ్దిపొందుతాయి. కరోనా వైరస్ తన వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఐటీ సంస్థ హెక్సావేర్ తెలిపింది. ఆటోమొబైల్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఎలక్ట్రికల్స్ విభాగపు తయారీ పరికరాలు చైనా నుంచి ఎక్కువగా దిగమతి అవుతున్న కారణంగా వైరస్ వ్యాప్తి ఈ రంగాలకు ప్రతికూలంగా ఉంటుంది.

అటో, అటో ఉపకరణాల విషయంలో...  చైనా నుండి భారత్‌లోకి కార్ల పరికరాల దిగుమతులు 22.1 శాతం పెరిగి 33 మిలియన్ డాలర్లకు చేరుకోగా, ఎగుమతులు 54 శాతం తగ్గి 11 మిలియన్ డాలర్లకు తగ్గాయి. చైనా నుంచి భారత్‌లోకి దిగుమతయ్యే జేఎల్‌ఆర్‌ వాహనాలు 17శాతం తగ్గినట్లు జియోజిత్‌ సెక్యూరిటీ ఒక ప్రకటనలో తెలిపింది. టాటా మోటార్స్, మదర్సన్ సుమి బాష్ లపై కరోనావైరస్ ప్రభావం ప్రతికూలంగా కనిపిస్తుంది.

కరోనా వైరస్‌ కారణంగా రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, టెలివిజన్ ప్యానెల్లు, ఎల్ఇడి చిప్స్  మోటార్లు వంటి కంప్రెసర్ల వంటి విడిభాగాల సరఫరా అంతరాయం ధరల పెరుగుదలతో పాటు కొరతకు దారితీస్తుంది. కాబట్టి వీటిపై ఆధారపడే వోల్టాస్‌, విర్ల్‌పూల్‌, హావెల్స్‌, వీగార్డ్‌ కంపెనీల వ్యాపారాలకు ప్రతికూలంగా మారుతుంది. 

ఈ ‍కంపెనీలకు అనుకూలం
ఆర్థిక సంవత్సరం 19లో చైనా నుండి  93 మిలియన్‌ డాలర్ల విలువైన టైర్లను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం చైనాలో నెలకొన్న కరోనా వైరస్‌తో ఉత్పత్తులు తగ్గడంతో ఎంఆర్‌ఎఫ్‌, అపోలో టైర్లు, జేకే టైర్స్‌కు ప్రస్తుతం వున్న పోటీ కొంత తగ్గుతుంది. వృద్ధి భయాలతో ముడిచమురు ధరల తగ్గుదల సియా పెయింట్స్, బజాజ్ కన్స్యూమర్ కేర్  జ్యోతి ల్యాబ్స్ కంటి కంపెనీలకు కలిసొస్తుంది. కరోనా వైరస్‌ కారణంగా రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, టెలివిజన్ ప్యానెల్లు, ఎల్ఇడి చిప్స్  మోటార్లు వంటి కంప్రెసర్ల వంటి విడిభాగాల సరఫరా అంతరాయం ధరల పెరుగుదలతో పాటు కొరతకు దారితీస్తుంది. కాబట్టి వీటిపై ఆధారపడే వోల్టాస్‌, విర్ల్‌పూల్‌, హావెల్స్‌, వీగార్డ్‌ కంపెనీల వ్యాపారాలకు ప్రతికూలంగా మారుతుంది. ప్రపంచ దుస్తులు, వస్త్ర ఎగుమతుల్లో 40శాతం వాటాను కలిగిన ఉన్న చైనాలో ఉత్పత్తులు తగ్గడంతో కేపీఆర్ మిల్స్, రేమండ్, ట్రైడెంట్ మరియు గోకల్‌దాస్‌ వంటి వస్త్ర సంస్థలకు కలిసొస్తుంది.  You may be interested

డీమార్ట్‌ అధినేత కొత్తగా కొన్న మూడు స్టాక్స్‌

Thursday 20th February 2020

డీమార్ట్‌ పేరుతో అత్యంత విలువైన రిటైల్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి, దేశంలో ముకేశ్‌ అంబానీ తర్వాత రెండో అత్యంత సంపన్నుడిగా అవతరించిన రాధాకిషన్‌ శివకిషన్‌ ధమానీ, టాప్‌ ఇన్వెస్టర్‌గానూ పరిచయస్తుడే. ఒకవైపు అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి ప్రమోటర్‌గా ఉన్న ఆయన, మరోవైపు తన తొలి వ్యాపారమైన స్టాక్‌ ఇన్వెస్టింగ్‌ను ఇప్పటికీ చురుగ్గానే కొనసాగిస్తున్నారు. డిసెంబర్‌ త్రైమాసికంలో రాధాకిషన్‌ ధమానీ కొత్తగా మూడు స్టాక్స్‌ను తన పోర్ట్‌ఫోలియోలోకి చేర్చుకున్నారు. అవి సింప్లెక్స్‌

బ్యాంక్‌ నిఫ్టీ జోరు!

Wednesday 19th February 2020

బుధవారం  బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌0.91త శాతం పెరిగి 30,842.05 వద్ద ముగిసింది. నిఫ్టీ​బ్యాంక్‌ ఇండెక్స్‌లో ఉన్న కంపెనీలలో ఐడీఎఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 3.77 శాతం పెరిగి 39.90 వద్ద,  ఫెడరల్‌ బ్యాంక్‌ 3.05 పెరిగి 84.35 వద్ద, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 1.54 శాతం పెరిగి 52.80వద్ద, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.15 శాతం పెరిగి1,227.20 వద్ద, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 1.01 శాతం పెరిగి 305.10 వద్ద, యాక్సిక్‌ బ్యాంక్‌ 1.07

Most from this category