News


ఈ వారం స్టాక్‌ రికమెండేషన్లు

Monday 23rd December 2019
news_main1577071065.png-30365

ఓల్టాస్‌        కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ.650
టార్గెట్‌ ధర: రూ.765
ఎందుకంటే:
అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం ఈ కంపెనీకి ప్రయోజనం కలిగించనున్నది. అమెరికా ఆంక్షల కారణంగా చైనాలో యూసీపీ(యూనిటరీ కూలింగ్‌ ప్రొడక్ట్‌)ల నిల్వలు భారీగా  పేరుకుపోయాయి. ఇప్పుడు ఆంక్షలు తొలగిపోవడంతో ఈ నిల్వలు తగ్గించుకోవడానికి చైనా కంపెనీలు భారీగా డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తాయని, ఈ డిస్కౌంట్ల కారణంగా  యూసీపీ విభాగం నిర్వహణ లాభ మార్జిన్లు పెరుగుతాయని యాజమాన్యం భావిస్తోంది. పోటీ అంతకంతకూ తీవ్రమవుతున్నా సమీప కాలంలో ఈ కంపెనీ మార్కెట్‌ వాటా పెద్దగా తగ్గకపోవచ్చు. ఉత్పత్తులకు తగ్గ ధరలను నిర్ణయించడం, పటిష్టమైన విడిభాగాల సమీకరణ, శక్తివంతమైన డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌,.... ఈ అంశాల కారణంగా ఈ కంపెనీ మార్కెట్‌ వాటా తగ్గే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్థభాగంలో రూమ్‌ ఏసీ వ్యాపారంలో అమ్మకాలు 42 శాతం పెరిగాయి. 24.4 శాతం మార్కెట్‌ వాటాను సాధించింది. ఈఎమ్‌పీ(ఎలక్ట్రో మెకానికల్‌ ప్రాజెక్ట్స్‌ అండ్‌ సర్వీసెస్‌) సెగ్మెంట్‌ వృద్ధి జోరుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో ఆర్డర్లు 125 శాతం ఎగసి రూ.2,600 కోట్లకు పెరిగాయి. దీంతో మొత్తం ఆర్డర్‌ బుక్‌ 38 శాతం వృద్ధితో రూ.6,570 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్‌లో కూడా ఆర్డర్లు భారీగానే వస్తాయని కంపెనీ ఆంచనా వేస్తోంది. టర్కీకు చెందిన ఆర్సెలిక్‌తో ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌ విభాగం ఉత్పత్తులు వచ్చే నెల నుంచి మార్కెట్లోకి రానున్నాయి. ముందుగా ఫ్రిజ్‌లను, ఆ తర్వాత వాషింగ్‌ మెషీన్లను అందుబాటులోకి తేనున్నది. ఈ ఉత్పత్తుల ధరలను ఎల్‌జీ, శామ్‌సంగ్‌ ఉత్పత్తుల కంటే 3 శాతం కంటే తక్కువగానే నిర్ణయించనుండటం సానుకూలాంశం. 


ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌    కొనచ్చు
​బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌
ప్రస్తుత ధర: రూ.1,720
టార్గెట్‌ ధర: రూ.1,880
ఎందుకంటే:
లార్సెన్‌ అండ్‌ టుబ్రో (ఎల్‌ అండ్‌ టీ) గ్రూప్‌నకు చెందిన ఈ ఐటీ కంపెనీ ఆదాయం 2017-19 కాలానికి 18 శాతం వృద్ధి చెందింది. 2016-17 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో మొత్తం ఆదాయంలో 26 శాతంగా ఉన్న డిజిటల్‌ విభాగం వాటా ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో 40 శాతానికి పెరిగింది. ఈ క్యూ2లో ఆర్డర్లు  40 శాతం పెరగ్గా, 32 భారీ డీల్స్‌ సాధించింది. ఆ ఆర్థిక సంవత్సరం రెండో ఆర్థభాగంలో మరిన్ని భారీ డీల్స్‌ సాధించగలమని కంపెనీ ఆశిస్తోంది. అవసరమైన విభాగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఫలితంగా భారీ డీల్స్‌ను సాధిస్తోంది. పెద్ద పెద్ద కంపెనీలతో వ్యూహాత్మక భాగస్వా‍మ్యాలను కుదుర్చుకుంటోంది. ఫలితంగా లాభ మార్జిన్లు కంపెనీ ఆశించిన స్థాయిల్లోనే (14-15 శాతం) ఉండనున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ నికర లాభం 36 శాతం, ఆదాయం 29 శాతం చొప్పున వృద్ధి చెందాయి. రానున్న కాలంలో ఎనలిటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), మొబిలిటీ, 5జీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఓటీ) తదితర విభాగాల్లో మంచి వృద్ధిని సాధించగలమని కంపెనీ భావిస్తోంది.ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి పది లక్షల డాలర్ల ఆర్డర్లు ఇచ్చిన క్లయింట్ల సంఖ్య 137కు పెరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 16 రెట్ల ధరకు ఈ షేర్‌ ట్రేడవుతోంది. ఏడాది కాలంలో ఈ షేర్‌ రూ.1,880ను చేరగలదని భావిస్తున్నాం. You may be interested

తగిన ఫండ్‌ ఎలా ఎంచుకోవాలి ?

Monday 23rd December 2019

(ధీరేంద్ర కుమార్‌ వ్యాల్యూ రీసెర్చ్‌) ప్ర: నేను మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. నాకు తగిన ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలి ? -భారతి, విశాఖపట్టణం  జ: ఒక వ్యక్తి ఇన్వెస్ట్‌మెంట్స్‌ కోసం ఎలాంటి ఫండ్‌ను ఎంచుకోవాలి అనే విషయం  రకరకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీ ఆదాయం, వ్యయాలు, ఇప్పటికే ఉన్న అప్పులు, భవిష్యత్తు అవసరాలు, ఆర్థిక లక్ష్యాలు, వయస్సు, మీపై ఆర్థికంగా ఆధారపడి ఉన్న వాళ్లు, మీరు నెలకు ఎంత మేర ఇన్వెస్ట్‌

ఉక్కు ఉత్పత్తిలో తగ్గుదల

Monday 23rd December 2019

నవంబర్‌లో 2.8 శాతం క్షీణత న్యూఢిల్లీ: దేశీయంగా ముడి ఉక్కు ఉత్పత్తిలో తగ్గుదల నమోదైంది. తాజాగా వరల్డ్‌ స్టీల్‌ అసోసియేషన్‌ ప్రకటించిన గణాంకాల ప్రకారం.. గతనెల్లో మొత్తం ఉత్పత్తి 8.934 మిలియన్‌ టన్నులు (ఎంటీ)గా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలోని 9.192 ఎంటీలతో పోల్చితే 2.8 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో 3.4 శాతం తగ్గిన సంగతి తెలిసిందే కాగా, వరుసగా రెండు నెలల పాటు ఉత్పత్తిలో

Most from this category