News


గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 28th November 2019
news_main1574915135.png-29917

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
ఎప్‌ అండ్‌ ఓ డెరివేటివ్స్‌ ముగింపు:-
నేడు నవంబర్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టు ముగింపు తేది కావడంతో ట్రేడర్లు తన పొజిషన్లను డిసెంబర్‌ కాంట్రాక్టుకు రోలోవర్‌ చేసుకోనున్నారు. దీంతో నేడు మార్కెట్‌ కొంత ఒడిదుడుకులకు లోనుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
విదేశీ పెట్టుబడులు:- ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం బుధవారం ఎఫ్‌పీఐలు రూ.42.93 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను, డీఎఫ్‌ఐఐలు రూ.439.93 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. 
సాతిన్‌ క్రిడెట్‌ కేర్‌:- ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా మోర్గాన్‌ స్టాన్లీ కంపెనీ రూ.2.38 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు విక్రయించింది. 
జేఎస్‌డబ్ల్యూ సిమెంట్స్‌:- ఒడిశాలోని తన అనుబంధ సంస్థ శివ సిమెంట్స్‌ లో 4 ఏళ్లలో రూ.2875 కోట్ల క్యాపెక్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పెట్టి వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 25మెగాటన్నులకు ప్రణాళికలు సిద్ధం చేసింది. 
రాణే హోల్డింగ్స్‌:- ఇక్రా రేటింగ్‌ సంస్థ బ్యాంకు రుణ సదుపాయాలకు గానూ స్థిరత్వం అవుట్‌లుక్‌ను, ఎఎఎ(-) రేటింగ్‌ను ఎఎ(-) రేటింగ్‌కు అప్‌గ్రేడ్‌ చేసింది
బీఎస్‌ఈ లిమిటెడ్‌:- ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో సీడీఎస్‌ఎల్‌లో 4శాతం వాటాను విక్రయించేందుకు బోర్డు అనుమతినిచ్చింది
అటో ఆన్‌లైన్‌ ఇండస్ట్రీస్‌:-  కైనిటిక్‌ గ్రీన్‌తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ-సైకిల్స్‌ తయారీ, అభివృద్ధి నిమిత్తం ఇరు సంస్థల మధ్య ఒప్పందం పూర్తయినట్లు కైనెటిక్ గ్రూప్ చైర్మన్ అరుణ్ ఫిరోడియా చెప్పారు. 
బాలాజీ అమైన్స్‌:- మహారాష్ట్రలోని సోలాపూర్‌ యూనిట్‌కు ఎన్విరాన్‌మెంటల్‌ క్లియరెన్స్‌ లభించింది. 
ఎస్కార్ట్స్‌:- కంపెనీ స్వతంత్ర డెరెక్టర్‌ పదవికి డీజే కకలియయా రాజీనామా చేశారు.
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌:- గత ఆర్థిక సంవత్సరంలో సినిమా నిర్మాణాలకు కంపెనీ ఇచ్చిన రూ.2300ల కోట్ల అడ్వాన్సులపై, ఇతర కొన్ని అంశాలపై కంపెనీకి చెందిన ఇద్దరు మాజీ డైరెక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
టాటా స్టీల్‌:- యూకేలో 1000 ఉద్యోగాలకు తొలగించేందుకు సిద్ధమైంది.You may be interested

ఇండెక్స్‌ షార్ట్‌ పొజిషన్లు తగ్గించుకున్న ఎఫ్‌ఐఐలు

Thursday 28th November 2019

సూచీల్లో మరింత ర్యాలీకి అవకాశం విదేశీ ఫండ్స్‌ అక్టోబర్‌ నుంచి దేశీయ సూచీల్లో కొనుగోళ్ల జోరు పెంచాయి. దీంతో సూచీలు రికార్డు హైలకు చేరాయి. గతంలో తీసుకున్న బేరిష్‌ బెట్స్‌ను ఫండ్స్‌ వదిలించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందువల్ల తాజా బుల్‌ రన్‌ మరికొంత కాలం కొనసాగుతుందని డెరివేటివ్స్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. బుధవారానికి నవంబర్‌నెల్లో ఎఫ్‌ఐఐలు రూ.22710 కోట్ల కొనుగోళ్లు జరిపాయి. ఇదే సమయంలో నికర ఇండెక్స్‌షార్ట్స్‌ను 43327 కాంట్రాక్టుల నుంచి

ప్రారంభంలో సరికొత్త రికార్డు

Thursday 28th November 2019

నవంబర్‌ డెరివేటివ్‌ సీరిస్‌ కాంట్రాక్టుల ముగింపునకు చివరిరోజైన గురువారం స్టాక్‌ సూచీలు సరికొత్త రికార్డుస్థాయి వద్ద మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 140 పాయింట్ల లాభంతో 41,161 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 12,133 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. 

Most from this category