News


రాష్ట్రాల్లో పన్నులు అధికం

Wednesday 28th August 2019
news_main1566967795.png-28068

కార్ల ధరలపై ప్రభావం 
వృద్ధి విషయంలో రాష్ట్రాలది పెద్ద బాధ్యత
మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్‌ భార్గవ వెల్లడి 

ముంబై: రాష్ట్రాల్లో పన్నులు అధికంగా ఉన్నాయని, ఫలితంగా కార్ల ధరలు పెరుగుతున్నాయని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్‌ ఆర్‌.సి. భార్గవ ఆవేదన వ్యక్తం చేశారు. ఉదాహరణకు పెట్రోల్‌పై రాష్ట్రాలు భారీగా పన్నులు విధిస్తున్నాయని, కొన్ని రాష్ట్రాలు రోడ్డు ట్యాక్స్‌ను బాగా పెంచాయని, ఫలితంగా కార్ల ధరలపై రాష్ట్రాల పన్ను భారం ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే, రోడ్డు ట్యాక్స్‌ పెంచిన రాష్ట్రాల్లో కార్ల అమ్మకాలు భారీగా తగ్గాయని వివరించారు. 

రాష్ట్రాలు తోడ్పాటునందించాలి...
తయారీ రంగంలో తమ పాత్ర విషయమై రాష్ట్రాలు తగిన విధంగా వ్యవహరించాలని భార్గవ సూచించారు. లేకుంటే 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ స్వప్నం సాకారం కావడం కష్టమని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ జరిగిన కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. తయారీ రంగం వృద్ధి చెందడానికి రాష్ట్రాల ప్రభుత్వాలు ఇతోధికంగా తోడ్పడాలని ఆయన సూచించారు. తయారీ రంగ జీడీపీలో వాహన రంగ వాటా 49 శాతమని ఆయన గుర్తు చేశారు.  ఆర్థిక వ్యవస్థ వృద్ధి పూర్తిగా కేంద్రం బాధ్యతే కాదని, రాష్ట్రాలది కేంద్రం కంటే పెద్ద బాధ్యత అని పేర్కొన్నారు. . 

వాహన పరిశ్రమతో భారీగా ఉద్యోగాలు..
వాహన పరిశ్రమ కారణంగా రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగవకాశాలు ఏర్పడ్డాయని భార్గవ చెప్పారు. కానీ మందగమనం కారణంగా అమ్మకాలు తగ్గడం వల్ల నిరుద్యోగం పెరుగుతోంది పేర్కొన్నారు. వాహన పరిశ్రమ కారణంగా రాష్ట్రాలకు భారీగా ఆదాయం సమకూరుతోందని, ఒకవేళ వాహన పరిశ్రమ దెబ్బతింటే, ఈ ఆదాయానికి గండి పడుతుందని ఆయన హెచ్చరించారు. వడ్డీరేట్లు తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బ్యాంక్‌లకు సూచించారని, ఫలితంగా వడ్డీరేట్లు దిగివస్తున్నాయని భార్గవ వివరించారు. వడ్డీరేట్లు తగ్గేలా చూసినందుకు ఆర్థిక మంత్రికి ఆయన కృతజ్జతలు చెప్పారు.



You may be interested

నష్టాల్లో జిందాల్‌, వేదంతా, హిందల్కో

Wednesday 28th August 2019

యుఎస్‌-చైనా ఒప్పందం గురించి మాట్లాడడానికి యుఎస్‌ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఫోన్‌ కాల్స్‌ చైనా ప్రభుత్వానికి రాలేదని, యుఎస్‌ ఇలాంటి తప్పుడు చర్యలను ఆపి, చర్చలకు ఉపకరించే పరిస్థితిని తీసుకురావలని చైనా వైస్ ప్రీమియర్ లియు హి అన్నారు. ఫలితంగా ట్రేడ్‌ వార్‌ ఆందోళనలు ముదరడంతో అంతర్జాతీయ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దీంతో దేశియ మార్కెట్లు కూడా నెగిటివ్‌లో ఉన్నాయి. ఉదయం 10.43 సమయానికి నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌

100 లక్షల కోట్లకు మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు

Wednesday 28th August 2019

వచ్చే పదేళ్లలో చేరుకోవాలని యాంఫి లక్ష్యం ప్రస్తుతం ఫండ్స్‌ నిర్వహణలో  రూ.25 లక్షల కోట్లు న్యూఢిల్లీ: వచ్చే దశాబ్ద కాలంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ తన నిర్వహణలోని ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఇప్పుడున్న రూ.25 లక్షల కోట్ల నుంచి 100 లక్షల కోట్లకు పెంచుకోవాలని లక్ష్యం విధించుకుంది. అలాగే, ఇన్వెస్టర్ల సంఖ్యను 2 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచుకోవాలన్నది పరిశ్రమ లక్ష్యమని మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ యాంఫి బీసీజీ విజన్‌ డాక్యుమెంట్‌ పేర్కొంది.

Most from this category